Guppedanta Manasu July 24th episode: రంగాని అనుమానిస్తున్న బుజ్జి.. వసుధారపై విరుచుకుపడిన సరోజ!

పెళ్లి చూపుల్లో తనకి సరోజ ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కేవలం మేము బావ మరదలు మాత్రమే అని పెళ్లి వాళ్ళకి క్లారిటీ ఇస్తాడు రంగా. సరోజ మాత్రం తనకి పెళ్లి ఇష్టం లేదని అందరి ముందు చెప్పేస్తుంది. అక్కడ ఉన్నది రంగా నా,రిషి నా అని తెలుసుకోవటానికి ఊర్లోనే ఉండిపోతాడు శైలేంద్ర. తన ఇంటికి వచ్చిన శైలేంద్ర వసుధార కంట పడకుండా జాగ్రత్త పడతాడు రిషి. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 24వ తేదీ ఎపిసోడ్ 1,135 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

రంగా, శైలేంద్ర ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూ ఉంటే రంగా కి తెలిసిన వాళ్ళు వచ్చి అతడిని పలకరిస్తూ ఉంటారు. అది గమనించిన శైలేంద్ర వీడు రిషి కాదు రంగాయే అని ఒక క్లారిటీ కి వస్తాడు. అంతలోనే బుజ్జి ఆటో తీసుకొని వస్తాడు. రండి ఆటోలో వెళ్లిపోదాం ఇక్కడికి మా మామయ్య ఇల్లు దగ్గరే అంటాడు రంగా. నేను రాను ఈ సంబంధం మాకు బాగా నచ్చింది.ఈ విషయం మీరు మీ మామయ్యకి చెప్పేయండి అంటాడు శైలేంద్ర.

Guppedanta Manasu July 24th 2024 Episode number 1135 Here is the Full story

మీరే చెప్పొచ్చు కదా అంటాడు బుజ్జి. నాకు అంత టైం లేదు నేను త్వరగా వెళ్ళిపోవాలి అంటాడు శైలేంద్ర. తర్వాత తన ఫోన్లో వసుధార ఫోటో చూపించి ఈమె మీకు తెలుసా అని అడుగుతాడు శైలేంద్ర. వసుధార ఫోటో చూసిన బుజ్జి షాక్ అవుతాడు, వసుధార గురించి మాట్లాడబోతే రంగా వారించి మాకు తెలియదు అని అబద్ధం చెప్తాడు. తర్వాత ఒక ఆటోని పిలిచి ఆటోలో శైలేంద్రని పంపించేస్తాడు.ఇదంతా చూస్తున్న బుజ్జి రంగా ని అనుమానిస్తాడు.

మేడం గారు తెలిసినా తెలియదు అని ఎందుకు చెప్పావు అని రంగాని అడుగుతాడు బుజ్జి. వాళ్ల వల్ల మేడమ్ గారికి ప్రమాదమేమో అనిపించింది అందుకే అలా చెప్పాను అంటాడు రంగా. మరోవైపు వసుధార సరోజ ఇంటికి వస్తుంది. రంగా ఇక్కడికి వచ్చారా అని అడుగుతుంది. నువ్వు వచ్చాక ఇంక మా బావ ఇక్కడికి ఎందుకు వస్తాడు, రిషి సార్,రిషి సార్ అనుకొని అతని వెంట తిరిగావు.

Guppedanta Manasu July 24th 2024 Episode number 1135 Here is the Full story

మొత్తానికి ఏ నువ్వు అనుకున్నది సాధించావు నీవల్లే మా బావ నన్ను దూరం పెడుతున్నాడు, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని వసుధార మీద విరుచుకుపడుతుంది సరోజ. అప్పుడే అక్కడికి వచ్చిన రంగా సరోజని కోప్పడతాడు. నువ్వు రంగా వి అయితే తనని ఎందుకు భరిస్తున్నావు, అయినా నీ మనసులో నేను లేనా నిజం చెప్పు అని అడుగుతుంది సరోజ. అప్పుడే సంజీవయ్య కూడా వచ్చి నీ మనసులో మాట చెప్పు నా కూతురికి నేను విలన్ లాగా కనిపిస్తున్నాను అంటాడు.

అప్పుడు రంగ మాట్లాడుతూ నా మనసులో నువ్వు లేవు అని క్లారిటీ ఇస్తాడు. అలాగే పెళ్లి వాళ్ళకి నువ్వు నచ్చావు అని కూడా చెప్తాడు. ఆ మాటలకి సంజీవయ్య ఆనందపడతాడు. కానీ సరోజ మాత్రం నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అంటుంది. అది నీ ఇష్టం అంతేకానీ నా కోసమే ఈ పెళ్లి మానుకుంటే జరిగే ఉపయోగం ఏమీ ఉండదు అని సరోజకి చెప్తాడు . తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చారు అని వసుధారని మందలించి ఆమెను తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

Guppedanta Manasu July 24th 2024 Episode number 1135 Here is the Full story

తర్వాత పెళ్లికి ఒప్పుకోమని కూతురికి నచ్చ చెప్తాడు సంజీవయ్య. చేసుకుంటే బావనే చేసుకుంటాను లేదంటే ఇలాగే ఉండిపోతాను అని మనసులో అనుకుంటుంది సరోజ. మరోవైపు రంగా, బుజ్జి,సరోజ మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లి వాళ్ల గురించి ఎంక్వయిరీ చేస్తుంది వసుధార. తనకే వివరాలు తెలియవు అంటాడు రంగా. మీరు ఇక్కడ ఉన్నట్లు మీ వాళ్లకు తెలియదు, మీకు ఫోన్ చేద్దామంటే మీ దగ్గర ఫోన్ కూడా లేదు కానీ మీకు చేసే అవకాశం ఉన్న మీ వాళ్లకి ఎందుకు ఫోన్ చేయడం లేదు..

మీ రిషి సార్ తిరిగి వచ్చారేమో, మీరు కనిపించక మిమ్మల్ని వెతుకుతున్నారేమో, మీకు వాళ్ళని చూడాలని, వాళ్ళ దగ్గరికి వెళ్లాలని అనిపించడం లేదా అని అడుగుతాడు బుజ్జి. ఆ మాటలకి బుజ్జిని కోప్పడతాడు రంగా. ఈ మధ్య రంగా అన్న ప్రవర్తన తేడాగా కనిపిస్తుంది నిజంగానే మేడంగారు అన్నట్టు రంగా అన్న రిషి సార్ ఇద్దరూ ఒకటేనా అని అనుమాన పడతాడు బుజ్జి. మరోవైపు శైలేంద్ర తల్లికి ఫోన్ చేసి వీడు రిషి కాదు రంగా అని చెప్తాడు.

నువ్వు సరిగ్గా ఎంక్వయిరీ చేశావు కదా వాడు రిషి అయితే గనక మనం చిక్కుల్లో పడతాం లేదంటే వాడిని ఉపయోగించుకొని మనం అనుకున్న పని చేద్దాం అంటుంది దేవయాని. ఏ పని అంటాడు శైలేంద్ర. మినిస్టర్ ఏమన్నాడో గుర్తుందా అంటుంది దేవయాని. నువ్వు ఎండి కావాలంటే రిషి గాని వసుధారగాని వచ్చి అనౌన్స్ చేయాలి అన్న మినిస్టర్ మాటలు గుర్తుకు వస్తాయి శైలేంద్ర కి. తల్లి మాటలకి అర్థం గ్రహించిన శైలేంద్ర నవ్వుకుంటాడు తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X