Guppedanta Manasu, July 2nd episode: అవమానంతో రగిలిపోతున్న శైలేంద్ర.. సరోజని రెచ్చగొడుతున్న రంగా అసిస్టెంట్!
రంగా ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది సరోజ. ఆ ప్రపోజల్ ని సున్నితంగా తిరస్కరిస్తాడు రంగా. ఆయన నిన్ను పెళ్లి చేసుకోరు ఎందుకంటే ఆయనకి ముందే పెళ్లయింది ఆయన నా రిషి సార్ అంటుంది వసుధార. మరోవైపు శైలేంద్ర మను పై మర్డర్ ఎటాక్ చేయిస్తాడు తప్పించుకొచ్చిన మను శైలేంద్ర కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 2వ తేదీ ఎపిసోడ్ 1,116 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
తనకి బట్టలు కొనమని రంగాని అడుగుతుంది వసుధార, సరోజ బట్టలు ఉన్నాయి కదా అంటాడు రంగా. అవి నాకు కంఫర్ట్ గా లేవు అయినా అన్ని రోజులూ తన బట్టలే వేసుకోలేము కదా, అయినా అమ్మాయిలు వేటినైనా షేర్ చేసుకుంటారు కానీ బట్టలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు అంటుంది వసుధార. మా అన్నకి ప్యాంట్లు షర్ట్లు తప్పితే ఆడవాళ్ళ బట్టల గురించి పెద్దగా తెలియదు అంటాడు రంగా అసిస్టెంట్. అతడిని వారించి బట్టలు తీసుకువద్దాం లే అంటాడు రంగా.

సరే అయితే డబ్బులు ఇవ్వండి అని వసుధారని అడుగుతాడు రంగా అసిస్టెంట్. మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనం డబ్బులు అడగకూడదని చెప్పి అసిస్టెంట్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగా. ఆ తర్వాత వసుధార, రాధమ్మ కబుర్లు చెప్పుకుంటూ పనిచేసుకుంటూ ఉండగా అక్కడికి సరోజ వస్తుంది. బావ ఏడి అని అడుగుతుంది. బట్టలు కొనడానికి వెళ్ళాడు అంటుంది రాధమ్మ. ఎవరికి అని అడుగుతుంది సరోజ. నాకోసమే అంటుంది వసుధార.మా బావ నీకు బట్టలు కొనడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది సరోజ.

నాకు వేసుకోవడానికి బట్టలు లేవు అందుకే తీసుకురావడానికి వెళ్లారు అంటుంది వసుధార. మా బావని పంపించడానికి నువ్వు ఎవరు అంటూ కోప్పడుతుంది సరోజ. నా భర్త అంటుంది వసుధార. ఇంక చాలు ఆపు ఎప్పుడూ అదే మాట అని కోప్పడుతుంది సరోజ. ఇద్దరినీ గొడవ పడొద్దు అని వారిస్తుంది రాధమ్మ. అయినా నిన్ను కాదు మా బావని అనాలి రానీ చెప్తాను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సరోజ. మరోవైపు మను చేసిన అవమానానికి కోపంతో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర. వాడు నాకు ముచ్చమటలు పట్టించాడు.

వాడి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటాను అంటాడు. వాడి పాపాన వాడే పోతాడు వదిలేయ్ అంటుంది దేవయాని. అలా అంటావేంటి వాడు నా చేత లెంపలు వేయించుకునేలాగా చేశాడు వాడికి భయం అంటే ఏంటో రుచి చూపిస్తాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయను అంటాడు శైలేంద్ర. నీకంటే నాకు పదింతలు ఎక్కువగా వాడి మీద పగ తీర్చుకోవాలని ఉంది కానీ మీ నాన్న కోసమే ఆగుతున్నాను అంటుంది దేవయాని.
అయితే చేతులు ముడుచుకొని కూర్చోమంటావా అంటాడు శైలేంద్ర. కాదు సమయం వచ్చే వరకు వెయిట్ చేయమంటాను, మనకి కావలసింది ఎండి సీటు దానిని ఎలా చేజిక్కించుకోవాలో ఆలోచించు అని కొడుక్కి నచ్చ చెప్తుంది దేవయాని. మరోవైపు రంగా కోసం కోపంగా ఎదురు చూస్తూ ఉంటుంది సరోజ అప్పుడే రంగా బట్టలు తీసుకుని రావడంతో ఆవిడ కోసం నువ్వెందుకు బట్టలు తీసుకురావాలి అని రంగాపై కోప్పడుతుంది సరోజ.
అలా మాట్లాడతావేంటి అంటూ సరోజినీ మెల్లగా మందలించి వసుధార ని పిలిచి బట్టలు ఇస్తాడు రంగా. సరోజని ఉడికించాలని రంగా అసిస్టెంట్ రంగా మేడం గారి కోసం ఎన్ని షాపులు తిరిగాడో తెలుసా, బేరమాడకుండా బట్టలు కొని తీసుకువచ్చాడు అని సరోజని రెచ్చగొడతాడు. సరోజ ఉడుక్కుంటూ నాకు కూడా బట్టలు తీసుకురా అని అడుగుతుంది. నీకు ఉన్నాయి కదా అంటాడు రంగా. మరోవైపు రాధమ్మ బట్టలు తీసుకురావడానికి డబ్బులు ఎక్కడివి అని అడుగుతుంది.

అప్పు చేసి తీసుకు వచ్చాను అంటాడు రంగా. తనకి తీసుకొచ్చావు కదా నాకు కూడా అలాగే బట్టలు తీసుకురా అంటుంది సరోజ. తీసుకురాను అని చెప్పి వెళ్ళిపోతాడు రంగా. ఆ తర్వాత ఇంటిదగ్గర తండ్రికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది సరోజ. నువ్వు తిన్నావా అని అడుగుతాడు తండ్రి. అవన్నీ నీకెందుకు నువ్వు ఇలాంటివి పట్టించుకోవు కదా అంటుంది సరోజ ఏమైంది అంటాడు సంజీవయ్య.
బావ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటుంది సరోజ. అలాంటి వాడిని నువ్వు ఎందుకు ఇష్టపడాలి, నీకు అంతకన్నా మంచి సంబంధం తీసుకు వస్తాను అంటాడు సంజీవయ్య. కానీ బావ లాంటి మంచి గుణం ఉన్నవాడిని తీసుకురాలేవు అని బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సరోజ. మరోవైపు బట్టలు మడత పెట్టుకుంటున్న రంగా దగ్గరికి వచ్చిన వసుధార మీకు ఉన్నవి ఈ బట్టలేనా అని అడుగుతుంది. అవును రోజుకు నాలుగు జతలు వేసుకోను కదా రోజుకు ఒకటే జత అంటాడు రంగా.
అది చూసి బాధపడిన వసుధార ఎందుకు సార్ ఇదంతా, మీరు ఎలా ఉండేవారు ఎలా ఉంటున్నారు అని అడుగుతుంది. మీరేం మాట్లాడుతున్నారు మేడం, మీ కలలో నేను ఎలా ఉండేవాడిని అని అడుగుతాడు రంగా. దర్జాగా సూటు బూటు వేసుకొని జేబులో చేతులు పెట్టుకొని నడుస్తూ ఉంటే అలాగే చూడాలనిపించేది, మీ వాకింగ్ స్టైల్ చాలా బాగుండేది ఇప్పుడు కూడా మిమ్మల్ని అలాగే చూడాలనిపిస్తుంది అంటుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











