Guppedanta Manasu, August 29th episode: షాక్ తో కుప్పకూలిన దేవయాని.. శైలేంద్రని చంపటానికి బయలుదేరిన మహేంద్ర!

మహేంద్ర ని చంపాలని ప్లాన్ చేస్తాడు శైలేంద్ర. విషయం ముందే గ్రహించిన రిషి తండ్రిని కాపాడుకుంటాడు. ఆ పని శైలేంద్ర చేశాడని తెలుసుకున్న దేవయాని కొడుకుని మందలిస్తుంది. మీ బావని ఆ వసుధార సొంతం చేసుకుంటుంది వెళ్లి మీ బావని దక్కించుకో అని సరోజని రెచ్చగొట్టి పంపిస్తాడు శైలేంద్ర. రిషి రాధమ్మకి నిజం చెప్పి అసలు రంగాని ఆమెకి అప్పగిస్తాడు. రంగా గా వచ్చింది రిషి అని కన్ఫర్మ్ చేసుకున్న శైలేంద్ర తన గురించి తెలిసిన అందర్నీ లేపేయాలి అనుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 29 వ తేదీ ఎపిసోడ్ 1,166ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

తన తల్లి ఎవరో చెప్పమని అనుపమ ని నిలదీస్తాడు మను. కానీ మౌనంగా ఉంటుంది అనుపమ. ఆ మౌనాన్ని భరించలేక పోతాడు మను, కోపంతో రగిలిపోతూ నేనేమీ గండికోట రహస్యం అడగడం లేదు నా జన్మ రహస్యం అడుగుతున్నాను నా తల్లి ఎవరో చెప్పండి అని గట్టిగా అడుగుతాడు. అయినా మౌనంగా ఉన్న అనుపమని చూసి కోపం పట్టలేని మను నిజం చెప్పమని తనకి తానే గన్ గురి పెట్టుకొని బెదిరిస్తాడు. అనుపమ కంగారు పడుతుంది. మరోవైపు తండ్రికి జగతి రాసిన లెటర్ ఇచ్చి చదవమంటాడు రిషి.మహేంద్ర మొదటినుంచి చదువుతూ ఉంటే మీరు చదవవలసింది ఈ పేజీ నుంచి అంటూ ఒక పేజీ చూపిస్తాడు రిషి.

Guppedanta Manasu Episode number 1 166 August 29th 2024 Manu is shocked to know who his mother is

అందులో మనకి ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒకరు మను ఒకరు రిషి. మనుని అనుపమకి పెంచుకోవడానికి ఇచ్చాను, ఈ విషయం నీకు, రిషికి చెప్పలేనందుకు నన్ను క్షమించండి, మీకు నిజం తెలిసే సమయానికి నేను ఉంటానో లేదో అందుకే ఈ విషయం లెటర్లో రాస్తున్నాను అని రాస్తుంది జగతి. అది చదివి ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. అందుకేనా మను ని చూడగానే అంత ఎఫెక్షన్ కలిగేది అంటాడు మహేంద్ర. అదే సమయంలో అనుపమ కూడా మనుకి జరిగిందంతా చెప్తుంది. జగతి, మహేంద్ర నీ తల్లిదండ్రులు, ఒకానొక సమయంలో నేను తల్లిని కాలేనని తెలిసింది, నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా అదే. కానీ నా గురించి ఆలోచించిన జగతి తన కొడుకుని నాకు ఇచ్చేసింది.

అప్పటినుంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను, కానీ తండ్రి లేని లోటు ఎప్పటికీ లోటే నిన్ను నీ తండ్రికి దూరం చేసినందుకు నన్ను క్షమించు అంటుంది అనుపమ. అమ్మ అని బాధగా అంటాడు మను. నేను అమ్మను కాదు జగతి మీ అమ్మ అనే ఏడుస్తూ చెప్తుంది అనుపమ. ఈ మాటలన్ని విన్న మను షాక్ లో ఉండిపోతాడు. మరోవైపు శైలేంద్ర చెప్పిన మాటలు విని భయంతో కుప్పకూలిపోతుంది దేవయాని. నిజంగానే తాను రిషియా, నువ్వు కన్ఫామ్ చేసుకున్నావా అని అడుగుతుంది.

Guppedanta Manasu Episode number 1 166 August 29th 2024 Manu is shocked to know who his mother is

కన్ఫామ్ చేసుకున్నాను అంటూ జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర. మనం రిషిని తీసుకువచ్చి మన గొయ్యి మనమే తగ్గుకున్నాము జీవితంలో చాలా పెద్ద తప్పు చేసాము, ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు, భయంతో కాళ్లు చేతులు ఆడటం లేదు అంటుంది దేవయాని. ఇప్పుడు చేయాల్సింది ఒకటే,నా గురించి తెలిసిన ఏ ఒక్కరూ బ్రతికి ఉండటానికి వీల్లేదు అందరినీ ఒకేసారి మట్టిలో కప్పెట్టేస్తాను అంటాడు శైలేంద్ర. అలా చేయొద్దు అంటుంది దేవయాని. ఈ విషయంలో నీ మాట వినను, నన్ను ఆపొద్దు అంటూ తల్లి పై కోప్పడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర.

మరోవైపు మహేంద్ర జగతి రాసిన మిగిలిన ఉత్తరం అంతా కూడా చదువుతాడు. అందులో శైలేంద్ర, దేవయాని చేసిన దుర్మార్గాలన్నీ రాస్తుంది. ఈ విషయాలన్నీ తెలిసి ఎలా కూల్ గా ఉండగలుగుతున్నావు అంటాడు మహేంద్ర. వాళ్ల చేసిన అరాచకాలకి వాళ్ళని ఎన్నిసార్లు చంపినా తప్పులేదు కానీ మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము, బంధాల విలువ వాళ్లకు తెలియకపోవచ్చు కానీ మనకు తెలుసు కదా అయినా చంపటం మాత్రమే శిక్ష కాదు అంటాడు రిషి.

Guppedanta Manasu Episode number 1 166 August 29th 2024 Manu is shocked to know who his mother is

తర్వాత వసుధారకి క్షమాపణలు చెప్పి ఎన్నిసార్లు వాళ్ల గురించి నిజం చెప్పాలని ప్రయత్నించినా నేను పట్టించుకోలేదు అంటాడు. తర్వాత తల్లి ఫోటో దగ్గరికి వెళ్లి ఆమెకి కూడా క్షమాపణ చెప్పి వాళ్ళు పదవుల కోసం ఇంత దూరం వెళ్తారని అనుకోలేదు నిన్ను నేను రక్షించుకోలేకపోయాను అని బాధపడతాడు రిషి. ఇంతలోనే తలుపు గడియపెట్టిన సౌండ్ రావడంతో రిషి, వసుధార అటువైపు చూస్తారు. అప్పటికే మహేంద్ర బయటకు వెళ్లి బయట తలుపు గడియ పెడతాడు. రిషి, వసుధారలు వెళ్లి ఎందుకు తలుపు వేశారు అని కంగారుగా అడుగుతారు.

ఆ దుర్మార్గుడిని క్షమించే అంత మంచితనం నీకు ఉన్న నాకు లేదు ఈరోజు ఎలాగైనా వాడిని చంపుతాను నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎంతగా వారించినా వినిపించుకోకుండా మహేంద్ర వెళ్లిపోవడంతో డాడ్ ఆవేశంగా వెళ్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో పెదనాన్నకి ఫోన్ చేసి చెప్తాను అంటూ ఫణీంద్ర కి ఫోన్ చేస్తాడు కానీ ఫణీంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇప్పుడు ఏం చేయటమా అని కంగారు పడతాడు. అప్పుడు ఉండండి ధరణి మేడమ్ కి ఫోన్ చేస్తాను అని ఫోన్ తీసుకురావడానికి వెళుతుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపు ఎపిసోడులో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X