Guppedanta Manasu July 26th episode: రంగాకి 5 కోట్ల శైలేంద్ర.. రాధమ్మని కంగారు పెడుతున్న వసుధార!
అక్కడ ఉన్నది రంగా నా,రిషి నా అని తెలుసుకోవటానికి ఊర్లోనే ఉండిపోతాడు శైలేంద్ర. తన ఇంటికి వచ్చిన శైలేంద్ర వసుధార కంట పడకుండా జాగ్రత్త పడతాడు రిషి. రంగని ఎంక్వయిరీ చేసిన శైలేంద్ర అతను రిషి కాదని రంగా అని కన్ఫామ్ చేసుకుంటాడు. అదే విషయం దేవయానికి చెప్తాడు శైలేంద్ర. అయితే మనం రంగా ని ఉపయోగించుకోవచ్చు అని కొడుక్కి ఒక సలహా ఇస్తుంది దేవయాని. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 26వ తేదీ ఎపిసోడ్ 1,137ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
శైలేంద్ర రిషి గురించి రంగాకి గొప్పగా చెప్తాడు. నాకు అతడిని చూడాలనిపిస్తుంది అంటాడు రంగా. తను చనిపోయాడు అంటాడు శైలేంద్ర అలాగే తనకి ఒక సాయం చేయమని కూడా అడుగుతాడు ఏంటది అంటాడు రంగా. నువ్వు మా తమ్ముడు లాగా నటించి కాలేజీకి ఎండి అవ్వాలి అంటాడు శైలేంద్ర. నాకు చదువు లేదు, నేను ఆ పని చేయలేను అంటాడు రంగా. సరే అయితే నువ్వు అక్కడికి నా తమ్ముడు లాగా వచ్చి నన్ను ఎండిన చేయమని చెప్పు. నాకూ ఈ పదవి మీద ఇంట్రెస్ట్ లేదు కానీ పిల్లల భవిష్యత్తు కోసం, కాలేజీని కాపాడుకోవడం కోసం ఇలా చేయక తప్పడంలేదు.

నువ్వు అలా చేసినందుకు కోటి రూపాయలు ఇస్తాను అంటాడు శైలేంద్ర. అయినా ఒప్పుకోకుండా ఆలోచిస్తున్న రంగాతో కావాలంటే నీకు ఐదు కోట్లు ఇస్తాను దాంతో నీ అప్పులు తీర్చుకోవచ్చు, మీ నానమ్మ కి ఆపరేషన్ కూడా చేయించవచ్చు అని చెప్తాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న పాండు గ్యాంగ్ షాక్ అవుతారు వీడేమిటి అతనితో మాట్లాడుతున్నాడు అంటాడు పాండు. వసుధారని వాడే కాపాడాడు అని శైలేంద్ర గారితో చెబుదామా అంటాడు ఒక రౌడీ.
వద్దు వాడు కరెంటు పోల్ ని ముట్టుకున్నాడు వాడిని ముట్టుకుంటే మనకి కూడా షాక్ కొడుతుంది అంటాడు పాండు. నెక్స్ట్ సీన్ లో ఐదు కోట్ల డీలింగ్ గురించి తల్లితో చెప్తాడు శైలేంద్ర ఆటో వాడికి 5 కోట్లు ఎందుకు అంటుంది దేవయాని. వాడు రిషిగా వచ్చే చేయబోయే పనికి ఐదు కోట్లు ఇచ్చినా తప్పులేదు అంటాడు శైలేంద్ర. అందరూ కలలు కంటారు వాటిని త్వరగా సహకారం చేసుకుంటారు కానీ మన కల తీరటానికి మాత్రం సంవత్సరాలు పట్టేస్తుంది.

ఎం డి సీట్ కోసం మనం ఎన్ని అరాచకాలు చేసాము అయినా మన కల నెరవేరటం లేదు అంటుంది దేవయాని. ఈసారి కచ్చితంగా మన కల నెరవేరుతుంది, మన డీలింగ్ కి వాడు ఒప్పుకుంటాడు వాడే మనకి కాల్ చేస్తాడు చూడు అంటాడు శైలేంద్ర. చివరిలో వచ్చి ఆ మాటలు విన్న ధరణి వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు కాలేజీ వెళ్లి చేతికి రాకుండా చూడమని దేవుని ప్రార్థిస్తుంది. మరోవైపు రంగా వసుధారని కాలేజీ దగ్గరికి వెళ్లడం లేదని మందలిస్తాడు.
మీకు కాలేజీ ఏమైపోయినా పర్వాలేదు, స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు కానీ మీరు రంగాని రిషి గా మార్చడమే పనిగా పెట్టుకున్నారు మీకెంత స్వార్థం అంటాడు. ఆ మాటలకి కన్నీరు పెట్టుకుంటుంది వసుధార. సమస్యలతో పోరాడాలి గాని కన్నీరు పెట్టుకుంటే ఏంటి ప్రయోజనం దయచేసి కాలేజీ కి వెళ్ళండి కాలేజీని కాపాడండి అంటాడు రంగా. మీరు లేకుండా నేను వెళ్ళను మీరు కూడా నాతో రండి అంటుంది వసుధార. నేను రిషి సార్ ని కాదు రంగా ని, నేను మీతో రాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగా.

మరుసటి రోజు ఫ్రెష్ అవుతున్న వసుధార కి తన ఉంగరం కనిపించకపోవడం తో కంగారు పడుతుంది కిందికి వచ్చి హాల్లో వెతుకుతూ ఉంటుంది. విషయం తెలుసుకున్న రాధమ్మ కంగారు పడకు నువ్వే తీసి ఎక్కడో పెట్టి ఉంటావు అంటుంది. అది కేవలం రింగ్ మాత్రమే కాదు బామ్మ, నా ప్రాణం నేను ఎప్పుడూ దానిని తీయను, ఉంగరం కనిపించడం లేదంటే రిషి సర్ ఏమైనా జరుగుతుందంటారా నాకు కంగారుగా ఉంది అంటుంది వసుధార.
ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు అని కంగారుపడుతుంది రాధమ్మ. ఆయన ఏరి బామ్మ, ఎక్కడికి వెళ్లారు అంటుంది వసుధార. రాత్రి ఎక్కడికో వెళ్తానని బుజ్జిని తీసుకొని వెళ్ళాడు అంటుంది రాధమ్మ. ఎక్కడికి వెళ్లారు అంటుంది వసుధార. ఏమోనమ్మ అంటుంది రాధమ్మ. అలా ఎలా పంపించేస్తారు ఆయనకి ఏమైనా జరుగుతుందేమో అని కంగారుపడుతుంది వసుధార.

నా మనవడు మంచికి మంచి, చెడుకు చెడు. పదిమంది రౌడీలనైనా పడగొడతాడు వాడికి ఏమీ కాదు క్షేమంగా తిరిగి వస్తాడు అంటుంది రాధమ్మ. తరువాత రంగా నీకు ఇది ఏమన్నాడు అని ఏదో గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చి వసుధార చేతిలో పెడుతుంది. ఏంటిది అనుకుంటుంది వసుధార. మరోవైపు శైలేంద్రని కలిసిన రంగా శైలేంద్ర డీలింగ్ కి ఒప్పుకున్నట్లు చెప్తాడు. ఆ మాటలకి ఆనందపడతాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











