Guppedanta Manasu July 22th episode: రంగా కన్నేసిన శైలేంద్ర.. మళ్లీ వసుధారను పాండు గ్యాంగ్ టార్గెట్!

ఎమ్మెస్సార్ శిష్యుడు ధనరాజ్ తన తో పాటు పెళ్లి చూపులకు రమ్మని శైలేంద్రని, దేవయానిని అడుగుతాడు అందుకు ఒప్పుకొని అతనితోపాటు బయలుదేరుతారు తల్లి కొడుకులు. అక్కడ రంగా ని చూసి షాక్ అవుతారు దేవయాని, శైలేంద్ర. పెళ్లి చూపుల్లో తనకి సరోజ ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కేవలం మేము బావ మరదలు మాత్రమే అని క్లారిటీ ఇస్తాడు రంగా. సరోజ మాత్రం తనకి పెళ్లి ఇష్టం లేదని అందరి ముందు చెప్పేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 22వ తేదీ ఎపిసోడ్ 1,133 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

టీ కొట్టు దగ్గరికి వెళ్లిన రంగా టీ ఎలా పెట్టాలో కొట్టు వాడికి చెప్తాడు. అలా పెడితేనే మేడం గారు తాగుతారు లేదంటే మేడం గారు వచ్చి టీ పెట్టుకుంటారు అంటాడు. ఈ మాత్రానికే ఆవిడ టీ పెట్టుకోవడం ఏమిటి నేను పెడతాను కూర్చోండి అంటాడు టీ కొట్టు వాడు. మీరు నిజంగా రిషి సారే కదా ఎందుకు అబద్దం చెబుతున్నారు అంటుంది వసుధార. ఇప్పుడు మీకెందుకు ఆ డౌట్ వచ్చింది అంటాడు రంగా.

Guppedanta Manasu July 22th 2024 Episode number 1133 Here is the Full story

నేను టీ ఎలా పెడతానో ఆ ప్రాసెస్ ఇప్పుడు మీరు చెప్పారు. నేను టీ ఎలా పెడతానో రిషి సార్ కి మాత్రమే తెలుసు అంటుంది వసుధార. మీరు మళ్లీ మళ్లీ అలా మాట్లాడకండి నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఎవరైనా ఇలాగే టీ పెడతారు అంతమాత్రానికే నేను రిషి సార్ ని అయిపోతానా అంటాడు రంగా. మరోవైపు దేవయాని, శైలేంద్ర రంగా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

వాడు నిజంగా రిషి ఏమో అంటుంది దేవయాని.వాడు చచ్చి చాలా రోజులైంది వీడు రంగానే వాడి బామ్మ ని కూడా మనం చూసాం కదా అంటాడు శైలేంద్ర. అదంతా నటనేమో అంటుంది దేవయాని. నటించవలసిన అవసరం వాడికే ముంది అంటాడు శైలేంద్ర. వాడి మనసులో మర్మం మనకేం తెలుస్తుంది అయినా వాడు రంగానో, రిషినో నువ్వు ఈ ఊర్లో ఉండి కన్ఫామ్ చేసుకో.

Guppedanta Manasu July 22th 2024 Episode number 1133 Here is the Full story

ఈ పని అయినా కరెక్ట్ గా చెయ్యు ప్రతి విషయం నాకు అప్డేట్ ఇవ్వు అని కొడుకుని మందలించి మరీ చెప్తుంది దేవయాని. అప్పటికే కారులో ఉన్న ధనరాజ్ చిరాకుగా నన్ను కారులో ఉంచి మీరేం మాట్లాడుకుంటున్నారు అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాము ఈ పెళ్లి నీకు ఇష్టమేమో కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేదు అందుకే నేను ఇక్కడే ఉండి వాళ్లకి ఏదో ఒకటి చెప్పి నీ పెళ్లి ఫిక్స్ చేస్తాను అంటాడు శైలేంద్ర.

ధనరాజ్ తో తల్లిని హైదరాబాద్ పంపించేస్తాడు. రిషి ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు శైలేంద్ర. ఒక వ్యక్తికి రిషి ఫోటో చూపించి ఈ వ్యక్తి నీకు తెలుసా అని అడుగుతాడు. సూటు బూటు తీసేస్తే వీడు మా రంగా గాడే ఫోటోషాప్ బలే చేశారు, నాక్కూడా అలాగే చేయండి అంటాడు. సరేగాని రంగా ఎక్కడున్నాడో తెలుసా అంటాడు శైలేంద్ర.ఆ వ్యక్తి రంగాకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నదీ కనుక్కొని శైలేంద్రకీ చెప్తాడు.

Guppedanta Manasu July 22th 2024 Episode number 1133 Here is the Full story

అతను చెప్పిన అడ్రస్ కి బయలుదేరుతాడు శైలేంద్ర.అదే సమయంలో రంగాకి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత రంగా వసుధారతో మాట్లాడుతూ నాకు పని ఉంది నేను వెళ్తున్నాను నేను రావడం ఆలస్యం అయితే మీరు ఇంటికి వెళ్లిపోండి అంటాడు. నేను కూడా వస్తాను అంటుంది వసుధార ఆమెని వారించి రంగా వెళ్ళిపోతాడు. అదే సమయంలో పాండు వాళ్ళు వసుధార ని వెతుక్కుంటూ ఉంటారు.

రంగాని వెతుక్కుంటూ వచ్చిన శైలేంద్రకి వసుధార కనిపించడంతో షాక్ అవుతాడు. అదే సమయంలో వసుధార కి పాండువాళ్ళు కనిపించడంతో కంగారుగా అక్కడ నుంచి పరిగెడుతుంది. పాండువాళ్ళు వసుధారని వెంబడిస్తారు. తాను చూసింది నిజమో కాదో అని కళ్ళు నులుముకొని చూసేటప్పటికీ అక్కడ వసుధార లేకపోవడంతో బ్రమ పడ్డానా అనుకుంటాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X