Guppedanta Manasu July 11th episode: వసుధారని వదిలి వెళ్ళిపోయిన రంగా..దేవయాని దెబ్బకి భయంతో వణికిపోతున్న అనుపమ
పరాయి ఆడపిల్లని ఇంట్లో పెట్టుకున్నాడని రంగా ఇంట్లో పంచాయతీ పెడతాడు సరోజ తండ్రి. మరోవైపు మను తండ్రి ఎవరో నాకు తెలుసు నిజం చెప్పకూడదంటే నువ్వు మనవుని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని అనుపమని బ్లాక్ మెయిల్ చేస్తాడు ఒక అగంతకుడు. మరోవైపు వసుధార రాధమ్మని రంగా నిజంగా మీ మనవడేనా అని నిలదీస్తుంది. తడబడుతుంది రాధమ్మ. తర్వాత రంగా వసుధార ని తీసుకొని ఆమె ఊరికి ప్రయాణం అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 11 వ తేదీ ఎపిసోడ్ 1,124 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
ఇల్లు ఇటువైపు ఉంది అంటూ రాంగ్ రూట్ చూపిస్తుంది వసుధార. కాదు ఇటువైపేమో అంటాడు రంగా. మీకు ఎలా తెలుసు సార్ అని అడుగుతుంది వసుధార. మీరు దారులు మరిచిపోయి ఎక్కడెక్కడికో తీసుకు వెళుతున్నారు అందుకే ఈ రోడ్డు కూడా మర్చిపోయారేమో అని అలా చెప్పాను అంతేగాని మీ ఇల్లు నాకు ఎలా తెలుస్తుంది అంటాడు రంగా. నిజమే సార్ రూట్ మర్చిపోయాను రండి అంటూ రంగా చెప్పిన రూట్లోనే తీసుకు వెళుతుంది వసుధార. తర్వాత కరెక్ట్ గా వాళ్ళ ఇంటి ముందు ఆగుతాడు రంగా.

ఇదే ఇల్ల ని మీకు ఎలా తెలుసు అంటుంది వసుధార. మీరు నా నీడలో ఎందుకు నడుస్తున్నారు అందుకే ఆగాను అంటాడు రంగా. నేను మీ నీడలో నడవలేదు మీ వెనకగా నడుస్తున్నాను అంటూ ఇంట్లోకి తీసుకువెళ్తుంది వసుధార. ఇల్లు తాళం వేసి ఉండడం చూసి షాక్ అవుతుంది. మిమ్మల్ని మీ ఇంట్లో దెగ్గర పెట్టాను ఇక నేను వెళ్తాను అంటాడు రంగా. మీ నాన్నగారితో మాట్లాడి వెళ్లండి ఆయన వచ్చేస్తారు కాసేపు వెయిట్ చేయండి అంటుంది వసుధార. నాకు అంత అవసరం లేదు జాగ్రత్తగా మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెట్టాను, నా పని అయిపోయింది వెళ్ళిపోతాను అంటాడు రంగా.
ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు నిజంగా రంగా అయితే సరోజతో వాదించినప్పుడు నేనే రంగాని అని ఎందుకు గట్టిగా మాట్లాడలేదు, మీ వల్ల నా పరువు పోతుంది అని ఎందుకు నాపై కోప్పడలేదు అని నిలదీస్తుంది వసుధార. మీకు మీ భర్త మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది భర్తని పోగొట్టుకుని ఉన్న మిమ్మల్ని ఏమీ అనలేక ఊరుకున్నాను అంతేకానీ నేను మీ భర్త రిషి సార్ ని కాదు, మీరు బ్రమలోంచి వాస్తవంలోకి రండి.

నేను వెళ్తున్నాను నా వెనకే వస్తే మీరు ఎంతగానో ఇష్టపడే మీ రిషి సార్ మీద ఒట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగా. మరోవైపు అనుపమ దేవయాని ఇంటికి వస్తుంది. నువ్వే ఎవరితోనో ఫోన్ చేస్తున్నావని నాకు తెలుసు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని దేవయానిని హెచ్చరిస్తుంది. మను తండ్రి మహేంద్ర అని తెలిసినప్పుడు ఎందుకు నిజం చెప్పటం లేదు అని అడుగుతుంది దేవయాని. ఆ మాటలకి షాక్ అవుతుంది అనుపమ. నువ్వు అన్నదానికి ప్రూఫ్స్ ఏమిటి అని అడుగుతుంది.
దేవయాని తన దగ్గర ఉన్న లెటర్ ని చూపిస్తుంది. అనుపమ ఆ లెటర్ చూసి షాక్ అయిపోతుంది దయచేసి నిజం బయట పెట్టొద్దు అలా చేస్తే మహేంద్ర ప్రాణానికి ప్రమాదం అని రిక్వెస్ట్ చేస్తుంది. నిజం బయట పెట్టకూడదు అంటే ఎండి పదవికి నా కొడుకుకి నీ కొడుకు పోటీ రాకూడదు, నీ కొడుకుని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపో అని చెప్తుంది దేవయాని. భయంతో దేవయాని కండిషన్ కి ఒప్పుకుంటుంది అనుపమ. మరోవైపు రిషి ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది వసుధార.

రిషి సార్ ని మావయ్యతో మాట్లాడిస్తే ఆయన నిజం ఒప్పుకుంటారు అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అనుకుంటూ నడుస్తూ ఉంటుంది అంతలోనే అటువైపుగా శైలేంద్ర వస్తాడు. అతడు వసుధార ని చూస్తాడు అనుకునే లోపే పాండు ఆమెని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోతాడు. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేయమన్నారు అని అడుగుతుంది వసుధార. అలా ఎలా చెప్తాము అంటాడు పాండు. వాళ్లతో ధైర్యంగా గా వాదిస్తుంది వసుధార.
అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఆటో వాడు వచ్చి కాపాడేస్తాడనా నీ ధైర్యం, ఒకసారి కాపాడినంతమాత్రాన ఆస్తమానం కాపాడుతాడా అంటాడు పాండు. రౌడీలతో మాట్లాడుతూ నేను ఉన్న ప్రతిసారి మర్డర్ మిస్ అవుతుంది అందుకే నేను బయటకు వెళ్తాను ఇలోగా మీ పని మీరు కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు పాండు. రౌడీలు వసుధారపై అటాక్ చేసే సమయానికి రంగా విజిల్ వేసుకుంటూ అక్కడికి వస్తాడు. రంగా ని చూసిన వసుధార సంతోషపడుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











