Guppedanta Manasu July 4th episode: వసుధారకు గుడ్ న్యూస్.. అసలు విషయం చెప్పిన రంగా!

శైలేంద్ర మను పై మర్డర్ ఎటాక్ చేయిస్తాడు తప్పించుకొచ్చిన మను శైలేంద్ర కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు వసుధార రంగా ని బట్టలు కొని తీసుకు రమ్మంటుంది, బట్టలు తీసుకొచ్చిన రంగాపై కోప్పడుతుంది సరోజ. తరువాత వసుధారకే ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తాడు రంగా. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 4వ తేదీ ఎపిసోడ్ 1,118 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ప్రిన్సిపల్ వసుధారని సర్టిఫికెట్స్ అడుగుతాడు, ప్రస్తుతానికి లేవు నేను తర్వాత తీసుకు వస్తాను అంటాడు రంగా. కావాలంటే మేడంని మీరు టెస్ట్ చేయండి అంటాడు. సరే అని ప్రిన్సిపల్ వసు ధారని కొన్ని ఫార్ములాస్ రాయమంటాడు. ఆమె ఆ ఫార్ములాస్ ని తప్పుగా రాస్తుంది మీరు ఇంత చిన్న ఫార్ములాస్ కూడా తప్పుగా రాస్తే ఎలా అని వసుధారపై కోప్పడి ఆ ఫార్ములాస్ సరి చేస్తాడు రంగా. నేను తర్వాత మాట్లాడతాను అని వసుధారని, రంగాని పంపించేస్తాడు ప్రిన్సిపల్.

Guppedanta Manasu July 4th 2024 Episode number 1118 Here is the Full story

మరోవైపు మను వాళ్ళ ఇంటికి రావడాన్ని అనుమానిస్తాడు ఫణీంద్ర. వెంటనే కొడుకుని పిలిచి మను ఎందుకు వచ్చాడు అని అడుగుతాడు. క్యాజువల్ గానే వచ్చాడు అంటాడు శైలేంద్ర. కానీ మీ మాటలు నాకెందుకో క్యాజువల్ గా అనిపించలేదు నువ్వు కాలేజీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నావా అని అడుగుతాడు ఫణీంద్ర. అలాంటిదేమీ లేదు అంటాడు శైలేంద్ర. ప్రతి విషయానికి మన అబ్బాయిని అనుమానిస్తారేంటి అని భర్తని కోప్పడుతుంది దేవయాని.

వాడు చేసే పనులు అలా ఉన్నాయి, ఇప్పుడే చెప్తున్నాను వాడికి వాడుగా కాలేజీ ఎండి అయితే నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఎండి మను అయితే మాత్రం అందులో నా బాధ్యత ఏమి లేదు అదంతా మను కృషి మాత్రమే అని చెప్పి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. ఆ మాటలకి ఫ్రస్టేట్ అయిన ఫణీంద్ర. అసలు ఆ మను అనే వాడే లేకపోతే నేనే ఎండి ని అయ్యే వాడిని, వాడు ఉండడం వల్లే నేను ఆప్షన్ గా మిగిలిపోయాను అంటాడు.

నువ్వు ఏం డి అవ్వడానికి ఒక ప్లాన్ వేసాను అంటుంది దేవయాని. ఏంటది అంటాడు శైలేంద్ర. మన దగ్గర లెటర్ ఉంది కదా దానిని ఆయుధంగా వాడదాం అంటుంది దేవయాని. కానీ అది మను నమ్మటం లేదు కదా, మనం ఇంకా మాట్లాడితే ఆ లెటర్ మనమే రాసి పెట్టాము అంటాడు మను అని చెప్తాడు శైలేంద్ర. అందుకే మనం అనుపమ కి ఈ లెటర్ చూపిద్దాము అంటుంది దేవయాని.

Guppedanta Manasu July 4th 2024 Episode number 1118 Here is the Full story

వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి ధరణి వస్తుంది మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్ చేశారా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు అంటుంది దేవయాని. పదవి మీద మీకు ఎందుకు అంత ఆకాంక్ష అసలు మీ వల్లే ఆయన అలా తయారయ్యారు, అసలు మీరు తల్లిగా నడుచుకుంటున్నారా.. ఈ కుట్రలు, కుతంత్రాల వల్ల మీరు చెడ్డ పేరు తప్పితే మరేమి సాధించలేరు, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి.

మరోవైపు రంగా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడని కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది సరోజ. అది గమనించిన బుజ్జి కాలు నేలమీద నిలబడనంటుందా అని అడుగుతాడు. అవును ఆ వసుధార ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తను వచ్చిన దగ్గరనుంచి నాలో కంగారు మొదలైంది, బావని తనతోపాటు తీసుకెళ్లి పోతానని నాతోనే చాలెంజ్ చేసింది అంటుంది సరోజ. అవును నిజంగానే బాస్ ఆమె అడగగానే బట్టలు కొనిచ్చాడు..

ఇప్పుడు వాళ్ళిద్దరే బయటికి వెళ్లారు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మన రంగాని రిషి సర్ గా మార్చేస్తుందేమో అంటాడు బుజ్జి. నువ్వు నన్ను మరీ కంగారు పెట్టకు అయినా ఆ వసుధార అలా చేసినా చేస్తుంది పదా మనం వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని బుజ్జిని తీసుకొని స్కూల్ కి వెళుతుంది సరోజ. అప్పుడే అక్కడ వసుధార రిషి తో మాట్లాడుతూ మీరు ఎందుకు రంగలాగా నటిస్తున్నారు అని అడుగుతుంది. మీరు మళ్ళీ ఆ టాపిక్కే తీసుకొస్తున్నారా అంటాడు రంగా.

Guppedanta Manasu July 4th 2024 Episode number 1118 Here is the Full story

మీరు రిషి సార్ కాకపోతే ఆ ఫార్ములాస్ ఎలా రాశారు అని అడుగుతుంది వసుధార. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువు అది అని చెప్తాడు రంగా. నేను ఏం మాట్లాడినా మీరు ఇలాంటి సమాధానమే ఇస్తారని అర్థమైంది అంటుంది వసుధార. నేను నిజంగా రంగా నే కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి అంటాడు రంగా. మీరు నాకు కోపం తెప్పిస్తున్నారు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోబోతున్న వసుధార పడిపోబోతుంది.

ఆమెని పట్టుకుంటాడు రంగా ఇదంతా పక్క నుంచి చూస్తున్న సరోజ రగిలిపోతుంది వెళ్లి వాళ్ళిద్దర్నీ నిలదీయాలి అనుకుంటుంది. కానీ బుజ్జి వారిస్తాడు, ఇప్పుడు నువ్వు వెళ్లి అడిగితే నీకు ఎలాగో నిజం తెలిసిపోయింది కాబట్టి అన్న నిన్ను మరింత నిర్లక్ష్యం చేస్తాడు అంటాడు. అప్పుడే రంగా కోపంగా వెళ్ళిపోతున్న వసుధారని పొగరు అంటాడు. అవును నాకు పొగరే అంటూ అక్కడి వెళ్ళిపోతుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X