Guppedanta Manasu, July 18th episode: శైలేంద్రను ధనరాజ్ బ్లాక్ మెయిల్ .. తల్లి కొడుకులకు బుజ్జి సూపర్ షాక్!

పాండు గ్యాంగ్ నుంచి వసుధార ని రక్షించి ఆమె కోరిక మేరకు తనతో పాటు మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్లి పోతాడు రంగా. తిరిగి వచ్చినందుకు వసుధారతో గొడవ పడుతుంది సరోజ. మరోవైపు డిబిఎస్టి కాలేజీతో సంబంధాలు తెంచుకోమని కొడుకుతో చెప్తుంది అనుపమ. ఎండి పదవికి తాను సిద్ధంగా లేనని, డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాడు మను. మరోవైపు తన పెళ్లిచూపులు చెడగొట్టమని రంగ ని అడుగుతుంది సరోజ. కుదరదు అంటాడు రంగా. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 18 వ తేదీ ఎపిసోడ్ 1,130 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

శైలేంద్ర, దేవయాని ధనరాజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ధనరాజ్ నన్ను ఆశీర్వదించండి అన్నయ్య అంటూ శైలేంద్ర కాళ్లు మొక్కుతాడు. కంగారుపడిన శైలేంద్ర ఏంటి హడావిడి, అసలు ఏం జరిగింది అసలు ఎమ్మెస్ఆర్ దగ్గర నుంచి ఎందుకు వచ్చేసావు అని అడుగుతాడు.ఆ ఎమ్మెస్సార్ నన్ను ఎప్పుడో వదిలేసాడు,మీతో కలిసి ఉన్నప్పుడు మంచి డీలింగ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు ఎలాంటి డీలింగ్స్ లేవు అందుకే వదిలేశాడు.ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు ఆ పని ఈ పని చేసుకుని ఏదో కాస్త సంపాదించుకున్నాను.

Guppedanta Manasu July 18th 2024 Episode number 1130 Here is the Full story

కానీ ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదు అంటాడు ధనరాజ్. సంపాదించానంటున్నావు కదా ఇంకా సెటిల్ అవ్వకపోవడమేమిటి అంటాడు శైలేంద్ర. పెళ్లి చేసుకో పోతే లైఫ్ ఎలా సెట్ అవుతుంది అన్నయ్య, నా వెనుక ఎవరూ లేరు అని తెలిసి నాకు ఎవరూ పిల్లని ఇవ్వటం లేదు అందుకే ఈమధ్య వచ్చిన ఒక సంబంధం వాళ్లతో మీరు మా అన్నయ్య, మీ అమ్మగారు నాకు అమ్మ అని చెప్పాను అందుకే మీరు నాతో పాటు పెళ్లి చూపులకు రావాలి అంటాడు ధనరాజ్. అలా ఎలా చెప్పేస్తావు అయినా మేమెందుకు మీతో పాటు రావాలి అంటాడు శైలేంద్ర.

రావాలన్నయ్య తప్పదు, ఎందుకంటే మీ రహస్యాలని నాకు బాగా తెలుసు అని బ్లాక్ మెయిల్ చేస్తాడు ధనరాజ్. దాంతో ధనరాజ్ తో రావడానికి ఒప్పుకుంటారు తల్లీ,కొడుకులు. రేపు పొద్దున్నే వస్తాను మీ కార్ లోనే వెళ్దాం రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు ధనరాజ్. మరోవైపు వసుధార రంగా కోసం కాఫీ తీసుకొని వస్తుంది, నాకు కాఫీ ఇష్టం లేదు అంటాడు రంగా. పర్వాలేదు ఒకసారి తాగండి అంటుంది వసుధార.

కాఫీ తాగిన రంగా కాఫీ బాగోలేదు అని అసహ్యించుకుంటాడు. అప్పుడే వచ్చిన రాధమ్మ ఏం జరిగింది అంటుంది. ఆమెకు కూడా కాపీ ఇచ్చి ఎలా ఉంది అని అడుగుతుంది వసుధార. బావుంది అంటుంది రాధమ్మ. ఈ కాఫీ ఆయనకి నచ్చలేదంట నీకు కాఫీ అంటే ఇష్టం కదా ఎందుకు నచ్చలేదు అని రంగా ని అడుగుతుంది రాధమ్మ. నేను ఒకసారి రిషి సార్ ని ఇలాగే ఏడిపించాను అందుకే ఆయన ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటుంది వసుధార.

Guppedanta Manasu July 18th 2024 Episode number 1130 Here is the Full story

ఏంటో మీరు మీ గోల నాకు అర్థం కాదు అంటూ వెళ్ళిపోతుంది రాధమ్మ. ఎందుకు సార్ నేనంటే గుర్తు లేనట్టు ప్రవర్తిస్తున్నారు, ఇంకెన్నాళ్లు నన్ను ఇలా ఆట పట్టిస్తారు అని కన్నీరు పెట్టుకుంటుంది వసుధార. ఎందుకు ఆ కన్నీరు, కాఫీ బాగోలేదు అన్నందుకు ఇంత సీన్ అవసరమా నేను ఏదో సరదాగా అన్నాను అని కాఫీ తాగి చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోతాడు రంగా. రంగా ప్రవర్తనికి బాధపడుతూ ఈయన ఎప్పుడు బయటపడతారు, నేను ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేయాలి.

మేమిద్దరం కలిసేది ఎప్పుడు అనుకొని బాధపడుతుంది వసుధార. మరోవైపు కారులో వస్తున్న ధనరాజ్ కి అడ్రస్ తెలియకపోవడంతో లొకేషన్ కోసం సరోజ తండ్రికి ఫోన్ చేస్తాడు. సరే అని కూతురికి ఫోన్ ఇచ్చి లొకేషన్ షేర్ చేయమని చెప్తాడు ధనుంజయ్. ముందు రాంగ్ లోకేషన్ పెట్టాలనుకుంటుంది సరోజ కానీ తండ్రికి తెలిసిపోతుంది అనుకొని కరెక్ట్ లొకేషన్ పెట్టి తర్వాత బుజ్జి కి ఫోన్ చేసి విషయం చెప్తుంది.

నువ్వు ఏ ప్లాన్ వేస్తావో తెలియదు కానీ వాళ్ళు ఇంటికి రాకూడదు అని చెప్తుంది. విషయం నాకు వదిలేయ్ అంటాడు బుజ్జి. మరోవైపు పెళ్లి చూపులు కి వెళ్దాం రమ్మని రంగా ని పిలుస్తుంది రాధమ్మ. నేను రాను వాళ్లు మనల్ని మర్యాదగా పిలవలేదు, అయినా నేను అక్కడికి వచ్చిన తర్వాత నాకు బావ ఇష్టం నేను తననే చేసుకుంటాను అంటే మళ్ళీ పిలిచిన వాళ్లే మనల్ని తిడతారు ఉంటాడు రంగా.

Guppedanta Manasu July 18th 2024 Episode number 1130 Here is the Full story

సరోజ అలాంటి పిల్ల కాదు అంటుంది రాధమ్మ. కావాలంటే మేడం గారిని తీసుకువెళ్ళు అంటాడు రంగా.అక్కడ నాకు ఎవరూ తెలియదు అంటుంది వసుధార. ఇప్పటికే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు తనని తీసుకు వెళ్ళటం బాగోదు అంటుంది రాధమ్మ. అయితే సరే నువ్వు ఒకదానివే వెళ్లి వచ్చేయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు రంగా. చేసేదిలేక ఒక్కతే బయలుదేరుతుంది రాధమ్మ.

మరోవైపు శైలేంద్ర వాళ్ల కారుకి తన బండిని అడ్డగా పెడతాడు బుజ్జి. శైలేంద్ర వాళ్ళు కారు ఆపి బుజ్జి దగ్గరికి వచ్చి బండి పక్కకు తీయమంటారు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను ప్రేమించాను అని చెప్తాడు బుజ్జి. నేను నమ్మను అంటాడు ధనరాజ్ కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను. అంటూ రిషి, సరోజ ఉన్న ఫోటో చూపిస్తాడు బుజ్జి. రిషి ని చూసిన శైలేంద్ర, దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X