Guppedanta Manasu June 12th episode: తన డెసిషన్ చెప్పి అందరికీ షాకిచ్చిన వసుధార.. తీవ్ర ఆందోళనలో మహేంద్ర!

కాలేజీకి ఎగ్జామినేషన్స్ సెంటర్ రాకుండా చేస్తాడు. ఇదే విషయం గా మినిస్టర్ వసుధారపై ఫైర్ అవుతాడు. రిషి లేడనే విషయాన్ని ఒప్పుకోమంటూ ఒత్తిడి తెస్తారు ఫణీంద్ర వాళ్ళు. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కధ. ఇక జూన్ 12వ తేదీ ఎపిసోడ్ 1099 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ వసుధారని అడుగుతాడు మను. మీటింగ్ లో చెప్తాను కదా అప్పుడు మీకే తెలుస్తుంది అంటుంది వసుధార. చెప్తారు కానీ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే కంగారు ఉంది అంటాడు మను. చచ్చిపోనులెండి అంటుంది వసుధార. అవేం మాటలు మేడం అంటాడు మను.

నిజమేనండి, చచ్చిపోను మీరు చాలా తక్కువ సమయంలోనే నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు, అందుకు మీకు థాంక్స్ అంటుంది వసుధార. ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటాడు మను. ఈరోజు ముగిసేలోపు మీ అన్వేషణ ఫలిస్తుంది అంటుంది వసుధార. అంతలోనే అటెండర్ వచ్చి మీటింగ్ కి అందరూ వచ్చేసారు మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు అని చెప్పడంతో ఇద్దరూ మీటింగ్ కి బయలుదేరుతారు.

Guppedanta Manasu Episode number 1099 June 12 th2024 Minister who apologized to Vasudhara

మీటింగ్ లో కూర్చున్న వసుధార లేటుగా వచ్చినందుకు క్షమించండి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు మన అయిన వాళ్లతో చెప్పుకుంటాం కదా అలాగే నేను రిషి సార్ తో చెప్పుకున్నాను అంటుంది వసుధార. ఆ సోది అంతా ఎందుకు అసలు మీటింగ్ ఎందుకు పెట్టావో చెప్పు అని మనసులోనే చికాకు పడతాడు శైలేంద్ర. ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేసావమ్మ అని అడుగుతాడు మినిస్టర్.

ఈ కాలేజీతో నాకు చాలా అనుబంధం ఉంది ఈ కాలేజీలో అడుగుపెట్టిన మొదటి రోజు ఇంకా గుర్తుంది అనే కాలేజీ గురించి చెప్తూ ఎమోషనల్ అవుతుంది వసుధార. అలాంటి ఈ కాలేజీని వదిలేస్తున్నాను, ఎండి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాను అంటుంది వసుధార. ఆమె నిర్ణయానికి అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార ముందు ఆ రిజగ్నేషన్ లెటర్ వెనక్కి తీసుకో అంటాడు మహేంద్ర.

Guppedanta Manasu Episode number 1099 June 12 th2024 Minister who apologized to Vasudhara

ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు మావయ్య అంటుంది వసుధార. ఈ కాలేజీ డౌన్ ఫాల్ అవుతుందనే భయంతో నిన్న నీ మీద కొంచెం రాష్ గా మాట్లాడాను అందుకు హర్ట్ అయి ఉంటే క్షమించు, అందరికీ కాలేజీ అంటే ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం కాలేజీ మీద అభిమానంతోనే అలాగే మాట్లాడాను అంటాడు మినిస్టర్. లేదు సార్ నా నిర్ణయం వెనుక కారణం అది కాదు అంటుంది వసుధార. నువ్వు ఎండి గా కొనసాగాలంటే మేము ఏం చేయాలో చెప్పు అంటాడు మినిస్టర్.

అందరూ కలిసి వసుధార డెసిషన్ మార్చేస్తారేమో అనుకొని శైలేంద్ర మాట్లాడుతూ ఆమెని ఇబ్బంది పెట్టకండి, తను మానసికంగా ఎంత నలిగిపోయి ఉంటే తను ఆ రిజగ్నేషన్ ఇస్తుంది అంటూ వసుధారని సపోర్టు చేస్తూ మాట్లాడుతాడు. నువ్వు నోరు ముయ్యు అని కొడుకుని కోప్పడతాడు ఫణీంద్ర. మళ్ళీ మినిస్టర్ మాట్లాడుతూ నువ్వు ఎండి గా ఉండాలంటే మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటాడు. మీరు రిషి సార్ ఉన్నారని నమ్మాలి అంటుంది వసుధార. లేని మనిషిని ఉన్నాడని ఎలా నమ్ముతాం అంటాడు శైలేంద్ర.

Guppedanta Manasu Episode number 1099 June 12 th2024 Minister who apologized to Vasudhara

మరొక బోర్డు మెంబర్ మాట్లాడుతూ ఇదేదో బ్లాక్ మెయిల్ చేసి ఎండిగా ఉంటున్నట్లుంది అంటాడు. అందుకే సర్ నేను రిజగ్నేషన్ ఇస్తున్నాను, రిషి సార్ చనిపోయారు అని మీరు అనుకుంటున్నారు అంటే నేను కూడా చనిపోయినట్లే, మూడు నెలల లో రిషి సార్ ని తీసుకువస్తానని చెప్పాను తీసుకురాలేకపోయాను అందుకే నాకు ఎండిగా ఉండే అర్హత లేదు అంటుంది వసుధార. నీ తరువాత ఎండి గా ఉండే అర్హత ఎవరికి ఉంటుంది అంటాడు మినిస్టర్.

అది నాకు అనవసరం ఓటింగ్ ద్వారా ఎంచుకుంటారో లేదంటే వారసత్వంగా ఇచ్చుకుంటారో మీ ఇష్టం దాంతో నాకేమీ సంబంధం లేదు. రిషి సార్ లేరు అని నమ్ముతున్న మీతో నేను కలిసి పని చేయలేను అంటూ రిజగ్నేషన్ లెటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే మహేంద్ర ఆమెని ఆపాలని చూస్తాడు. మావయ్య నాతో వచ్చినా,నన్ను ఆపాలని చూసినా నేను చచ్చినంత ఒట్టు అంటుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X