Guppedanta Manasu, July 3rd episode: రంగా మారిపోయాడంటున్న బుజ్జి.. కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్న వసుధార!

రంగా ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది సరోజ. ఆ ప్రపోజల్ ని సున్నితంగా తిరస్కరిస్తాడు రంగా. ఆయన నిన్ను పెళ్లి చేసుకోరు ఎందుకంటే ఆయనకి ముందే పెళ్లయింది ఆయన నా రిషి సార్ అంటుంది వసుధార. మరోవైపు శైలేంద్ర మను పై మర్డర్ ఎటాక్ చేయిస్తాడు తప్పించుకొచ్చిన మను శైలేంద్ర కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు వసుధార రంగా ని బట్టలు కొని తీసుకు రమ్మంటుంది, బట్టలు తీసుకొచ్చిన రంగాపై కోప్పడుతుంది సరోజ. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 3వ తేదీ ఎపిసోడ్ 1,117 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

మీ కలలో నేను ఎలా ఉండేవాడిని అంటాడు రంగా. సూటు బూటు వేసుకొని జేబులో చేతులు పెట్టుకొని అలా నడుస్తూ ఉంటే మిమ్మల్ని చూస్తూ ఉండాలని ఉండేది. మీ స్మైల్, మీ ఆటిట్యూడ్ ఎంతో బాగుండేది ఇప్పుడు కూడా మిమ్మల్ని అలాగే చూడాలనిపిస్తుంది అంటుంది వసుధార. మీ కలలో అలా కనిపించాను అంటాడు రంగా. కలలో ఏంటి సార్ మీరు నిజంగానే అలా ఉండేవారు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారో తెలియటం లేదు అంటుంది వసుధార. మీరు మళ్ళీ ఆ టాపిక్ తీసుకురావద్దు అంటాడు రిషి.

Guppedanta Manasu July 3rd 2024 Episode number 1117 Here is the Full story

మీరు నిజంగా రిషి సార్ కాకపోతే నాకు నచ్చిన బట్టలు ఎలా తీసుకువస్తారు, కనీసం మెజర్మెంట్స్ కూడా తీసుకు వెళ్ళలేదు అంటుంది వసుధార . అది పెద్ద విషయం ఏమీ కాదు అమ్మాయిలు ఎక్కువగా పింక్ ఇష్టపడతారు కాబట్టి ఆ కలర్స్లో తీసుకువచ్చాను అయినా మిమ్మల్ని డబ్బులు అడుగుతానని టాపిక్ మారుస్తున్నారు కదా అంటాడు రంగా. నాకు పని చూడండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని రోషంగా అంటుంది వసుధార. నేను మిమ్మల్ని డబ్బులు అడగలేదు కదా, అయినా చదువు లేని వాడిని నేనేం పని చూపిస్తాను మీకు అంటాడు రంగా.

మీరు అలా అంటారు కానీ చూపిస్తారు నాకు తెలుసు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. నెక్స్ట్ సీన్ లో బామ్మ కి పనిలో హెల్ప్ చేస్తున్న వసుధార దగ్గరికి వచ్చి మీకు పని చూశాను అంటాడు రంగా. ఏం పని అంటూ తనకి తెలిసిన రెండు పనుల గురించి చెప్తుంది పసుధార అవేవీ కాదు మీరు బాగా చదువుకున్నారు కదా అందుకే చదువు చెప్పే పని చూశాను. స్కూల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంట మీరు రెడీ అయి వస్తే తీసుకువెళ్తాను, ఇద్దరమూ వెళ్ళి మాట్లాడదాము అంటాడు రంగా. రాధమ్మ కూడా వసుధారని వెళ్ళమని చెప్తుంది.

Guppedanta Manasu July 3rd 2024 Episode number 1117 Here is the Full story

రెండు నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది వసుధార. రంగా వాళ్ళు బయట ఆటోలో కూర్చొని వసుధార కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సరోజ టిఫిన్ తీసుకుని వస్తుంది. ఆ టిఫిన్ ముందు తినాలనుకుంటాడు రంగా, అతని అసిస్టెంట్ బుజ్జి క్యారియర్ కూడా ఓపెన్ చేస్తాడు కానీ అంతలోనే వసుధార రావటం చూసి ఇప్పుడు తినటం కుదరదు అట్నుంచి వచ్చి తింటాను అని చెప్పి బుజ్జి ని ఆటో దింపేసి వసుధార ని తీసుకొని వెళ్ళిపోతాడు రంగా.

రంగా బాగా మారిపోయాడు అంటాడు బుజ్జి. కోపంతో రగిలిపోతుంది సరోజ. తర్వాత ఆటోలో వెళ్తున్న వసుధారని చూసి మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది అంటూ అమ్మతో తనకున్న అనుబంధాన్ని గురించి చెప్తాడు రంగా. వసుధార జగతి మేడంని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతుంది. తన గురించే అనుకుంటాడు రంగా. మీరేమీ ఆలోచించకండి ఈ బాధ అంతా నాకు అలవాటే.

Guppedanta Manasu July 3rd 2024 Episode number 1117 Here is the Full story

నేను మామూలుగా నా ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోను కానీ మీతో చెప్పుకోవాలనిపించింది అంటాడు. అంతలో స్కూల్ వస్తుంది. ఆటో దిగి ఇద్దరూ లోపలికి వెళ్తుంటే స్కూల్ ని ఎమోషనల్ గా చూస్తుంది పసుధార. ఏంటి మేడం గారు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయా, ఏమైనా స్కూల్ డేసే వేరు అంటాడు రంగా. కానీ నాకు మాత్రం కాలేజీ డేసే ముఖ్యమైనవి అక్కడే జీవితంలో ముఖ్యమైన మనిషిని కలిసాను అంటుంది వసుధార.

తర్వాత రంగా వసుధారని తీసుకొని హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. అతను వసుధార క్వాలిఫికేషన్స్ తెలుసుకొని ఆనందపడతాడు, మామూలుగా మా స్కూల్లో చేర్చుకోవడానికి ఫార్మాలిటీస్ ఉంటాయి కానీ రంగా చెప్పాడు కాబట్టి నిన్ను నేరుగా తీసుకుంటున్నాము నీ సర్టిఫికెట్స్ ఏవి అని అడుగుతాడు హెడ్మాస్టర్. సర్టిఫికెట్స్ తన దగ్గర లేకపోవడంతో తడబడుతుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X