Guppedanta Manasu July 15th episode: రాధమ్మకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన వసుధార!

రంగా వసుధార ని తీసుకొని ఆమె ఊరికి ప్రయాణం అవుతాడు. వసుధారని వాళ్ళ ఇంటిదగ్గర వదిలి వెళ్ళిపోతాడు రంగా. కానీ రంగా ని వెతుక్కుంటూ వస్తున్న వసుధారని కిడ్నాప్ చేస్తారు పాండు గ్యాంగ్. వాళ్ల బారి నుంచి వసుధార ని రక్షించి ఆమె కోరిక మేరకు తనతో పాటు మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్లి పోతాడు రంగా. తిరిగి వచ్చినందుకు వసుధారతో గొడవ పడుతుంది సరోజ. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 15 వ తేదీ ఎపిసోడ్ 1,127 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు అందుకే ఇలా మాట్లాడుతున్నారు, అసలు సమస్య ఏమిటో చెప్పండి నేను సాల్వ్ చేస్తాను అంటాడు మను. చెప్తే వినిపించుకోవా అని మను ని కసురుకుంటుంది అనుపమ. ఇంతకుమించి ఏ కారణాలు అడిగితే నా మీద ఒట్టే అంటుంది. ఆ మాటలకి సీరియస్ అవుతాడు మను. నా తండ్రి గురించి అడిగినప్పుడు కూడా ఇలాగే ఒట్టు పెట్టుకున్నారు, ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారు అంటే ఏదో జరిగింది, చెప్పండి మేడం ఇప్పటికైనా నిజం చెప్పండి నా తండ్రి ఎవరు అని నిలదీస్తాడు మను.

Guppedanta Manasu July 15th 2024 Episode number 1127 Here is the Full story

అనుపమ చెప్పకపోవడంతో అతని తలపై గన్ గురి పెట్టుకొని నిజం చెప్పమని అడుగుతాడు. మను చర్య కి కంగారు పడతారు అనుపమ, ఆమె పెద్దమ్మ. ఇంతలోనే మహేంద్ర వచ్చి మను దగ్గర గన్ లాక్కుంటాడు, ఏం జరిగింది? ఏంటి పిచ్చి పని అంటాడు మహేంద్ర. జరిగింది చెప్తాడు మను. ఏంటిది అనుపమ, నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా, ఎందుకు మా ఇంట్లో ఉండద్దంటున్నావు అంటాడు మహేంద్ర. అలాంటిదేమీ లేదు కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుపమ చెప్పటంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర.

అనుపమ మనుతో మాట్లాడుతూ నువ్వు కొంచెం ఓపిక పడితే అన్ని నిజాలు నీకే తెలుస్తాయి, మన మంచి కోసమే నేనిదంతా చేస్తున్నాను. అమ్మ అని పిలవాలని నువ్వు ఎంత తపన పడుతున్నావో నీ చేత అమ్మ అని పిలిపించుకోవాలని నేను కూడా అంతే తపన పడుతున్నాను అంటుంది అనుపమ. ఆ మాటలకి ఆనందపడిన మను అనుపమని అమ్మ అని పిలుస్తాడు. అప్పుడు అనుపమ మాట్లాడుతూ నువ్వు డిబిఎస్టి వ్యవహారాల నుంచి కూడా తప్పుకోవాలి ఆ పనులు త్వరగా చూడు.

Guppedanta Manasu July 15th 2024 Episode number 1127 Here is the Full story

నేను చెప్పిన మాట విను అని మను కి నచ్చజెప్పింది అనుపమ. అందుకు సరే అంటాడు మను. మరోవైపు బిందెతో నీళ్లు తెస్తున్న రాధమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన వసుధార ఆమెకి సిపిఆర్ చేస్తూ రంగా ని పిలిచి డాక్టర్ ని పిలవమని చెప్తుంది. రంగా డాక్టర్ని పిలుచుకు వస్తాడు, ఆమె రాధమ్మకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని సిపిఆర్ చేయటం వలన ప్రమాదం గట్టెక్కిందని చెప్తుంది. అలాగే రాధమ్మతో జాగ్రత్తగా ఉండమని చెప్పి మందులు రాసిచ్చి వెళ్ళిపోతుంది డాక్టర్.

మందులు తీసుకురావడానికి రంగా రాధమ్మ ని రెస్ట్ తీసుకోమని వసుధార ఇద్దరు బయటికి వచ్చేస్తారు. అక్కడ రంగా వసుధారకి మా నానమ్మ సేవ్ చేసినందుకు థాంక్స్ అని చెప్తాడు. అన్ని విషయాల్లోనే బానే ఉన్నారు కానీ ఎందుకు నిజాన్ని ఒప్పుకోవటం లేదు అంటుంది వసుధార. మళ్లీ ఇప్పుడు మీరు ఆ టాపిక్ తీసుకురాకండి అని చెప్పి మందులు తీసుకురావడానికి వెళ్ళిపోతాడు రంగా. ఏమిటి ఈయన బామ్మ కోసం అంత ఎమోషనల్ అవుతున్నారు..

Guppedanta Manasu July 15th 2024 Episode number 1127 Here is the Full story

నిజంగా ఈయన రిషి సార్ కాదా అని ఆలోచనలో పడుతుంది వసుధార. మరోవైపు మినిస్టర్ కాలేజీలో బోర్డు మీటింగ్ పెట్టి మను ని ఎండిగా నిర్ణయిస్తాడు. అతడి నిర్ణయాన్ని తప్పుపడతాడు శైలేంద్ర. ఈ కాలేజీని మా తాతగారు స్థాపించారు మా కుటుంబంలో వాళ్ళు తప్పితే వేరే వాళ్ళని ఎలా ఎండిగా నిర్ణయిస్తారు అని అడుగుతాడు. ఎండి కావాలంటే అర్హత కూడా కావాలి అంటాడు మినిస్టర్. నాలో లేని అర్హత ఏమిటి మను లో ఉన్న అర్హత ఏమిటి అంటాడు శైలేంద్ర.

ఇదిగో ఈ ఆవేశమే మను లో లేదు. తను ఆలోచించి మాట్లాడుతాడు. అయినా ఆర్గ్యూ వద్దు, నేను నిర్ణయం తీసుకున్నాను అంటాడు మినిస్టర్. ఫణీంద్ర ఒపీనియన్ కూడా అడుగుతాడు. ఫణీంద్ర కూడా మినిస్టర్ నిర్ణయమే ఫైనల్ అంటాడు. కానీ మను మాత్రం నేను ఎండి పదవి తీసుకోవటానికి సిద్ధంగా లేను అంటాడు. ఆ మాటలకి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X