Guppedanta Manasu 1st July episode: శైలేంద్రను మను బ్లాక్ మెయిల్.. రిషి సార్ తో పోల్చోద్దు వస్ షాక్!
మినిస్టర్ కాలేజీని హ్యాండోవర్ చేసుకుంటాను అనటంతో కంగారు పడతాడు శైలేంద్ర. మరోవైపు రంగా ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది సరోజ. ఆ ప్రపోజల్ ని సున్నితంగా తిరస్కరిస్తాడు రంగా. ఆయన నిన్ను పెళ్లి చేసుకోరు ఎందుకంటే ఆయనకి ముందే పెళ్లయింది ఆయన నా రిషి సార్ అంటుంది వసుధార.ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 1వ తేదీ ఎపిసోడ్ 1,115 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
మనుని చూసిన శైలేంద్ర షాక్ అవుతాడు వీడు ఇంకా చచ్చి పోలేదా అనుకుంటాడు. ఏంటి నన్ను చూసి షాక్ అవుతున్నావా అని అడుగుతాడు మను. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ అమాయకంగా అడుగుతాడు శైలేంద్ర. ఒకసారి అటు చూడు అంటూ రౌడీలని చూపిస్తాడు మను. రౌడీలని చూసిన శైలేంద్ర షాక్ అవుతూ వీళ్లు దొరికిపోయి నన్ను ఇరికించేసారా అనుకుంటాడు. అవును నేనే చేశాను నువ్వు నా దారికి అడ్డు వస్తున్నావు అంటాడు శైలేంద్ర నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే నేను చేయవలసింది నేను చేస్తాను అంటాడు మను.

పిచ్చి వేషాలు వెయ్యకు ఈసారి తప్పించుకున్నావు కానీ ప్రతిసారి తప్పించుకోలేవు అంటాడు శైలేంద్ర. నీ మాటలకి, చేతలకి భయపడే రకం కాదు నేను, మెడలు వంచి గుండెల్లో దడ పుట్టిస్తాను అంటాడు మను. డైలాగులు చెప్పటం కాదు బరిలోకి దిగు చూడు ఈ శైలేంద్ర ప్రతాపం తెలుస్తుంది. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు శైలేంద్ర.కంప్లైంట్ ఇవ్వడానికి అంటాడు మను.
కంప్లైంట్ ఇవ్వడానికా ఎవరికి అని ఆశ్చర్యంగా అడుగుతాడు శైలేంద్ర. ఫోన్ మాట్లాడుతున్న ఫణీంద్రని చూపిస్తాడు మను.నువ్వు చెప్తే ఆయన నమ్మేస్తారా ఆయనని బురిడీ కొట్టించడానికి నా దగ్గర చాలా మాటలు ఉన్నాయి అంటాడు శైలేంద్ర. వాళ్ల మాటలు నమ్ముతారు కదా అంటూ రౌడీలని చూపిస్తాడు మను. అప్పుడు శైలేంద్రకి టెన్షన్ మొదలవుతుంది చెప్పొద్దు, ఆయనకు నిజం తెలిస్తే నన్ను చంపేస్తారు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు.

కానీ వదిలేస్తే నువ్వు నన్ను చంపేస్తావు అంటాడు మను. లేదు ఇక మీదట నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చేయమంటే అది చేస్తాను అంటాడు శైలేంద్ర. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఫణీంద్ర అక్కడికి వచ్చి మనుని విష్ చేస్తాడు. ఇలా వచ్చావ్ ఏంటి అని అడుగుతాడు. మను శైలేంద్ర వైపు చూస్తాడు వీడేమేనా వెధవ వేషాలు వేసాడా చెప్పు అంటాడు. ఏమీ లేదు అంటాడు మను.
కానీ నాకు అలా అనిపించడం లేదు వీడు ఏమైనా తప్పు చేస్తే చెప్పు నేను చూసుకుంటాను అంటాడు ఫణీంద్ర. మను ఏమీ లేదు అని చెప్పడంతో సరే మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. చూసావా మీ డాడీ కూడా నిన్ను నమ్మడం లేదు వెళ్లి నిజం చెప్పమంటావా అని అడుగుతాడు మను. వద్దు అని రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర. భయం అంటే ఏంటో తెలిసింది కదా, ప్రతిక్షణం భయపడుతూనే ఉండు లేదని తోక జాడిస్తే తోక కత్తిరించేస్తాను అని హెచ్చరించి వెళ్లిపోతాడు మను.
మరోవైపు వెన్నల్లో చందమామ ని చూస్తూ కూర్చుంటాడు రంగా. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార మా రిషి సర్ కి కూడా ఇలా వెన్నెల్లో కూర్చొని చందమామను చూడటం అంటే చాలా ఇష్టం అంటుంది. మీరు మళ్ళీ అక్కడికే వస్తున్నారా నేను ఆయనలా ఉండి ఉండొచ్చు కానీ ప్రతిసారి ఆయనతో నన్ను పోల్చకండి నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, అయినా ఆయన ఏం చేసేవారు అని అడుగుతాడు రంగా.

చాలా చేసేవారు సమాజం కోసం అయినా చాలా చేశారు, పేద విద్యార్థుల కోసం చాలా చేశారు, నాకోసం చాలా చేశారు నా కంటిలో చెమ్మని చూసి తట్టుకోలేకపోయేవారు అలాంటి మమ్మల్ని విధి విడదీసింది. ఇప్పుడు నా కళ్ళ ముందు ఉండి కూడా కొత్త వ్యక్తీ లాగా ప్రవర్తిస్తున్నారు,నన్ను జ్ఞాపకంలా మిగిలిపోమంటున్నారు అంటుంది వసుధార. మీరు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నారు, మీరు నాలో అతనిని ఊహించుకోవద్దు.
నేను వేరు ఆయన వేరు, ఆయన గొప్పవారు నేను ఒక ఆటో నడుపుకుంటూ గడిపే ఒక సామాన్యుడిని ఆయనకి నాకు పోలిక లేదు అని చెపుతాడు. మీరు కావాలనే నటిస్తున్నారు, అందుకే నేను నిజం నిరూపించలేకపోతున్నాను కానీ ఏదో ఒక రోజు మీ నోటితోనే మీరు రిషి సార్ అని చెప్పిస్తాను అంటుంది వసుధార. నేను ఇంత చెప్పినా మీరు వినకపోతే నేను ఏమి చేయలేను సరే వెళ్లి పడుకోండి, నేను కూడా పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు రంగా.
మరోవైపు బేరం కోసం బయలుదేరుతున్న రంగా దగ్గరికి వచ్చి నాకు చిన్న హెల్ప్ చేయగలరా అని అడుగుతుంది వసుధార. మా బాస్ ఎలాంటి హెల్ప్ అయినా చేయగలడు అని గొప్పలు చెప్తాడు రంగా అసిస్టెంట్. ఇంతకీ మీకేం కావాలి అని అడుగుతాడు రంగా. నా దగ్గర బట్టల్లేవు బట్టలు కొనుక్కోవాలి అంటుంది వసుధార. సరోజవి ఉన్నాయి కదా అంటాడు రంగా. తన బట్టలు ఎన్నాళ్ళని వేసుకుంటాను, అయినా ఆ బట్టలు నాకు కంఫర్ట్ గా లేవు అంటుంది వసుధర తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











