Guppedanta Manasu Jul 16th:షాకింగ్ డెసిషన్ తీసుకున్న మను..సరోజ ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటున్న రంగా!

వసుధారని వాళ్ళ ఇంటిదగ్గర వదిలి వెళ్ళిపోతాడు రంగా. కానీ రంగా ని వెతుక్కుంటూ వస్తున్న వసుధారని కిడ్నాప్ చేస్తారు పాండు గ్యాంగ్. వాళ్ల బారి నుంచి వసుధార ని రక్షించి ఆమె కోరిక మేరకు తనతో పాటు మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్లి పోతాడు రంగా. తిరిగి వచ్చినందుకు వసుధారతో గొడవ పడుతుంది సరోజ. మరోవైపు డిబిఎస్టి కాలేజీతో సంబంధాలు తెంచుకోమని కొడుకుతో చెప్తుంది అనుపమ. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 16 వ తేదీ ఎపిసోడ్ 1,128 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

తాను ఎండిగా వ్యవహరిస్తానని చెప్పిన శైలేంద్రని కాదని మనుని ఎండిగా నియమిస్తాడు మినిస్టర్. కానీ మను ఈ పదవికి నేను సిద్ధంగా లేను అంతేకాదు ఇప్పుడు ఉన్న డైరెక్టర్ పోస్ట్ కి కూడా రాజీనామా చేస్తున్నాను అంటాడు. ఎందుకు అలా అంటున్నావు శైలేంద్ర మాటలకి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా అంటాడు ఫణీంద్ర. మహేంద్ర, మినిస్టర్ కూడా మను కి నచ్చి చెప్తారు కానీ తన రెజిగ్నేషన్ లెటర్ మినిస్టర్ కి ఇచ్చి వెళ్ళిపోతాడు మను.

Guppedanta Manasu July 16th 2024 Episode number 1128 Here is the Full story

అసలు డిబిఎస్డి కాలేజీకి ఏమైంది ఒక్కొక్కరుగా ఈ కాలేజీకి ఎందుకు దూరం అయిపోతున్నారు, ఈ కాలేజీ పతనమైపోతుంటే నేను భరించలేకపోతున్నాను అంటాడు మినిస్టర్. అందుకే నేను ఎండి అయ్యి కాలేజీని మళ్లీ ఒక గాడిన పెడతాను నన్ను ఎండిని చేయండి అంటాడు శైలేంద్ర. కుదరదు నువ్వు ఎండీ కావాలంటే రిషి గానీ వసుధారగాని వచ్చి చెప్పాలి వారం రోజుల్లో ఆ పని జరిగేలా చూడు.

లేదంటే ఈ కాలేజీ ని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు మినిస్టర్. మరోవైపు రాధమ్మ దగ్గర కూర్చొని చూసావా ఎంత పని జరిగిందో, అందుకే నీ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పాను. బావకి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తే నీకు తోడుగా నేనుంటాను కదా, నిన్ను ఏ పని చేయనివ్వను అంటుంది సరోజ. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి సరోజ కి రేపు పెళ్లి చూపులు, పెళ్ళికొడుకు పట్నం కుర్రాడు బాగా డబ్బున్న వాడు అని చెప్తాడు.

Guppedanta Manasu July 16th 2024 Episode number 1128 Here is the Full story

పెళ్లి నాకు ఇష్టం లేదు అంటుంది సరోజ. ఇష్టాలది ఏముంది సమయాన్ని బట్టి మారిపోతాయి నువ్వేమీ గొడవ చేయకు అని చెప్పి రాధమ్మని, రంగాని పెళ్లిచూపులు కి రమ్మని పిలుస్తాడు సరోజ తండ్రి. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత నాకు పెళ్లి చూపులు అంట బావ అని రంగాతో చెప్తుంది సరోజ. కానీ అతని ఏమీ మాట్లాడకపోవటంతో అసలు ఇదంతా వసుధార వల్లే తను వచ్చిన తర్వాతే మా బావ ఇలా మారిపోయాడు అని వసుధార ని తిట్టుకుంటుంది సరోజ.

మరోవైపు ఒంటరిగా కూర్చున్న మహేంద్ర దగ్గరికి వచ్చి అసలు మను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, అయినా ఈ రోజు అనుపమ కాలేజీకి రాలేదు ఏమిటి అని అడుగుతాడు ఫణీంద్ర. ఇక మీదట కాలేజీకి రారు అన్నయ్య కాలేజీకే కాదు నా జీవితంలో నుంచి కూడా వెళ్ళిపోతారంట అని చెప్తాడు మహేంద్ర. ఎందుకు ఇలా చేస్తున్నారు కారణం ఏమైనా చెప్పారా అంటాడు ఫణీంద్ర. లేదన్నయ్యా అంటాడు మహేంద్ర. మా శైలేంద్ర ఏమైనా చేశాడా చెప్పు చెప్పు వాడి సంగతి నేను చూస్తాను అంటాడు ఫణీంద్ర.

Guppedanta Manasu July 16th 2024 Episode number 1128 Here is the Full story

మధ్యలో నన్ను అంటారేంటి నేనేం చేశాను అంటాడు శైలేంద్ర. ఎండి సీట్ మీద ఆశతో ఉన్నావు ఏమైనా చేసావేమో అని అనుమానంతో అన్నాను అంటాడు ఫణీంద్ర. మీరు నన్ను తప్ప అందరిని అర్థం చేసుకుంటారు అని తండ్రి మీద కోప్పడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. అప్పుడు ఫణీంద్ర మాట్లాడుతూ ఒంటరిగా అక్కడ ఎందుకు పద మన ఇంటికి వెళ్దాం అని తమ్ముడితో అంటాడు.

వద్దన్నయ్య ఒక్కడినే ఉంటాను, నా జీవితంలో నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతూ నాకు ఒంటరితనాన్ని అలవాటు చేసేసారు అంటాడు మహేంద్ర. కానీ ఫణీంద్ర ఒప్పుకోకుండా మహేంద్ర ని తనతో పాటు తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు ఈ పెళ్లి చూపులు ఆపేయమని రంగాతో చెప్తుంది సరోజ. ఎందుకు అంటాడు రంగా. నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది సరోజ కానీ నాకు నిన్ను చేసుకునే ఉద్దేశం లేదు ఇప్పటికే మీ నాన్న ఏవేవో అంటున్నాడు.

ఇక నిన్ను పెళ్లి చేసుకుంటే డబ్బు కోసమే చేసుకున్నాను అని దెప్పుతాడు అంటాడు రంగా. అక్కడే ఉన్న వసుధార కూడా సరోజ ని పెళ్లి చేసుకో మంటుంది నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీకు అడ్డు తొలగిపోతుంది అనుకుంటున్నావా నువ్వేమీ మాట్లాడొద్దు అని మందలిస్తుంది సరోజ. అప్పుడు రంగా మాట్లాడుతూ పెళ్లి అంటే మాటలు కాదు ఒకరి మనసులు ఒకరు కలవాలి ఎంత దూరంగా ఉన్నా అతని గురించి ఒకరు ఆలోచించాలి.

అలాంటి మనుషులు ఎప్పటికైనా కలుస్తారు కానీ నువ్వు చిన్న చిన్న విషయాలకు కూడా అడ్జస్ట్ అవ్వలేవు అంటాడు రంగా. నన్ను నేను మార్చుకుంటాను ఈ పెళ్లి చూపులు ఆపేయ్ అంటుంది సరోజ. నేను పెళ్లి చూపులు ఆపలేను, వచ్చిన సంబంధం చేసుకో అంటాడు రంగా. నిన్ను తప్పితే నేను వేరే ఎవరిని చేసుకోను అంటుంది సరోజ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X