Guppedanta Manasu June 11th episode: వసుధారపై ఒత్తిడి తీసుకొస్తున్న ఫణీంద్ర.. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో
రిషి గురించి పేపర్లో ప్రకటన ఇస్తుంది వసుధార. ఆ నెంబర్ కి కాల్ చేసి వసుధారని ఒక ఆట ఆడుకుంటాడు శైలేంద్ర. ఆ తర్వాత కాలేజీకి ఎగ్జామినేషన్స్ సెంటర్ రాకుండా చేస్తాడు. ఇదే విషయం గా మినిస్టర్ వసుధారపై ఫైర్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కధ. ఇక జూన్ 11వ తేదీ ఎపిసోడ్ 1098 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
రావాలి అనుకున్న వాడు ఇప్పటికే వచ్చేవాడు ఇప్పటివరకు రాలేదు అంటే ఇకమీదట రాడని అర్థం చేసుకోవాలి, నిజానికి నా కొడుకు కన్నా ఎక్కువగా రిషి ని ప్రేమించాను, భూషణ్ ఫ్యామిలీకి వాడే అసలైన వారసుడు అనుకున్నాను కాని అంతలోనే ఇలా జరిగింది. అలా జరిగినందుకు నాకు కూడా బాధగా ఉంది.

ఏ మనిషికైనా ఎక్స్పెరి డేట్ ఉంటుంది, ఎంత గొప్పవాడైనా అతని టైం అయిపోగానే అతను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే అది నువ్వు అర్థం చేసుకోవాలి. చనిపోయాడు అనే విషయాన్ని ఒప్పుకో అంటాడు ఫణీంద్ర. మీరు ఎన్నైనా చెప్పండి కానీ ఈ విషయంలో నా నిర్ణయంలో మార్పు లేదు, నేను ఉన్నాను అంటే రిషి సార్ ఉన్నట్లే అంటుంది వసుధార. అలా మొండిగా మాట్లాడుతావేంటి, నిన్న మీటింగ్ లో కూడా మినిస్టర్ గారితో అలాగే మాట్లాడావంట కదా..
రిషి అంటే నీ ఒక్కదానికే ప్రేమ ఉన్నట్లు అలా మాట్లాడతావేంటి, మాకు మాత్రం ప్రేమ లేదా అయినా మేము మా బాధని మనసులోనే ఉంచుకోవడం లేదా, అసలు ఆ రోజే కర్మకాండలు జరిపి ఉంటే ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కాదు, ఇప్పటికైనా రిషి లేడనే విషయాన్ని ఒప్పుకో అంటుంది దేవయాని. శైలేంద్ర కూడా వసధారని ఒప్పించాలని చూస్తాడు కానీ వసుధార ఒప్పుకోదు.

అప్పుడు ఫణీంద్ర మాట్లాడుతూ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలమ్మా కాలేజీలో రిషి పేరుతో సంతాప సభ ఏర్పాటు చేస్తే కొన్ని రోజులలో అందరూ అన్నీ మర్చిపోయి ఎవరి పనులలో వారు పడతారు అప్పుడు అన్ని సమస్యలు సర్దుమణుగుతాయి అంటాడు. వారం పది రోజులలో మీరు మర్చిపోగలరేమో కానీ నేను మరిచిపోలేను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. అలా వెళ్ళిపోతుంది ఏంటి తనకి నువ్వైనా నచ్చజెప్పు అని మహేంద్రతో అంటాడు ఫణీంద్ర.
క్షమించండి అన్నయ్య తను ఏది నమ్మితే నేను అదే నమ్ముతాను, నేను తనకి సపోర్టుగా ఉంటాను అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు మహేంద్ర. ఇంటికి వచ్చిన తర్వాత మీ నిర్ణయాన్ని చెప్పమన్నప్పుడు ఎందుకు చెప్పలేదు మామయ్య అని మహేంద్ర ని నిలదీస్తుంది వసుధార. నీ నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పాను కదమ్మ అంటాడు మహేంద్ర. మీరు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అని అడుగుతాడు మను.
నేను ఇప్పటికీ రిషి సార్ ఉన్నారని నమ్ముతున్నాను, నేను ఊపిరితో ఉన్నాను అంటే కచ్చితంగా ఆయన కూడా ఉన్నట్లే ఆయన లేకపోతే నేను బ్రతికున్న లేనట్లే అంటుంది వసుధార. అలా అంటే ఎలా ఏదో నిర్ణయం తీసుకోమని మినిస్టర్ గారు చెప్పారు కదా అంటాడు మను. నా నిర్ణయాన్ని నేను రేపు బోర్డు మీటింగ్లో చెప్తాను అంటుంది వసుధార. ఏం నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతాడు మహేంద్ర.

కొన్ని నిర్ణయాలు అందరిలోనూ చెప్తేనే బాగుంటుంది రేపు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి అని మనుతో చెప్తుంది వసుధార. మీటింగ్ కి మహేంద్రని, అనుపమను కూడా రమ్మని చెప్తుంది. మినిస్టర్ గారిని కూడా మీటింగ్ కి రమ్మని చెప్పండి అని మహేంద్రకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో బోర్డు మీటింగ్ లో ఉన్న మినిస్టర్ ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. తెలియదు అని సమాధానం చెప్తారు ఫణీంద్ర, మహేంద్ర.
వసుధార ఏమ్ నిర్ణయం తీసుకోబోతుంది ఏది తీసుకున్నా నాకు అనుకూలంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. మీటింగ్ లో ఉన్న అందరూ ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని క్యూరియాసిటీతో ఉంటారు. అప్పుడే మను వసుధార దగ్గరికి వెళ్లి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అని అడుగుతాడు. మీటింగ్ లో చెప్తాను అంటుంది వసుధార. మీటింగ్ లో ఎలాగో చెప్తారు కానీ ఇక్కడ నాకు చెప్పండి అంటాడు మను. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











