Guppedanta Manasu, July 29th episode: అంతులేని ఆనందంలో వసుధార.. రంగాకి శైలేంద్ర ట్రైనింగ్!

రంగా ని ఎంక్వయిరీ చేసిన శైలేంద్ర అతను రిషి కాదని రంగా అని కన్ఫామ్ చేసుకుంటాడు. అదే విషయం దేవయానికి చెప్తాడు శైలేంద్ర. అయితే మనం రంగా ని ఉపయోగించుకోవచ్చు అని కొడుక్కి ఒక సలహా ఇస్తుంది దేవయాని. వసుధార తన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. సెంటిమెంట్ గా ఫీల్ అయిన వసుధార రిషికి ఏమైనా అవుతుందేమో అని కంగారు పడుతుంది. రంగా నీకిమ్మన్నాడని ఒక గిఫ్ట్ వసుధార చేతిలో పెడుతుంది రాధమ్మ. రిషి గా నటించడానికి ఒప్పుకున్న రంగా శైలేంద్రతో పాటు వెళ్తాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 28వ తేదీ ఎపిసోడ్ 1,139ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

రిషి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది వసుధార. అందులో రిషి కి తను గిఫ్ట్ గా ఇచ్చిన వస్తువులన్నీ ఉండడం చూసి ఆనంద పడిపోతుంది . మీరే నా రిషి సార్ అని నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేకపోయాను ఇన్నాళ్ళకి నా నిరీక్షణ ఫలించింది అనుకుంటూ బాగా ఎమోషనల్ అవుతుంది.రిషి సర్ ఏరి, ఎక్కడ ఉన్నారు అని అనుకుంటుంది. అదే సమయంలో రిషి జగతి ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతాడు. నేనే రిషి ని అని వసుధారకి ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది.

Guppedanta Manasu July 29th 2024 Episode number 1139 Here is the Full story

నేను ఎక్కడ ఉన్నానో అనుకుంటుంది. మొదటిసారిగా నువ్వు నా మనసులో ఉన్నావని నాకు తెలియజేసిన దేవత ముందు ఉన్నాను వసుధార అని తల్లి ఫోటో చూస్తూ అనుకుంటాడు రిషి. అదే సమయంలో మీరు రంగాగా ఎందుకు నటిస్తున్నారు అని అనుకుంటుంది వసుధార. కొన్ని అనివార్య కారణాల వలన రంగాగా మారవలసి వచ్చింది త్వరలోనే ఆ విషయాన్ని నీకు తెలుస్తాయి మనసులో అనుకుంటాడు రంగా. రిషిగా నేను చేయలేని పనులు రంగా గా చేయాలి అనుకుంటాడు.

అంతలోనే అక్కడికి వచ్చిన శైలేంద్ర జగతి ఫోటో చూపిస్తూ ఈవిడే రిషి వాళ్ళ అమ్మ అంటాడు. ఆ మాటలకి ఎమోషనల్ అవుతాడు రిషి. నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావు అంటాడు శైలేంద్ర. నాకు మా అమ్మ గుర్తొచ్చింది సార్ అంటాడు రిషి. రిషి ఎప్పుడు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవలేదు మేడం అనే పిలిచేవాడు కానీ ఆఖరిలో తల్లి ప్రేమను అర్థం చేసుకుని అమ్మ అని పిలిచాడు అని చెప్తాడు శైలేంద్ర.

ఆ తర్వాత శైలేంద్ర రంగా తో రిషి లా వాక్ చేసి చూపించమని చెప్తాడు. అచ్చు రిషి లాగే వాక్ చేసిన రంగా వాకింగ్ స్టైల్ చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. రిషిగా నా పెర్ఫార్మెన్స్ బాగుందా అని అడుగుతాడు రంగా. రిషికే ఈ బట్టలు వేసినట్లు ఉంది అచ్చు రిషి లాగే ఉన్నావు, రేపు గవర్నమెంట్ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకునే టైంకి వచ్చి నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి ఆలోచించి నిర్ణయం చెప్తాను అని చెప్పు అంటాడు శైలేంద్ర.

Guppedanta Manasu July 29th 2024 Episode number 1139 Here is the Full story

సరే మరి అక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు నాకు తెలియదు కదా అంటాడు రంగా. పేర్లు మాత్రమే చెబుతున్న శైలేంద్రతో అలా చెప్తే నాకు ఏం అర్థం అవుతుంది అంటాడు రాంగా సరే నాతో రా అని తీసుకువెళ్తాడు శైలేంద్ర. మరోవైపు వసుధార తన ఉంగరం కోసం కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే బుజ్జి వచ్చి రంగా అన్న ఈ ఉంగరం మీకు ఇమ్మన్నాడు అంటూ రిషి ఇచ్చిన ఉంగరం వసుధారకి ఇస్తాడు.

ఆ ఉంగరం చూసి మరింత ఆనంద పడిపోతుంది వసుధార తర్వాత రంగా అన్న ఈ ఫోటో చూపించమన్నాడు అంటూ శైలేంద్ర రిషి ఉన్న ఫోటోని చూపిస్తాడు బుజ్జి. ఆ ఫోటో చూసి షాక్ అవుతుంది వసుధార ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు, అసలు రిషి సార్ ఏరి అని అడుగుతుంది వసుధార. ఆయనే సరోజ అని చూడటానికి వచ్చిన పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య, రంగా అన్న అతనితో వెళ్ళాడు, అతను రంగానికి 10 లక్షలు ఇచ్చాడు అని జరిగిందంతా చెప్తాడు బుజ్జి.

నాకు చెప్పమని ఏమైనా చెప్పారా అంటుంది వసుధార. ఈ ఉంగరం తనకి ఇవ్వు అన్నీ తనకే అర్థమవుతాయి అన్నాడు అని చెప్తాడు బుజ్జి. ఏం చేయాలో నాకు అర్థమైంది నువ్వు వెళ్ళు అంటుంది వసుధార. ఏం చేయబోతున్నారు మేడం అంటాడు బుజ్జి. నీకే తెలుస్తుందిలే అంటుంది వసుధార. మరోవైపు శైలేంద్ర తన కుటుంబ సభ్యుల ఫోటోలు చూపిస్తూ ఒక్కొక్కరిని రంగాకి పరిచయం చేస్తూ ఉంటాడు తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X