Guppedanta Manasu, July 31th episode: వసుధారకి సూపర్ ట్విస్ట్ ఇచ్చిన రిషి.. కొడుకు ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న
రంగా నీకిమ్మన్నాడని ఒక గిఫ్ట్ వసుధార చేతిలో పెడుతుంది రాధమ్మ. రిషి గా నటించడానికి ఒప్పుకున్న రంగా శైలేంద్రతో పాటు వెళ్తాడు. రంగా ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసిన వసుధార కి రంగాయే రిషి అన్న క్లారిటీ వస్తుంది. రంగా కి రిషి గా ట్రైనింగ్ ఇస్తాడు శైలంద్ర. రిషి, వసుధార లు మహేంద్ర ఇంట్లో కలుసుకుని ఎమోషనల్ అవుతారు ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 31వ తేదీ ఎపిసోడ్ 1,141ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నన్ను మాటలు అనేముందు మీరు ఎంత బాధ పడ్డారో నాకు తెలుసు దాని కోసం మీరేమి బాధపడకండి అంటుంది వసుధార. మీరు కనిపించకుండా పోయేసరికి మీ ఆరోగ్యం సరిగ్గా లేదు మీ ఆరోగ్యం బాగా అయిన తర్వాత కూడా ఎందుకు మా దగ్గరికి రాలేదు ఎందుకు కాలేజీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేదు, మీకోసం బాధపడుతున్న వాళ్లని చూడాలనిపించలేదా అని అడుగుతుంది వసుధార.

విధి ఆడిస్తున్న నాటకంలో నేను నటుడిని అయిపోయాను కానీ మీకు ఎప్పుడూ నేను దూరం కాలేదు, కాలేజీని నువ్వు రక్షిస్తావని నమ్మకం నాకు ఎప్పుడూ ఉంది అలాగే రక్షించావు కూడా అంటాడు రిషి. మీరు రంగా గా ఎందుకు నటిస్తున్నారు అని అడుగుతుంది వసుధార. రిషి సరైన సమాధానం చెప్పకపోవడంతో మీరు దాపరికాలు లేని బంధాలని మీరు ఆశిస్తారు కదా అలాంటిది నా దగ్గర ఎందుకు దాస్తున్నారు అని అడుగుతుంది వసుధార.
నేను ఏ పని చేసినా మన మంచి కోసమే చేస్తాను అలా అని ఎందుకు నటించవలసి వచ్చిందో ముందు ముందు నీకే తెలుస్తుంది అంటాడు రిషి. మీ అన్నయ్య శైలేంద్ర దగ్గర ఎందుకు రంగా గా నటిస్తున్నారు, అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరో తెలుసా అని అడుగుతుంది వసుధార. తెలుసు అంటాడు రిషి. షాక్ అవుతుంది వసుధార, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు అనుకోకుండా వచ్చి నేను నిన్ను కాపాడాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టే నేను వచ్చి కాపాడాను అంటాడు రిషి.

అప్పుడు కాలేజీని రచించడానికి నువ్వు ఉన్నావని ధైర్యంతో రాలేదు ఇప్పుడు కాలేజీ చేజారి పోయే పరిస్థితి వచ్చింది అందుకే వచ్చాను అంటాడు రిషి. మావయ్య మీకోసం బాధపడుతూ జీవచ్ఛవంలా మారిపోయారు అంటుంది వసుధార ఆయనని దూరం నుంచి చూసాను రేపటితో ఆయనకి ఆ బాధ ఉండదు మనిద్దరం కలిసి కాలేజీ ని కాపాడుకుందాం అంటూ రేపు ఏం చేయాలో వసుధారకి చెప్తాడు రిషి.
మరోవైపు కాలేజీ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటే అక్కడికి రిషి వస్తాడు, అందరూ షాక్ అవుతారు, కాలేజీ భూషణ్ ఫ్యామిలీ సొంతం, మీరు ఎలా హ్యాండ్ ఓవర్
చేసుకుంటారు అని మినిస్టర్ ని అడుగుతాడు రిషి. కాలేజీని సమర్థవంతంగా నడిపించగల వాళ్లు మీ ఫ్యామిలీలో ఎవరూ లేరు అంటాడు మినిస్టర్. మా అన్నయ్య శైలేంద్ర ఉన్నాడు కదా అతడిని ఎండి చేయండి అంటాడు రిషి. ఆ మాటలకిమహేంద్ర ఆశ్చర్యపోతాడు.

మినిస్టర్ శైలేంద్ర ని కాలేజీకి ఎండిగా ప్రకటిస్తాడు. దేవయాని, శైలేంద్ర చాలా ఆనందపడతారు. కాలేజీకి ఎండిని అంటూ కేకలు వేస్తున్న శైలేంద్రని లేపుతుంది ధరణి. నిద్రలోంచి లేచిన శైలేంద్ర కి తాను కలగన్నాను అనే విషయం అర్థమవుతుంది. నిన్నటి వరకు కాలేజీ చేజారిపోతుందని బాధపడిన మీరు ఈరోజు ఎండి అయిపోతాను అని ఎలా అనుకుంటున్నారు అని అనుమానంగా అడుగుతుంది. మనిషికి ఆశ అనేది ఉంటుంది కదా అంటాడు శైలేంద్ర.
మీ ఆశ సంగతి ఎలా ఉన్నా మీరు ఎండి అయినా కాకపోయినా కాలేజీ చేజారి పోకుండా ఉంటే బాగున్ను అంటుంది ధరణి. కాలేజీకి వెళ్దామన్నారు కదా రెడీ అవ్వండి అని కాఫీ తీసుకురావడానికి వెళుతుంది. మరోవైపు కాలేజీలో బోర్డు మెంబర్స్ అందరూ మీటింగ్లో ఉంటారు.మీరు ఈ ఫైల్ మీద సంతకాలు చేసేస్తే పని పూర్తయిపోతుంది అంతకు ముందుగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని ఫణీంద్ర ని అడుగుతాడు మినిస్టర్. మాట్లాడటానికి ఏమీ లేదు, మా నాన్నగారి కోరికని తీర్చలేకపోయాము.

మేము కొడుకులుగా ఫెయిల్ అయ్యాము ఇక ఇందులో చెప్పడానికి ఏమీ లేదు సంతకాలు పెట్టేయడమే అంటాడు ఫణీంద్ర. కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది కానీ కాలేజీని సమర్థవంతంగా నడిపించే వాళ్ళు లేకపోవడం, ఉన్నవాళ్లు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది, ఇలా జరుగుతున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను అంటాడు. మినిస్టర్ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











