Guppedanta Manasu, July 23th episode: శైలేంద్రని తప్పుతోవ పట్టించిన పాండు.. తెలివిగా వ్యవహారం నడిపిన రంగా!
పెళ్లి చూపుల్లో రంగా ని చూసి షాక్ అవుతారు దేవయాని, శైలేంద్ర. పెళ్లి చూపుల్లో తనకి సరోజ ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కేవలం మేము బావ మరదలు మాత్రమే అని క్లారిటీ ఇస్తాడు రంగా. సరోజ మాత్రం తనకి పెళ్లి ఇష్టం లేదని అందరి ముందు చెప్పేస్తుంది. అక్కడ ఉన్నది రంగా నా,రిషి నా అని తెలుసుకోవటానికి ఊర్లోనే ఉండిపోతాడు శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 23వ తేదీ ఎపిసోడ్ 1,134 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
వసుధార పాండు గ్యాంగ్ నుంచి తప్పించుకుంటుంది. ఈసారి కూడా మిస్ అయింది అన్న అంటాడు ఒక రౌడీ. ఎప్పటికైనా తను మనకి దొరకాల్సిందే పదండి పోదాం, వెళ్లి ఒక టీ తాగుదాం అని టీ షాప్ కి బయలుదేరుతారు పాండు గ్యాంగ్. అదే సమయంలో టీ షాప్ దగ్గర ఉన్న శైలేంద్ర నేను చూసింది వసుధారనే కానీ వెంటనే మాయమైపోయింది అసలు ఆ పాండు గాడు దానిని చంపాడా, లేదా ఇప్పుడే కనుక్కుందాం అంటూ పాండుకి ఫోన్ చేస్తాడు.

పాండు నేను కాకినాడలో ఉన్నాను అని అబద్ధం చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒకరికి ఒకరు డ్యాష్ ఇచ్చుకుంటారు.ఒకరిని చూసి ఒకరు షాక్ అవుతారు. ఇదేనా కాకినాడ అని కోపంగా అడుగుతాడు శైలేంద్ర. మీరు మాటిమాటికి ఫోన్ చేసి విసిగిస్తుంటే అలా చెప్పాను, వేరే పని మీద ఉన్నాను టెన్షన్ లో ఉన్నాను అంటాడు పాండు.
నాకు ఇక్కడ వసుధార కనిపించింది నువ్వు నిజంగానే వసుధారని చంపావా అని అడుగుతాడు శైలేంద్ర. చంపి పాతి పెట్టాను కావాలంటే అస్తికలు తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్దాము. వాళ్లు మనల్ని అరెస్టు చేసి ఆ ఎముకలు వసుధారవి అవునా కాదా అని ఎంక్వయిరీ చేస్తారు పదండి వెళ్దాం అంటాడు పాండు. కంగారుపడిన శైలేంద్ర వద్దులే నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పడంతో పాండు వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

ఎందుకైనా మంచిది వసుధార గురించి టీ షాపు వాడిని అడుగుదాము తను అక్కడే కదా కనిపించింది అనుకొని తను ఫోన్ తీసి టీ షాపు వాడికి చూపించేసరికి అక్కడ పాండు ఏడుస్తూ కనిపిస్తాడు. షాక్ అయిన శైలేంద్ర ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. మీరు నన్ను నమ్మడం లేదు కదా మీరు నన్ను నా వృత్తిని అవమానిస్తున్నారు ఆ పిల్ల ఫోటో చూపించి ఎంక్వయిరీ చేయాలనుకున్నారు నాకు చాలా అవమానంగా ఉంది అంటాడు పాండు. సరేలే నేను నిన్ను నమ్మాను అంటాడు శైలేంద్ర.
అలా కాదు ఇకమీదట ఎట్టి పరిస్థితులలోనూ ఎంక్వయిరీ చేయనని నాకు మాట ఇవ్వండి అని శైలేంద్ర దగ్గర మాట తీసుకొని వెళ్ళిపోతాడు పాండు. పాపం బాగా హర్ట్ అయినట్లు ఉన్నాడు అనుకొని పాండు మీద జాలి పడతాడు శైలేంద్ర. తర్వాత టీ షాప్ దగ్గరికి వెళ్లి రంగా ఇల్లు చూపించమంటాడు. షాప్ అతను కొడుకుని ఇచ్చి పంపిస్తాడు. అదే సమయంలో ఇంటి దగ్గర బుజ్జి, రంగా ఆటో కడుగుతూ ఉంటారు అప్పుడే వసుధార బయటికి వస్తుంది.

అంతలోనే తన ఇంటికి వస్తున్న శైలేంద్రని చూసి కంగారు పడతాడు రంగా. అనుకోకుండా వసదారిమీద నీరు పోసినట్లుగా పోసి అయ్యో చూసుకోలేదు పూర్తిగా తడిచిపోయారు వెళ్లి బట్టలు మార్చుకోండి అని చెప్తాడు. నన్ను లోపలికి పంపించేయడం కోసం తడిపేసినట్లుగా ఉన్నారు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటుంది వసుధార. అలాంటిదేమీ లేదని చెప్పి ఆమెని లోపలికి పంపించి బయట గడియ పెట్టేస్తాడు రంగా. సరిగ్గా అదే సమయానికి శైలేంద్ర వస్తాడు.
రంగా ని చూసి చాలా వింతలు చూశారు కానీ ఇలాంటి వింత ఎక్కడా చూడలేదు అనుకుంటాడు శైలేంద్ర. రంగా ఇలా వచ్చారేంటి సార్ అని శైలేంద్రని అడుగుతాడు. సరోజ విషయంలో చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాను అంటాడు శైలేంద్ర. మీకు ఒక్కడే క్లారిటీ ఇచ్చాను కదా తన మీద నాకు ఎలాంటి అభిప్రాయము లేదు అని మళ్ళీ క్లారిటీ ఇస్తాడు రంగా. మీరు అపార్థం చేసుకుంటున్నారు నేను ఆ విషయంగా ఎంక్వయిరీ చేయడానికి రాలేదు అంటూ ఆమెకి వంట వచ్చా అని పిచ్చి ప్రశ్నలు వేస్తాడు.
అన్నిటికీ సమాధానం చెప్పిన రంగా ఇవన్నీ నన్ను అడగడం కాదు మీరు మామయ్య దగ్గరే క్లారిటీ తీసుకుందురు గాని పదండి అని అక్కడి నుంచి త్వరగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. అప్పటికే వసుధార డ్రెస్ మార్చుకుని వచ్చి తలుపు తీయాలి అనుకుంటే తలుపు గడియ వేసి ఉంటుంది ఆ గొంతు కూడా శైలేంద్ర సార్ గొంతుకు లాగా ఉంది అని అనుకుంటుంది. శైలేంద్ర వాళ్ళు ఇంటి నుంచి వెళుతుంటే రాధమ్మ వచ్చి మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది కొంచెం ఎంక్వయిరీ కోసం అంటాడు శైలేంద్ర.

మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా,అయినా మా మనవడు అక్కడే చెప్పాడు కదా, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను మా మనవడికి మనవరాలిని చేసుకునే ఉద్దేశం లేదు అని క్లారిటీ ఇస్తుంది రాధమ్మ. తర్వాత శైలేంద్రని తీసుకుని బయటికి వెళ్లిపోతాడు రంగా. రాధమ్మ బయటినుంచి గడియ తీసి ఎవరు గడియ పెట్టారు అంటుంది. నాకు అదే అర్థం కాలేదు అంటుంది వసుధార. రంగా ఏ నువ్వు లోపల ఉన్నావని తెలియక పెట్టి ఉంటాడు అంటుంది రాధమ్మ.
వచ్చింది శైలేంద్ర సార్ లాగా ఉంది పెళ్లిచూపుల్లో వసుధార మేడం గొంతు లాగా వినిపించింది, వచ్చింది ఎవరో తెలుసుకోవాలని బయలుదేరుతుంది వసుధార. మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న రంగాని ఒక వ్యక్తి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటాడు. రిషి గురించి కొనుక్కోవటానికి వచ్చిన నేను ఎలా ఇరుక్కుపోయాను ఏమిటి అనుకుంటాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











