Guppedanta Manasu, July 25th episode: శైలేంద్ర‌తో కలిసి దేవయాని మరో కుట్ర.. వసుధారని తప్పుపడుతున్న రంగా!

సరోజ తనకి పెళ్లి ఇష్టం లేదని అందరి ముందు చెప్పేస్తుంది. అక్కడ ఉన్నది రంగా నా,రిషి నా అని తెలుసుకోవటానికి ఊర్లోనే ఉండిపోతాడు శైలేంద్ర. తన ఇంటికి వచ్చిన శైలేంద్ర వసుధార కంట పడకుండా జాగ్రత్త పడతాడు రిషి. రంగని ఎంక్వయిరీ చేసిన శైలేంద్ర అతను రిషి కాదని రంగా అని కన్ఫామ్ చేసుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 25వ తేదీ ఎపిసోడ్ 1,136 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

తల్లి మాటల్లో అర్థం గ్రహించిన శైలేంద్ర అర్థమైంది మమ్మీ ఇప్పుడు ఈ రంగాన్ని రిషి ప్లేస్ లో తీసుకొచ్చి మన కల నెరవేర్చుకోవాలి అంతే కదా అంటాడు. జాగ్రత్త ఆ రంగా ముందు అస్సలు బయటపడొద్దు, నువ్వు నేరుగా కాకుండా వాళ్ళ మామయ్య ద్వారా వెళ్ళు అంటూ రిషి దగ్గర ఎలా వ్యవహరించాలో శైలేంద్ర కి చెప్తుంది దేవయాని. తర్వాత తను కాలేజీకి ఎప్పుడు ఎండి అవుతాడో, ఎప్పుడు పెద్ద వాళ్ళు అందరూ తనని ఎండి అని పిలుస్తారో అని అనుకుంటాడు శైలేంద్ర.

Guppedanta Manasu July 25th episode

మరోవైపు రంగా వసుధారతో మాట్లాడుతూ మీరు కాలేజీ ఎండి అన్నారు కదా ఎందుకు ఆ కాలేజీ వదిలేసి వచ్చేసారు, ఇప్పుడు ఆ కాలేజీ ఏ పరిస్థితుల్లో ఉందో కనీసం తెలుసుకున్నారా, రిషి సార్ కి ఆ కాలేజీ అంటే ఎంతో ఇష్టమని చెప్తున్నారు అలాంటి కాలేజీని వదిలేసి ఎందుకు వచ్చారు రేపటి రోజున మీ రిషి సార్ వచ్చి అడిగితే ఏమని చెప్తారు అంటాడు. రిషి సార్ అడిగితే చెప్పడానికి నా దగ్గర సమాధానం ఉంది,

మీరు రిషి సార్ అయితే చెప్పండి ఇప్పుడే మీకు సమాధానం చెప్తాను అంటుంది వసుధార. మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నేను రిషి ని కాదు రంగాని అని, ఎంతసేపూ నన్ను రిషి సార్ ని చేద్దామని ప్రయత్నమే గాని కష్టాల్లో ఉన్న కాలేజీని కొలిక్కి తీసుకు వద్దామని ఆలోచన లేదు, పాపం ఆ స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమైపోతుందో ఏమో, రిషి సార్ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు అంటాడు రంగా. అప్పుడు వసుధార బుజ్జి దగ్గర ఫోన్ తీసుకొని కాలేజీకి ఫోన్ చేస్తుంది.

Guppedanta Manasu July 25th 2024 Episode number 1136 Here is the Full story

కాలేజీకి ఎండి ఎవరూ లేరని రేపు కాలేజీని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటుందని తెలుసుకొని షాక్ అవుతుంది, అదే విషయం రంగాకి చెప్తుంది. మన కాలేజీ కష్టాల్లో ఉంది రండి వెళ్దాం అని రంగా ని రిక్వెస్ట్ చేస్తుంది. నేను రాను అంటాడు రంగా, మీరు రాకపోతే నేనూ వెళ్ళను అంటుంది వసుధార. వెళ్లడం, వెళ్లకపోవటం మీ ఇష్టం కానీ నేను మాత్రం రాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రంగా. ఆ తర్వాత సంజీవయ్య రంగా ఇంటికి వచ్చి నువ్వు పెళ్లి వాళ్ళతో ఏం చెప్పావో ఏమో తెలియదు.

కానీ వాళ్లు నీతో మాట్లాడాలి అంటున్నారు ఏవో కొన్ని డౌట్స్ ఉన్నాయంట నిన్ను తీసుకు రమ్మన్నారు అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార ఆయనకి అన్ని అనుమానాలు ఉంటే ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఎందుకు బయట మాట్లాడుకోవడం అని అడుగుతుంది. ఇది మా ఇంటి వ్యవహారం మీరు కలుగ చేసుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు రంగా. తరువాత సంజీవయ్యతో వెళ్తూ మీరు ఇంట్లోనే ఉండండి బయటికి రావద్దు అని వసుధారతో చెప్పి మరీ వెళ్తాడు.

Guppedanta Manasu July 25th 2024 Episode number 1136 Here is the Full story

తర్వాత వసుధార రంగా అన్న మాటలు గురించి ఆలోచిస్తూ రిషి సార్ కాలేజీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు, కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అని తెలిసినా కూడా ఎందుకు ఇలా మొండి గా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుంది. మరోవైపు శైలేంద్ర దగ్గరికి రంగా ని తీసుకువస్తాడు సంజీవయ్య. నేను అతని తో పర్సనల్ గా మాట్లాడాలి అని చెప్పి సంజీవయ్యని పంపించేస్తాడు శైలేంద్ర.

నేను మీకు ఆ రోజే చెప్పాను కదా నాకు స రోజుకి ఎలాంటి ప్రేమలు లేవని మళ్లీ ఈ ఎంక్వయిరీ ఏమిటి అంటాడు రంగా. నిన్ను పిలిచింది అందుకోసం కాదు అంటూ తన ఫోన్లో ఉన్న రిషి ఫోటో చూపిస్తాడు శైలేంద్ర. ఒక్కసారిగా షాక్ అవుతాడు రంగా. వీడు నా తమ్ముడు రిషింద్ర భూషణ్. ఒక కాలేజీకి ఎండి, చాలా మంచివాడు అని చెప్తాడు శైలేంద్ర. ఆ మాటలని ఆశ్చర్యంగా వింటాడు రంగా. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X