Guppedanta Manasu, July 27th episode: మహేంద్ర కోరికను మను తీరుస్తాడా? రంగా రిషి కాదని వసుధార తేల్చేసిందా?

తన ఇంటికి వచ్చిన శైలేంద్ర వసుధార కంట పడకుండా జాగ్రత్త పడతాడు రిషి. రంగా ని ఎంక్వయిరీ చేసిన శైలేంద్ర అతను రిషి కాదని రంగా అని కన్ఫామ్ చేసుకుంటాడు. అదే విషయం దేవయానికి చెప్తాడు శైలేంద్ర. అయితే మనం రంగా ని ఉపయోగించుకోవచ్చు అని కొడుక్కి ఒక సలహా ఇస్తుంది దేవయాని. వసుధార తన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. సెంటిమెంట్ గా ఫీల్ అయిన వసుధార రిషికి ఏమైనా అవుతుందేమో అని కంగారు పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 27వ తేదీ ఎపిసోడ్ 1,138ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఫణీంద్ర ఇంటికి అనుపమ, మను వస్తారు. దారి తప్పి వచ్చారా అని వెటకారంగా అడుగుతుంది దేవయాని. కావాలనే వచ్చాను మహేంద్ర ని కలవాలి అంటుంది అనుపమ. ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు కలుస్తాను అంటే అతను ఒప్పుకోడు అంటుంది దేవయాని. మేము ఎందుకు వెళ్లిపోయామో మీకు తెలియదా అంటుంది అనుపమ. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే మహేంద్ర అక్కడికి వచ్చి అనుపమ వాళ్ళని పలకరిస్తాడు. మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయినందుకు క్షమించండి అంటాడు మను.

Guppedanta Manasu July 27th 2024 Episode number 1138 Here is the Full story

పర్వాలేదు లెండి బంధువులే రాబంధువుల్లాగా పొడుచుకు తింటున్నారు, ఏ బంధము లేకపోయినా మీరు నన్ను సొంత మనిషి లాగా చూసుకున్నారు అదే చాలు అంటాడు మహేంద్ర. మేము ఈ సిటీని వదిలి వెళ్లిపోవాలి అనుకుంటున్నాం మహేంద్ర, మను నిన్ను చూసి వెళ్ళిపోవాలి అంటే ఇలా వచ్చాం అంటుంది అనుపమ. నిజమేనా అంటాడు మహేంద్ర, నిజమే అంటాడు మను మహేంద్రని హగ్ చేసుకుని మీరు నాకు తండ్రి ప్రేమని రుచి చూపించారు అని ఎమోషనల్ అవుతాడు మను.

నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా కొడుకు లాగే నువ్వు కూడా నాకు చాలా సపోర్టుగా నిలబడ్డావు,నా కోసం చాలా చేశావు, తండ్రి లాంటి నా కోరిక ఒకటి తీరుస్తావా అంటాడు మహేంద్ర. ఏంటది అంటాడు మను ఈ సిటీ వదిలి వెళ్ళిపోవద్దు, ఇంటికి వెళ్లి ఆలోచించుకో నిర్ణయం మాత్రం నీదే అని చెప్పి వెళ్ళిపోతాడు మహేంద్ర. అనుపమ వాళ్లు వెళ్లిపోతుంటే పౌరుషం అభిమానం ఉన్నవాళ్లయితే మళ్లీ ఈ గుమ్మం తొక్కొద్దు అని హెచ్చరిస్తుంది దేవయాని.

Guppedanta Manasu July 27th 2024 Episode number 1138 Here is the Full story

మరోవైపు శైలేంద్ర డీలింగ్ కి ఒప్పుకుంటాడు రంగా. ఇప్పుడే వెళ్దాం అంటాడు శైలేంద్ర. బట్టలు అవి తెచ్చుకుంటాను అని రంగా అంటే అక్కర్లేదు నీకు నేను అన్ని సెటప్ చేశాను అంటాడు శైలేంద్ర. సరే ఈ డబ్బు బుజ్జికి ఇచ్చి వస్తాను అని చెప్పి బుజ్జి దగ్గరికి వెళ్లిన రంగా డబ్బు అతని చేతిలో పెట్టి నానమ్మకి వైద్యం చేయించు, కొద్దిరోజులు ఇంటికి రాను అంటాడు. బామ్మ అడిగితే ఏమని చెప్పాలి అంటాడు బుజ్జి పనిమీద వెళ్లానని మాత్రమే చెప్పు అంటాడు. మేడం గారు అడిగితే ఏం చెప్పాలి అంటాడు బుజ్జి.

వసుధార ఉంగరం బుజ్జి చేతిలో పెట్టి ఇది ఆవిడకి ఇవ్వు అప్పుడు తనకి ఏం చేయాలో తెలుస్తుంది అంటూ బుజ్జికి ఏదో విషయం చెప్పి ఈ విషయం మన మధ్యనే ఉండాలి బయటకు తెలిస్తే మనమే ప్రమాదంలో పడతాం అని హెచ్చరిస్తాడు రంగా. సరే అంటాడు బుజ్జి. అదే సమయంలో శైలేంద్ర తల్లికి ఫోన్ చేసి రంగా డీలింగ్ కి ఒప్పుకున్నాడని, ఇప్పుడే ఊరికి తీసుకు వస్తున్నానని చెప్తాడు. ఇక్కడికి తీసుకు వస్తే ప్రమాదమేమో ఆ వసుధార వచ్చిందంటే ఖచ్చితంగా అతను రిషి కాదు అని చెప్పేస్తుంది అంటుంది.

Guppedanta Manasu July 27th 2024 Episode number 1138 Here is the Full story

ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా నేను ట్రైనింగ్ ఇస్తాను అంటాడు శైలేంద్ర. శైలేంద్ర కి జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దేవయాని. మరోవైపు తల్లితో మాట్లాడుతున్న మను నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా అని అడుగుతాడు. సరైన సమాధానం వస్తుందని ఆశిస్తున్నావా అంటుంది అనుపమ. నువ్వు సమాధానం చెప్పవని నాకు తెలుసు నేను అడిగినదానికి ఎస్ ఆర్ నో చెప్పు చాలు అంటాడు మను.

చెప్పాలనిపిస్తే చెప్తాను దాచవలసిన విషయం అయితే దాస్తాను అంటుంది అనుపమ. నా కన్న తండ్రి మహేంద్ర గారే కదా అంటాడు మను ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది అనుపమ. అలా ఎందుకు అడగాలి అనిపించింది అంటుంది. ఎందుకో తెలియదు ఆయనని కలిసిన మొదటి రోజు నుంచి తెలియని ఎఫెక్షన్ కనిపిస్తుంది, కన్న తండ్రి ఆప్యాయత కనిపిస్తుంది నిజం చెప్పు ఆయనే కదా నా తండ్రి అంటాడు. ఆ ప్రశ్నకి ఏమి సమాధానం చెప్పదు అనుపమ.

సమాధానం చెప్పమ్మా, అసలు నువ్వు నా కన్న తల్లివేనా నిజంగా నువ్వు నా కన్నతల్లివైతే నాకు క్షోభ నీకు అర్థం అవుతుంది. ఇంకా ఎన్నాళ్లు నన్ను క్షోభ పెడతావు అని అడుగుతాడు మను. కన్నతల్లి అంటే అర్థం తెలుసుకొని అప్పుడు నన్ను ఈ ప్రశ్న వెయ్యు అని ఎలాంటి సమాధానం చెప్పకుండా, మను పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనుపమ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X