Guppedanta Manasu July 17th episode: రిషి సార్ కు ఇష్టం లేకుండా పెళ్లి..అందుకే నీకు దూరంగా.. వసుధారతో రంగా
రంగాని వెతుక్కుంటూ వస్తున్న వసుధారని కిడ్నాప్ చేస్తారు పాండు గ్యాంగ్. వాళ్ల బారి నుంచి వసుధార ని రక్షించి ఆమె కోరిక మేరకు తనతో పాటు మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్లి పోతాడు రంగా. తిరిగి వచ్చినందుకు వసుధారతో గొడవ పడుతుంది సరోజ. మరోవైపు డిబిఎస్టి కాలేజీతో సంబంధాలు తెంచుకోమని కొడుకుతో చెప్తుంది అనుపమ. ఎండి పదవికి తాను సిద్ధంగా లేనని, డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాడు మను. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 17 వ తేదీ ఎపిసోడ్ 1,129 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
తన పెళ్లి చూపులు ఆపమని రంగాని అడుగుతుంది సరోజ. నేను ఆపను, వచ్చిన సంబంధం చేసుకో అని సలహా ఇస్తాడు రంగా. సరోజ నిన్ను తప్పితే వేరే ఎవరిని చేసుకోను, వచ్చిన ప్రతి సంబంధాన్ని తిప్పి కొడతాను అంటూ బుజ్జిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరోజ. మరోవైపు శైలేంద్ర తనకి ఎండి పదవి దక్కలేదని ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. ఎండి పదవికి అడ్డుగా ఉన్న వాళ్ళందరిని అడ్డు తప్పించాము, ఆఖరికి ఆ మను ని కూడా అడ్డుతప్పించాము.

ఇక నేనే ఎం డి అనుకుంటే ఆ మినిస్టర్ రిషి వసుధారల పర్మిషన్ కావాలంటున్నాడు. ఇప్పుడు వాళ్లు ఎలా వస్తారు, నేను ఎండిని అవుతాను లేదో అని అనుమానంగా ఉంది అంటాడు. నువ్వే తప్పక ఎండివి అవుతావు అని ధైర్యం చెప్తుంది దేవయాని. అప్పుడే అక్కడికి వచ్చిన ధరణి మాత్రం ఎండి అవ్వాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. మీలా కుట్రలు, కుతంత్రాలు చేసే వాళ్ళకి ఆ సీటు దక్కే ఛాన్స్ లేదు అంటుంది. ఆమెని కోప్పడతారు తల్లి కొడుకులు. ఇంతలో ఫణీంద్ర మహేంద్రను తీసుకొని ఇంటికి వస్తాడు.
నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతాను అంటాడు మహేంద్ర. నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను నీకు ఇష్టం లేకపోయినా ఇక్కడే ఉండాలి అంటాడు ఫణీంద్ర. అలాగే దేవయానికి శైలేంద్రకి మహేంద్ర ఇకమీదట ఇక్కడే ఉంటాడు, అతనిని బాధపెట్టే విధంగా ప్రవర్తించొద్దు అని హెచ్చరిస్తాడు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మహేంద్ర తమ ఇంటికి వచ్చినందుకు ఆనందపడతారు దేవయాని, శైలేంద్ర.

నువ్వు బాబాయ్ ని ఇక్కడికి రప్పించమని అడిగావు కదా అదే చేశాను అంటుంది దేవయాని. ఇకమీదట మనం ఎండి సీట్ కోసం పక్కాగా ప్లాన్ వేయాలి టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదు అంటుంది. మరోవైపు బుజ్జితో మాట్లాడుతున్న సరోజ తన పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వటానికి సలహా అడుగుతుంది. బుజ్జి పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తుంటే అతడిని కోప్పడుతుంది. వచ్చిన వాళ్ళకి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాను అప్పుడు వాళ్లే వెళ్ళిపోతారు అంటాడు బుజ్జి.
నమ్ముతారంటావా అని అనుమానంగా అడిగినా వేరే దారి లేక ఏదో ఒకటి చెయ్యు అంటుంది సరోజ . మరోవైపు రంగా వసుధారతో మాట్లాడుతూ మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతాడు. మీరే గెస్ చేయండి అంటుంది వసుధార. మీది అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉంటుంది. మీ రిషి సర్ కి ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేసుకుని ఉంటారు, నిజంగా మీరంటే ఇష్టం ఉంటే ఇన్ని రోజులు మీకు దూరంగా ఉంటారా అంటాడు రంగా.

ఏం మాట్లాడుతున్నారు సార్, నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అలాంటిది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాను అంటారేంటి, అంటే జగతి మేడం కోసం నన్ను పెళ్లి చేసుకున్నారా అనికోపంగా అడుగుతుంది వసుధార. ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు నేనే మీ రిషి సార్ ని అన్నట్లు మళ్లీ ఆ టాపిక్ తీసుకురాకండి చుట్టుపక్కల వాళ్ళు వింటే పరువు పోతుంది అసలే మొన్న అందరూ ఇంటికి వచ్చి గొడవ చేశారు. మీతో అనవసరంగా పెళ్లి టాపిక్ మాట్లాడాను.
మీతో ఎక్కువసేపు మాట్లాడినా ప్రాబ్లమే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు రంగా. మరోవైపు అనుపమ తనని వదిలి వెళ్లిపోవటానికి కారణం మీరే అని అనుమానంగా ఉంది అని దేవయాని, శైలేంద్రలతో అంటాడు మహేంద్ర. అలా చేయటానికి మాకేం అవసరం ఉంది అయినా తను సీక్రెట్స్ మాకేం తెలుసు అంటారు దేవయాని, శైలేంద్ర. ఆ అవసరం మీకు తప్పితే వేరే ఎవరికీ లేదు ఇన్నాళ్లు సపోర్టుగా ఉన్న అనుపమ ఇప్పుడు ఎందుకు వెళ్లిపోయింది.
ఒకవేళ దీని వెనక మీ పాత్ర ఉందని తెలిస్తే మాత్రం ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మహేంద్ర. అనుపమ వెళ్ళిపోతే మహేంద్ర బలహీనుడు అవుతాడు అనుకున్నాం కానీ ఇలా భయపెడుతున్నాడేంటి అంటుంది దేవయాని.అంతలోనే శైలేంద్ర కి ఎమ్మెస్సార్ శిష్యుడు ధనరాజ్ ఫోన్ చేసి తన పెళ్లి విషయంలో సహాయం చేయాలని, ఆ విషయం మాట్లాడడానికి నేరుగా మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ధనరాజ్. విషయం తల్లికి చెప్తాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











