Guppedanta Manasu Jul13th episode:అనుపమ ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న మహేంద్ర..తల్లి చేసిన పనికి ఇరకాటంలో పడిన మను
వసుధార రాధమ్మని రంగా నిజంగా మీ మనవడేనా అని నిలదీస్తుంది. తడబడుతుంది రాధమ్మ. తర్వాత రంగా వసుధార ని తీసుకొని ఆమె ఊరికి ప్రయాణం అవుతాడు. వసుధారని వాళ్ళ ఇంటిదగ్గర వదిలి వెళ్ళిపోతాడు రంగా. కానీ రంగా ని వెతుక్కుంటూ వస్తున్న వసుధారని కిడ్నాప్ చేస్తారు పాండు గ్యాంగ్. వాళ్ల బారి నుంచి వసుధార ని రక్షించి ఆమె కోరిక మేరకు తనతో పాటు మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్లి పోతాడు రంగా. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 13 వ తేదీ ఎపిసోడ్ 1,126 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
వసుధార ని చూసిన సరోజ కోపంతో రగిలిపోతూ మళ్లీ మా ఊరు ఎందుకు వచ్చావని వసుధార మీద కోప్పడుతుంది. ఏంటి బావ నువ్వే తీసుకువచ్చావా తనే నీ వెనుక వచ్చేసిందా అని కోపంగా అడుగుతుంది. ఏంటి మీ ఊర్లో మీరు తప్పితే ఇంకెవరూ ఉండకూడదా అయినా నేనేమీ మీ బావ ఇంట్లో ఉండటం లేదు, టెర్రస్ మీద అద్దెకి ఉంటున్నాను అంటుంది వసుధార. పోయి ఇంకెక్కడైనా ఉండు నీ అద్దె మాకు అక్కర్లేదు అంటుంది సరోజ.

ఇంకెక్కడైనా ఉంటే మేడమ్ గారికి ప్రమాదం సరోజ, మళ్ళీ తనకు ఏమైనా అయిందంటే మనకే మాట వస్తుంది అయినా మీ నాన్నకి వడ్డీ డబ్బులు కట్టాలంటే మాకు కూడా డబ్బులు అవసరమే కదా అందుకే నేనే తనని ఉండమన్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగా. వసుధార సరోజ దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కువగా ఆశలు పెంచుకోకు అతను మా రిషి సార్ అంటుంది. కాదు మా రంగా అంటుంది సరోజ.
రంగా అయితే తిరిగి నన్ను ఎందుకు తీసుకువస్తారు, ముందు ముందు ఆయనే రిషి సార్ అని నీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. మరోవైపు తన దగ్గరికి బాధగా వచ్చిన అనుపమని ఏం జరిగింది అంటుంది పెద్దమ్మ. జరిగిందంతా చెప్పి ఇకమీదట మేము మహేంద్ర కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను, కొన్ని రోజులు నీ దగ్గర ఉండి తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటుంది.

నిజం చెప్తే ఏమవుతుంది తనే తండ్రి అని తెలియకపోయినా మహేంద్ర దగ్గర తండ్రి ప్రేమ పొందుతున్నాడు మను ఇప్పుడు ఆ సంతోషం కూడా తనకి దక్కనివ్వవా అంటుంది పెద్దమ్మ. నిజం తెలిస్తే మహేంద్ర కి ప్రమాదం పెద్దమ్మ అంటుంది అనుపమ ఇంతలోనే మహేంద్ర ఫోన్ చేసి ఏమైపోయావు నీకోసం వెయిట్ చేస్తున్నాను త్వరగా రమ్మంటాడు. నేను రాను, ఇకమీదట నువ్వు ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకో అంటుంది అనుపమ.
ఆ మాటలకి షాక్ అవుతాడు మహేంద్ర ఎందుకిలా మాట్లాడుతున్నావ్ అంటాడు. నాకు నచ్చినప్పుడు వస్తాను నన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనుపమ. ఎందుకిలా మాట్లాడుతుంది అనుకుంటూ ఆశ్చర్యపోతాడు మహేంద్ర. మరోవైపు వసుధార తిరిగి వచ్చేసింది అని బుజ్జికి చెప్తుంది సరోజ. తనని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి అనుకొని బుజ్జి ని తీసుకొని టెర్రస్ మీదకి వెళ్తుంది సరోజ.

అక్కడ వసుధార పిల్లలకి ట్యూషన్స్ చెప్పబడును అని బోర్డు పెట్టి కొందరు పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ ఉంటుంది. ఊరి పెద్ద తన పిల్లల తీసుకువచ్చి నీ గురించి తప్పుగా మాట్లాడాను కానీ ఇప్పుడు నువ్వే మా పిల్లల్ని తీర్చిదిద్దాలి అంటాడు. మీకు నా గురించి తెలియక అలా అనుకున్నారు నేను అలాంటివి ఏమీ పట్టించుకోను మీ పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత నాది అంటుంది వసుధార. వాళ్లు వసుధార గురించి అలా మాట్లాడటం భరించలేక పోతుంది సరోజ.
వచ్చినవాళ్లు వెళ్ళిపోయిన తర్వాత వసుధార సరోజి దగ్గరికి వచ్చి నీకు చదువు లేదు కదా నువ్వు కూడా వచ్చి కూర్చో అంటుంది. నాకేమీ అక్కర్లేదు అంటుంది సరోజ. పరవాలేదులే ఫీజు తీసుకోను అని వెటకారంగా అంటుంది వసుధార. మరోవైపు ఇంటికి వచ్చిన మను తో అనుపమ గురించి చెప్తాడు మహేంద్ర. మేడం ఎక్కడ ఉంటారో నాకు తెలుసు అంటూ ఓల్డి కి ఫోన్ చేస్తాడు మను. అనుపమ ఇక్కడే ఉంది అంటుంది ఓల్డి. మహేంద్ర సర్ కంగారు పడుతున్నారు, మేడం గారిని రమ్మను అంటాడు మను.

అప్పుడు అనుపమ పెద్దమ్మ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని నేను రాను నువ్వే ఒకసారి రా నీతో మాట్లాడాలి అంటుంది. ఫోన్ పెట్టేసిన మను నేను వెళ్లి మేడం ని తీసుకొని వస్తాను అంటాడు. మహేంద్ర వస్తానంటే వద్దు అని చెప్పి తల్లి దగ్గరికి బయలుదేరుతాడు. తల్లి దగ్గరికి వెళ్లి విషయం ఏమిటి అని అడుగుతాడు. ఇకమీదట మనం మహేంద్ర ఇంట్లో ఉండొద్దు ఇక్కడే ఉందాం అంటుంది అనుపమ.
ఎందుకు ఏం జరిగింది మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా, అయినా ఒక్కరే ఉంటారని మీరే కదా ఆయనకు తోడుగా ఉందామన్నారు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నేను కష్టంలో ఉన్నప్పుడు వాళ్లు నా కోసం చాలా కష్టపడ్డారు అలాంటి వాళ్ళని నేను ఒంటరిగా వదిలేయలేను అంటాడు మను. నేను చెప్పిన మాట వినకపోతే నా మీద ఒట్టే అంటుంది అనుపమ. ఏం మాట్లాడాలో తెలియక ఇరకాటంలో పడతాడు మను . తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











