Guppedanta Manasu, July 20th episode: రిషిని తప్పకుండా తీసుకొస్తుంది.. వసుధార నమ్మకంపై అనుమానాలా?

ఎండి పదవికి తాను సిద్ధంగా లేనని, డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాడు మను. మరోవైపు తన పెళ్లిచూపులు చెడగొట్టమని రంగా ని అడుగుతుంది సరోజ. కుదరదు అంటాడు రంగా. ఎమ్మెస్సార్ శిష్యుడు ధనరాజ్ తన తో పాటు పెళ్లి చూపులకు రమ్మని శైలేంద్రని, దేవయానిని అడుగుతాడు అందుకు ఒప్పుకొని అతనితోపాటు బయలుదేరుతారు తల్లి కొడుకులు. అక్కడ రంగా ని చూసి షాక్ అవుతారు దేవయాని, శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 20వ తేదీ ఎపిసోడ్ 1,132 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఇంటికి వచ్చిన రంగాతో ఎండన పడి వచ్చావు మంచినీళ్లు తీసుకుంటావా అని అడుగుతుంది సరోజ. వద్దు అంటాడు రంగా. చూడు అన్నయ్య వాడి మీద ఎంత ప్రేమ చూపిస్తుందో అని శైలేంద్రతో అంటాడు ధనరాజ్. కానీ అదేమీ పట్టించుకోని శైలేంద్ర తల్లితో వీడు అచ్చు వాడి లాగానే ఉన్నాడు, నాకు కాళ్లు చేతులు ఆడటం లేదమ్మా అంటాడు. దేవయాని కూడా వీడు వాడేనేమో, నాక్కూడా కంగారుగా ఉంది అంటుంది. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనుకుంటాడు ధనరాజ్.

Guppedanta Manasu July 20th 2024 Episode number 1132 Here is the Full story

ఏసీ లేదు కదా ఎందుకలా వణికిపోతున్నారు అని అడుగుతాడు రంగా. ఏసీ కార్ లోనే వచ్చాం కదా అందుకే అంటుంది దేవయాని. ఆ మాటలు విన్న వసుధార ఈ గొంతు ఎక్కడో విన్నట్లుగా ఉంది అనుకుంటూ హాల్లోకి రాబోతుంది. అది గమనించిన సరోజ నా ఫ్రెండ్ వచ్చింది పలకరించి వస్తాను అని చెప్పి బయటికి వస్తుంది. అక్కడ వసుధారతో మాట్లాడుతూ నేను ఈ సంబంధం చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాను.

నువ్వు మళ్ళీ వచ్చి మా బావని నా భర్త అని చెప్తే నేను ఖాళీగా ఉన్నాను అనుకోని నన్ను పెళ్లి చేసుకుంటారు దయచేసి నువ్వు రావద్దు అంటుంది. అదే సమయంలో ధనరాజ్ రంగాతో మాట్లాడుతూ సరోజ ఎప్పటి నుంచి తెలుసు, మీరే తనని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతాడు. నాకు అలాంటి ఉద్దేశం లేదు అంటాడు రంగా తనకి ఉద్దేశం ఉందేమో అంటాడు ధనరాజ్. లేదు తను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అలా మాట్లాడుతుంది.

Guppedanta Manasu July 20th 2024 Episode number 1132 Here is the Full story

కావాలంటే ఇప్పుడు కూడా మా బావ అంటే నాకు ఇష్టం, నేను తననే చేసుకుంటాను అంటుంది చూడండి అంటాడు. లోపలికి వచ్చిన సరోజ లోపల ఏం జరిగిందో తెలియక సరిగ్గా అలాగే మాట్లాడుతుంది. అయినా నాకు ఈ పెళ్లి ఇష్టమే అంటాడు ధనరాజ్. ఆ మాటలకి షాక్ అవుతుంది సరోజ. ఇక మేము బయలుదేరుతాం అని నానమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు రంగా. టెస్ట్ చేసింది చాలు అంటాడు ధనరాజు. టెస్ట్ ఏమిటి అని అడుగుతుంది సరోజ.

జరిగిందంతా చెప్తాడు సంజీవయ్య, అలాగే బుజ్జి చేసిన పని కూడా బుజ్జి తోనే చెప్పిస్తాడు. టెస్ట్ కాదు, ఏమీ కాదు నేను నా మనసులో మాట చెప్పాను నమ్మితే నమ్మండి లేకపోతే పొండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది సరోజ. మేము మాట్లాడుకుని కబురు పెడతాం అని చెప్పి దేవయాని వాళ్లు కూడా బయలుదేరతారు. మరోవైపు కాలేజీకి ఎందుకు వెళ్లడం లేదు ఎంతో ఇష్టపడి వెళ్లావు కదా అని మనుని అడుగుతుంది ఏంజెల్.

Guppedanta Manasu July 20th 2024 Episode number 1132 Here is the Full story

మను తల్లి వైపు చూస్తూ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అంటాడు. నువ్వైనా చెప్పాలి కదా అత్త అని అనుపమ ని అడుగుతుంది ఏంజెల్. కాలేజీకి వెళ్లవద్దు అని చెప్పిందే నేను అంటుంది అనుపమ. ఎందుకు అని అడుగుతుంది ఏంజెల్. తెలియదు అంటాడు మను. ఎందుకత్త అన్నీ సస్పెన్స్ లో ఉంచుతావు, అయినా ఇప్పుడు ఏం చేస్తా బావ మా కాలేజీకి వస్తావా అని అడుగుతుంది ఏంజెల్. అమ్మని అడిగి వస్తాను, అమ్మ ఏం చెప్తే అది చేస్తాను, అమ్మ కోసం ప్రాణమైనా ఇస్తాను అంటాడు మను.

అయితే అమ్మ కొంగు పట్టుకుని తిరుగు అంటూ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంజెల్. అవును నువ్వు అత్త ని మేడం గారు అని పిలుస్తావు కదా అమ్మ అని పిలుస్తున్నావేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అని నవ్వుతూ చెప్తాడు మను. ఏంజెల్ కి కాఫీ ఇవ్వమని తల్లి తో చెప్పి వెళ్ళిపోతాడు మను. సరే అంటుంది అనుపమ. వాళ్ళ ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది ఏంజెల్. మరోవైపు మహేంద్ర కి కాఫీ ఇచ్చిన ధరణి అతనికి ధైర్యం చెబుతూ ఉంటుంది.

Guppedanta Manasu July 20th 2024 Episode number 1132 Here is the Full story

జీవితం అంతా అయిపోయింది అనుకోకండి అది మనకు ఎప్పుడు సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటుంది. రిషి ని తీసుకువస్తానని వసుధార వెళ్ళింది కదా తను తప్పకుండా రిషి ని తీసుకువస్తుంది. ఆమె నమ్మకాన్ని మీరు ఎవరూ నమ్మలేదు కానీ నేను నమ్మాను అంటుంది ధరణి. అలా జరిగితే నాకన్నా అదృష్టవంతుడు ఉండడు అంటాడు మహేంద్ర.మరోవైపు ఆటోలో వస్తున్న వసుధార రంగా ని పెళ్లి చూపుల గురించి అడుగుతూ ఉంటుంది.

రంగా కూడా పెళ్లి చూపుల్లో ఏం జరిగిందో చెప్తాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా టీ షాప్ కనిపిస్తుంది అక్కడ టీ తాగుదాం అంటుంది వసుధార ఇంట్లో తాగుదాం అంటాడు రంగా. ఈ ఊరికి వచ్చిన తర్వాత మొదటిసారి నేను ఇక్కడే టీ తాగాను, అందుకే ఇక్కడే టీ తాగుదాం అంటుంది వసుధార. సరే అంటాడు రంగా. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X