Guppedanta Manasu June 13th episode: వసుధార లెటర్‌లో ఏం రాసింది?.. అదిరిపోయేలా రిషి రీఎంట్రీ!

కాలేజీకి ఎగ్జామినేషన్స్ సెంటర్ రాకుండా చేస్తాడు. ఇదే విషయం గా మినిస్టర్ వసుధారపై ఫైర్ అవుతాడు. రిషి లేడనే విషయాన్ని ఒప్పుకోమంటూ ఒత్తిడి తెస్తారు ఫణీంద్ర వాళ్ళు. వసుధార బోర్డు మీటింగ్ పెట్టి ఎండి సీట్ ని వదిలేస్తున్నాను అని చెప్తుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 13వ తేదీ ఎపిసోడ్ 1100 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

వసుధార నిజంగానే కాలేజీ వదిలి వెళ్ళిపోయిందా లేదంటే క్యాబిన్లో కూర్చొని బాధపడుతుందా అనుకుంటూ ఆమె క్యాబిన్ కి వెళ్తాడు శైలేంద్ర. అక్కడ వసుధార లేకపోవడంతో చాలా ఆనందపడతాడు. ఇప్పటికే ఈ సీటు నా కళ్ళ ముందే ముగ్గురు మారారు కానీ ఈ సీట్లో కూర్చుని అదృష్టం నాకు ఇంకా రాలేదు. ఇప్పుడు ఇంకా ఈ సీటు నాదే అనుకుంటాడు. అంతలోనే ల్యాప్టాప్ కింద ఒక లెటర్ కనిపిస్తుంది.

Guppedanta Manasu Episode number 1100 June 13 th2024 Shailendra is happy to leave Vasudhara College

ఆ లెటర్ చదివిన శైలేంద్ర ఒకసారిగా షాక్ అవుతాడు ఇంత పెద్ద విషయం నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది వేరే వాళ్లకు తెలిస్తే ఏం జరిగేదో ఈ లెటర్ ఎవరి కంట్లోని పడకుండా చూసుకోవాలి అనుకుంటూ ఆ లెటర్ ని సూట్ లో దాచేసుకుని బయటికి వస్తాడు. అప్పుడే మహేంద్ర, మను వాళ్లు వసుధారని వెతుక్కుంటూ వస్తారు. అటెండర్ ని వసుధార క్యాబిన్ లో ఉందా అని అడుగుతారు.

లేరు అని చెప్తాడు అటెండర్. ఎక్కడికి వెళ్లిపోయిందో ఏంటో అనుకుంటాడు మహేంద్ర. అంతలోనే వసుధార ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తుంది అందులో నిజంగానే మీరు నా గురించి వెతకొద్దు, నా చుట్టూ ఉన్నవాళ్లు అయినా రిషి సార్ ఉన్నారు అనే నా నమ్మకాన్ని బలపరుస్తారని అనుకున్నాను.కానీ వాళ్ళకి కూడా నా నమ్మకం మీద నమ్మకం లేకుండా పోయింది.

అందుకే వెళ్ళిపోతున్నాను నేను కాలేజీకి రావడం అంటూ జరిగితే రిషి సార్ తోనే లేదంటే ఇకమీదట అసలు కాలేజీకి రాను మామయ్య, జాగ్రత్త, ఉంటాను అంటూ వాయిస్ మెసేజ్ ముగిస్తుంది. మహేంద్ర మను ఇద్దరూ వసుధారకి ఫోన్ చేస్తారు కానీ ఫోన్ రీచ్ అవ్వదు. అటెండర్ తో కాలేజీ చుట్టుపక్కల అందర్నీ వెతకమని చెప్పు అని పంపిస్తాడు మహేంద్ర. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అంటాడు శైలేంద్ర.

Guppedanta Manasu Episode number 1100 June 13 th2024 Shailendra is happy to leave Vasudhara College

ఇప్పుడే కదా కనిపించకుండా పోయింది అప్పుడే కంప్లైంట్ ఏంటి అని శైలేంద్ర పై ఫైర్ అవుతాడు మహేంద్ర.ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదో అంటూ మను కూడా శైలేంద్ర పై ఫైర్ అవుతాడు. వసుధార కనిపించకుండా పోవడంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే మాత్రం నేను ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మహేంద్ర. ఇప్పటివరకు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు ఇకపై ఇన్వాల్వ్ అవుతాను.

ఆ వసుధార ఎలాగూ కనిపించకుండా పోయింది కాబట్టి ఆమెని అట్నుంచి అటే పైకి పంపించేస్తాను. అప్పుడు నా ఆయుధం ఈ లెటర్ అవుతుంది ఈ లెటర్ ని ఎప్పుడు ఉపయోగించుకోవాలో అప్పుడే ఉపయోగించుకుంటాను అంటూ జేబు తడుముకుంటాడు శైలేంద్ర. మరోవైపు వసుధార రిషి,వసుధార ఎప్పుడూ కలుసుకునే అమ్మవారి దగ్గరికి వచ్చి రిషి ని తనకి కనిపించేలాగా చేయమని కన్నీటితో వేడుకుంటుంది. వెనక్కి తిరిగేసరికి ఆమెని ఎవరో కిడ్నాప్ చేస్తారు.

Guppedanta Manasu Episode number 1100 June 13 th2024 Shailendra is happy to leave Vasudhara College

తర్వాత పాండు శైలేంద్ర కి వసుధారని కిడ్నాప్ చేశాను అని చెప్పి ఫోన్ చేస్తాడు. నమ్మకం కుదరని శైలేంద్ర వీడియో కాల్ చేయమంటాడు. పాండు వీడియో కాల్ చేస్తే అపస్మారక స్థితిలో ఉన్న వసుధారని చూసి ఆనందంతో తనని భూమిలో కలిపేయండి కానీ ఎవరికీ దొరక్కుండా చూసుకోండి అని హెచ్చరిస్తాడు. సరే అని ఫోన్ కట్ చేసిన పాండు మనవాళ్ళకి చెప్పి గొయ్యి రెడీ చేయమని చెప్పు అని తన అసిస్టెంట్ కి చెప్తాడు. తర్వాత ఆమెని స్పాట్ కి తీసుకువెళ్తారు పాండు వాళ్లు.

వాళ్ళందరూ గుయ్యి తవ్వే పనిలో ఉండగా అప్పుడే మెలకువ వచ్చిన వసుధార జరిగింది గ్రహించి భయంతో అక్కడ నుంచి పరుగులు తీస్తుంది. అది గ్రహించిన పాండు వాళ్ళు వసుధార ని వెంబడిస్తారు. అప్పుడే రిషి ఆమెని ఆపి వచ్చిన వాళ్ళతో ఫైట్ చేస్తాడు.రిషిని చూసిన వసుధార షాక్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X