Guppedanta Manasu July 5th episode: మనుని ఘోరంగా అవమానించిన దేవయాని.. వసుధారని ఇంట్లోంచి బయటికి పొమ్మన్న సరోజ!

మరోవైపు శైలేంద్ర మను పై మర్డర్ ఎటాక్ చేయిస్తాడు తప్పించుకొచ్చిన మను శైలేంద్ర కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు వసుధార రంగా ని బట్టలు కొని తీసుకు రమ్మంటుంది, బట్టలు తీసుకొచ్చిన రంగాపై కోప్పడుతుంది సరోజ. తరువాత వసుధార కి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తాడు రంగా. మరోవైపు తన దగ్గర ఉన్న లెటర్ తో అనుపమని ఇబ్బంది పెట్టాలని ప్లాన్ వేస్తారు దేవయాని శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 5వ తేదీ ఎపిసోడ్ 1,119 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

మీరు రంగా గా ఎందుకు నటిస్తున్నారు, మీరే రిషి సార్ అని నేను మీ నోటితోనే చెప్పిస్తాను అంటుంది వసుధార. పొగరు అంటాడు రంగా. నాకు పొగరుని తెలుసు కదా మరి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అంటుంది వసుధార. నేనేదో మామూలుగా అన్నాను అంటాడు రంగా. మీరు మామూలుగానే అన్నారో, అలవాటుగానే అన్నారో ముందు ముందు తెలుస్తుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఇదంతా చూస్తున్న సరోజ కోపంతో రగిలిపోతుంది.

Guppedanta Manasu July 5th 2024 Episode number 1119 Here is the Full story

నిన్ను వద్దనుకుంటున్న రాంగా ని ఎందుకు, నన్ను చేసుకోవచ్చు కదా అంటాడు బుజ్జి. వాడిని చితకబాదుతుంది సరోజ. మరోవైపు మను, ఏంజెల్ ఇద్దరూ వసుధార ఎక్కడికి వెళ్లిపోయిందో అని కాలేజీ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి కొడుకుతో సహా వచ్చిన దేవయాని ఈ కాలేజీ ప్రేమికులకు అడ్డా అయిపోయింది, కొన్ని ప్రేమ పక్షులు ఇక్కడ కూర్చొని కబుర్లాడుకుంటున్నాయి అంటుంది. మాటలు మర్యాదగా రానివ్వండి అంటాడు మను.

తండ్రి ఎవరో తెలియని నీకు మర్యాద ఇచ్చేది ఏంటి, నువ్వు కూడా మీ తల్లిలాగే పెళ్ళికి ముందే కాపురం పెట్టేస్తావా ఏంటి అని అసహ్యంగా మాట్లాడుతుంది దేవయాని. ఇదంతా నేను మా అత్తతో చెప్తాను తనే మీకు సరైన బుద్ధి చెబుతుంది అంటుంది ఏంజెల్. చెప్తే చెప్పుకో నాకేమైనా భయమా అయినా నువ్వు మీ బావ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు, మీ అత్తయ్య ఎవరి చేతిలోనో మోసపోయినట్లు మీ బావ కూడా నిన్ను మోసం చేస్తాడు ఎందుకంటే తండ్రి రక్తం అతనిలోనూ ప్రవహిస్తుంది కదా అంటుంది దేవయాని.

Guppedanta Manasu July 5th 2024 Episode number 1119 Here is the Full story

ఆమె మీద కోప్పడి మను ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏంజెల్. శైలేంద్ర, దేవయాని ఇద్దరు నవ్వుకుంటారు. మరోవైపు కాలేజీలో జరిగిందంతా రాధమ్మకి చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది సరోజ. వసుధార వచ్చిన తర్వాత బావలో బాగా మార్పు వచ్చింది, వసుధార నా భర్త నా భర్త అంటుంది, మరెందుకు బావ పేరుని రిషి సార్ అని మార్చేసి వాళ్ళిద్దరూ కలిసి ఒక ఫోటో తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది, బయటి వాళ్లకి కూడా ఏమి సమాధానం చెప్పక్కర్లేదు అంటుంది.

అప్పుడే అక్కడికి వచ్చిన రంగా ఏం మాట్లాడుతున్నావ్ అంటూ సరోజ పై కోప్పడతాడు. అసలు నువ్వెందుకు తనమీద అంత ప్రేమ ఒలకబోస్తున్నావు అని రంగాని నిలదీస్తుంది సరోజ. తను మన ఇంటి అతిధి అంటాడు రంగా. అతిధి అతిధి లాగా ఉండటం లేదు అయినా తనకి బాగైపోయింది కదా పంపించేయచ్చు కదా అని రంగాతో చెప్తూ వసుధారని ఇంట్లోంచి బయటికి పో అంటుంది సరోజ. అతిథితో అలాగేనా మాట్లాడటం అని సరోజని కోప్పడతాడు రంగా.

Guppedanta Manasu July 5th 2024 Episode number 1119 Here is the Full story

వసుధార కూడా అతను నా భర్త అంటూ సరోజతో వాదనకి దిగుతుంది. వసుధారని అక్కడ నుంచి పంపించేసి సరోజ తో మాట్లాడుతాడు రంగా. తనని పంపించేయడం ఐదు నిమిషాలు పని కానీ తనని బయట చంపడం కోసం ఎవరో వెతుకుతున్నారు అందుకే కొద్ది రోజులు చూద్దాం లేదంటే అప్పుడే నేను గట్టిగా చెప్తాను అంటాడు రంగా. ఈ లోగా తను నిన్ను మార్చేసి నాకు కాకుండా చేస్తుందేమో అని భయంగా ఉంది అంటుంది సరోజ.

అసలు నేను నిన్ను చేసుకుంటానని ఎవరు చెప్పారు అంటాడు రంగా. అదేంటి చిన్నప్పటినుంచి అనుకున్నదే కదా అంటుంది సరోజ. కానీ నేను అనుకోలేదు అంటాడు రంగా.అదే విషయం రాధమ్మని అడుగుతుంది. నేనేం మాట్లాడుతాను అంటుంది రాధమ్మ. తర్వాత రంగా మాట్లాడుతూ మేడమ్ గారి విషయంలో నువ్వు ప్రతిసారి గొడవ చేయొద్దు అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగా.

Guppedanta Manasu July 5th 2024 Episode number 1119 Here is the Full story

తర్వాత సరోజ రాధమ్మ దగ్గరికి వెళ్లి బావ అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావేం మా పెళ్ళి జరగటం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. ఇష్టమే కానీ వాడిని కాదని అడుగు ముందుకు వేయలేను అయినా నువ్వు ఇలా తొందరపడితే వాడు నిజంగానే నీ అనుమానాలని నిజం చేస్తాడు, ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి,కాబోయే భర్తని చుట్టూ తిప్పుకోవాలి అంతేగాని ఇలా గొడవ చేస్తే నిజంగానే నిన్ను దూరం పెట్టేస్తాడు అంటుంది రాధమ్మ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X