Guppedanta Manasu July 10th episode: రంగా అయితే నీ వద్దకు.. రిషి సార్ అయితే నా వద్దే.. సరోజకు వసుధార షాక్

దేవయాని, శైలేంద్ర కాలేజీకి వెళ్లి మనుని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతారు. ఈ విషయంపై మండిపడిన మహేంద్ర అనుపమను తీసుకొని ఫణీంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అనుపమ దేవయానికి చివాట్లు పెడుతుంది. పరాయి ఆడపిల్లని ఇంట్లో పెట్టుకున్నాడని రంగా ఇంట్లో పంచాయతీ పెడతాడు సరోజ తండ్రి. మరోవైపు మను తండ్రి ఎవరో నాకు తెలుసు నిజం చెప్పకూడదంటే నువ్వు మనవుని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని అనుపమని బ్లాక్ మెయిల్ చేస్తాడు ఒక అగంతకుడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 10 వ తేదీ ఎపిసోడ్ 1,123 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

రాధమ్మ దగ్గరికి వచ్చిన వసుధార నిజంగా మీ మనవడి పేరు రంగా యేనా తను చిన్నప్పటి నుంచి మీ దగ్గరే పెరిగాడా, ఏం చదువుకున్నాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఆ మాటలకి కంగారు పడిపోతుంది రాధమ్మ వాడు నిజంగానే నా మనవడు, నువ్వు ఊర్లో కూడా ఎంక్వయిరీ చేశావు కదా ఇంకా అనుమానం పోలేదా అంటుంది రాధమ్మ. నిజంగా ఆయన మీ మనవడు అయితే మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటుంది వసుధార. అలాంటిదేమీ లేదు అంటుంది రాధమ్మ. ఇన్నాళ్లు రిషి సర్ ని మీరు ప్రేమగా పెంచినందుకు చాలా సంతోషం అందుకే రిషి సార్ తో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాను అంటుంది వసుధార.

Guppedanta Manasu July 10th 2024 Episode number 1123 Here is the Full story

ఆ మాటలకి నవ్వుతుంది రాధమ్మ. నువ్వు రంగాని ఇంటికి తీసుకు వెళ్లేసరికి అక్కడ మీ రిషి సార్ ఉంటే ఏం చేస్తావు అని అడుగుతుంది రాధమ్మ. రిషి సార్ ఇక్కడ ఉంటే అక్కడ ఎలా ఉంటారు అని నమ్మకంగా అంటుంది వసుధార. నువ్వు, నీ నమ్మకం నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు వెళ్లి ప్రశాంతంగా పడుకో అని రాధమ్మ చెప్పడంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది వసుధార. వాళ్ళ మాటలు అన్ని రంగా చాటుగా వింటాడు.

మరుసటి రోజు పొద్దున్నే రంగా, వసుధార బయలుదేరబోతుంటే అక్కడికి సరోజ వస్తుంది. నీకు గిఫ్ట్ ఇస్తానన్నాను కదా అలా వెళ్ళిపోతావేంటి అని అడుగుతూ తను బావ అంటే తనకు చాలా ప్రాణమని తను లేకపోతే ఉండలేనని చెప్తుంది. నీ బాధ నాకు అర్థమైంది కానీ నీది కానిది నీ దగ్గరికి ఎప్పుడు రాదు. ఆయన నా రిషి సార్ అందుకే మీ బావ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు అంటుంది వసుధార. చూడు బావ ఎలా మాట్లాడుతుందో అంటుంది సరోజ.

Guppedanta Manasu July 10th 2024 Episode number 1123 Here is the Full story

తన మాటలు పట్టించుకోవద్దు అంటాడు రంగా. తనని దించేసి వచ్చేస్తావు కద బావ అంటుంది సరోజ. అవును అంటాడు రంగా. తను మీ బావ రంగా అయితే తిరిగి వస్తాడు, రిషి సార్ అయితే తిరిగి రారు అని చెప్తుంది వసుధార. ఆ మాటలకు భయపడిన సరోజ నేను కూడా మీతో వస్తాను అంటుంది. వద్దు నేను తనని దించేసి వచ్చేస్తాను అంటాడు రంగా. అప్పుడు సరోజ తనకి ఇష్టం లేని చీరని వసుధారకి గిఫ్ట్ గా ఇచ్చి ఇక మీదట నా జీవితంలోకి రావద్దు అని కోపంగా చెప్తుంది.

ఎందుకైనా మంచిది ధైర్యంగా ఉండు అని సరోజ కి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది వసుధార. ఆటోలో వెళ్తారా అని రంగాని అడుగుతుంది సరోజ. లేదు బస్టాండ్ లో ఆటో పెట్టేసి బస్సులో వెళ్తాం అంటాడు రంగా. అతనికి జాగ్రత్త చెప్పి పంపిస్తుంది సరోజ కానీ మనసులో మాత్రం చాలా భయపడుతుంది. బావ తిరిగి వచ్చే వరకు నాకు టెన్షనే అనుకుంటుంది. మరోవైపు అనుపమ తన పెద్దమ్మకి ఫోన్ చేసి ఆగంతకుడు విషయం చెబుతుంది.

పెద్దమ్మని అనుమానిస్తుంది కూడా. నన్ను అనుమానిస్తున్నావా మను ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పలేదు అలాంటిది నేను బయట వాళ్లకి ఎలా చెప్తాననుకున్నావు, వసుధార కూడా అలా చెప్పే మనిషి కాదు. నిన్ను భయపెట్టే వాళ్ళు ఎవరో కానీ నీ వల్ల మను వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటుంది అనుపమ పెద్దమ్మ. ఎవరు ఇలా చేస్తున్నారో నాకు ఇప్పుడే అర్థమైంది అంటుంది అనుపమ. ఎవరు అంటుంది అనుపమ పెద్దమ్మ.

Guppedanta Manasu July 10th 2024 Episode number 1123 Here is the Full story

కన్ఫామ్ చేసుకొని వచ్చి చెప్తాను అని ఫోన్ కట్ చేసేస్తుంది అనుపమ. మరోవైపు ఊరికి వచ్చిన రంగా మీ ఇంటికి ఎటు వెళ్ళాలి అని అడుగుతాడు. ఇక్కడికి దగ్గరే ఆటోలో వెళ్దాం అంటుంది వసుధార. సరే అంటాడు రంగా. ఆటోలో వెళుతుంటే నా రిసి సార్ తో తిరిగి ఈ ఊరు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటుంది వసుధార. తన మాట తనదే గాని ఎదుటి వాళ్ళ మాట అసలు పట్టించుకోదు అని మనసులో అనుకుంటాడు రంగా.

మీ ఇల్లు ఇక్కడేనా అని వసుధార ని అడుగుతాడు. మీ ఇల్లు మీకు తెలియదా మీ పని చెప్తాను ఉండండి అని మనసులో అనుకొని దారి మధ్యలో ఆటో దిగిపోయి నడుచుకొని వెళ్దాం పదండి సార్ అంటుంది వసుధార. చాలా దూరం నడిచిన తర్వాత ఇటువైపు మీ ఇల్లు అని రాంగ్ రూట్ చూపిస్తుంది వసుధార. కాదు ఇటేమో అంటూ కరెక్ట్ రూట్ చూపిస్తాడు రంగా. ఒకసారిగా షాక్ అవుతుంది వసుధార. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X