Guppedanta Manasu, July 19th episode: తన ధైర్యం బుజ్జి అంటున్న సరోజ.. రంగా ని చూసి వణికిపోతున్న శైలేంద్ర, దేవయ
డి బి ఎస్ టి కాలేజీతో సంబంధాలు తెంచుకోమని కొడుకుతో చెప్తుంది అనుపమ. ఎండి పదవికి తాను సిద్ధంగా లేనని, డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాడు మను. మరోవైపు తన పెళ్లిచూపులు చెడగొట్టమని రంగా ని అడుగుతుంది సరోజ. కుదరదు అంటాడు రంగా. ఎమ్మెస్సార్ శిష్యుడు ధనరాజ్ తన తో పాటు పెళ్లి చూపులకు రమ్మని శైలేంద్రని, దేవయానిని అడుగుతాడు అందుకు ఒప్పుకొని అతనితోపాటు బయలుదేరుతారు తల్లి కొడుకులు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 19 వ తేదీ ఎపిసోడ్ 1,131 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
బుజ్జి చూపించిన ఫోటోలో సరోజతో పాటు ఉన్న రంగా ని చూసి షాక్ అవుతారు శైలేంద్ర, దేవయాని. వీళ్ళిద్దరి ఫోటో చూస్తే తేడాగా ఉంది ఏంటి నాకెందుకో అనుమానంగా ఉంది ఈ సంబంధం వద్దు అంటాడు ధనరాజ్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతాడు శైలేంద్ర.

సరోజ బావ రంగా, నాకు అన్నలాంటి వాడు ఆటో నడుపుతాడు అని చెప్తాడు బుజ్జి. పెళ్లి చూపులకు వెళ్తే రంగా ని చూడొచ్చని ధనరాజ్ ని పెళ్లి చూపులకి ఒప్పించి తీసుకువెళ్తారు దేవయాని, శైలేంద్ర. మరోవైపు ఏ మాత్రం భయం లేకుండా పెళ్లి చూపులకు రెడీ అవుతున్న సరోజ ని చూసి ఏం భయం లేదా అని అడుగుతుంది ఆమె ఫ్రెండ్. ఈ పెళ్లి చూపులు జరిగితేనే కదా అని ధీమాగా చెప్తుంది సరోజ. ఏ ధైర్యంతో చెప్తున్నావు అంటుంది ఆమె ఫ్రెండ్. నా ధైర్యం ఆ బుజ్జిగాడు అంటుంది సరోజ.
అదే సమయంలో కంగారుగా ఇంటికి వచ్చిన బుజ్జి సరోజతో విషయం అంత చెప్తాడు. నేను ముందే చెప్పాను కదా మనిద్దరం ప్రేమించుకున్నాం అంటే వాళ్ళు నమ్మరు అని, బావ నేను ప్రేమించుకున్నామని చెప్పకపోయావా అంటుంది సరోజ నా నోటితో నేను ఎలా చెప్పేది అంటాడు బుజ్జి. ప్లాన్ ఫెయిల్ చేసినందుకు అతనిపై కోప్పడుతుంది సరోజ. మరోవైపు ఇంటికి వచ్చిన రాధమ్మని రిసీవ్ చేసుకుని రంగ రాలేదా అని అడుగుతాడు సంజీవయ్య.

వస్తానన్నాడు అంటుంది రాధమ్మ పోనీలే నువ్వైనా వచ్చి పెద్దరికం నిలబెట్టుకున్నావు అంటాడు సంజీవయ్య. ఇంతలో పెళ్లి వాళ్ళు వస్తారు. సంజీవయ్య దంపతులు వాళ్లని రిసీవ్ చేసుకుంటారు. ధనరాజ్ మా సార్, మా మేడం గారు అంటూ శైలేంద్ర వాళ్ళని పరిచయం చేస్తాడు. షాక్ అవుతారు సంజీవయ్య దంపతులు. తాను చేసిన తప్పు గ్రహించి నాకు మొదటి నుంచి మా అమ్మని అలా పిలవడం అలవాటు అని కవర్ చేసుకుంటాడు ధనరాజ్.
ఇంట్లోకి వెళ్లిన తర్వాత రంగా కోసం చూస్తూ ఉంటారు తల్లి కొడుకులు. అమ్మాయికి రంగా అని బావ ఉన్నాడు అంట కదా అని అడుగుతుంది దేవయాని. విషయం మీ వరకు వచ్చిందా.. అంటూ ఎదురుగా ఉన్న రాధమ్మని చూపించి ఆవిడ మనవడే రంగా అంటే, వరసకే బావ అవుతాడు కానీ వాళ్ళకి మాకు ఎలాంటి బంధుత్వాలు లేవు అని చెప్తాడు సంజీవయ్య. అలాగే రాధమ్మ తో రంగా ని రమ్మనమని చెప్పు అని చెప్తాడు. రాధమ్మ బయటికి వచ్చి రంగా కి ఫోన్ చేస్తుంది.
అప్పుడే వసుధారని తీసుకొని సరోజ ఇంటికి బయలుదేరుతాడు రంగా. రాధమ్మతో వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు మీరు ఈ పెళ్లి చూపులకు వెళ్లడం అవసరమా అయినా బామ్మతో రాను అని చెప్పి ఇప్పుడు ఎందుకు పెళ్లి చూపులకు వెళ్తున్నారు అని అడుగుతుంది వసుధార. నేను వెళ్లకపోతే బావ నేను ప్రేమించుకున్నాం, నేను తనని పెళ్లి చేసుకుంటాను అంటే పెళ్లిచూపులు ఆగిపోతాయి అందుకే నేను వెళ్ళాలి అంటాడు రంగా. మాటల్లోనే సరోజ ఇంటికి వస్తారు.

వసుధార ని బయటనే ఉండిపోమంటాడు రంగా. నేను వస్తాను అంటుంది వసుధార. నేను వెళ్లడమే తప్పక వెళ్తున్నాను మీరు వస్తే బాగోదు, ఇంటి దగ్గర ఉంటే మీకు ప్రాబ్లం అవుతుందని తీసుకువచ్చాను అంటూ వసుధారని అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళిపోతారు రంగా, రాధమ్మ. అప్పటికే సరోజని పెళ్లి వాళ్ళకి చూపిస్తాడు సంజీవయ్య. లోపలికి వచ్చిన రంగాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు దేవయాని, శైలేంద్ర.
సంజీవయ్య రంగాని పరిచయం చేస్తాడు. వణికి పోతున్న శైలేంద్ర, దేవయాని లని చూసి ఏసి వేయలేదు కదా ఎందుకలా వొణికిపోతున్నారు అంటాడు రంగా. ఇంతవరకు ఏసీ కార్లోనే వచ్చాం కదా అందుకే వణికిపోతున్నాం అని తడబడుతూ చెప్తుంది దేవయాని. బయట ఉన్న వసుధార ఈ గొంతు ఎక్కడో విన్నట్లుగా ఉంది అనుకుంటూ లోపలికి వెళ్లబోతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











