Guppedanta Manasu July 8th episode: సీన్ ఎండింగ్ ఎప్పుడు? నిలదీసిన ధరణి.. సినిమా చూస్తేనే కాదా రివ్యూ అంటూ
వసుధార రంగా ని బట్టలు కొని తీసుకు రమ్మంటుంది, బట్టలు తీసుకొచ్చిన రంగాపై కోప్పడుతుంది సరోజ. తరువాత వసుధార కి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తాడు రంగా. మరోవైపు తన దగ్గర ఉన్న లెటర్ తో అనుపమని ఇబ్బంది పెట్టాలని ప్లాన్ వేస్తారు దేవయాని, శైలేంద్ర. తర్వాత కాలేజీకి వెళ్లి మనుని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతారు. ఈ విషయంపై మండిపడిన మహేంద్ర అనుపమను తీసుకొని ఫణీంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అనుపమ దేవయానికి చివాట్లు పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 8వ తేదీ ఎపిసోడ్ 1,121 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
పరిచయం లేని ఆడపిల్లని ఇంట్లో పెట్టుకున్నాడని దీనివల్ల ఊరికి చెడ్డ పేరు వస్తుందని పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి రంగా ఇంట్లో పంచాయతీ పెడతాడు సంజీవయ్య. అప్పుడే బయట నుంచి వచ్చిన రంగా ఏం జరిగింది అని అడుగుతాడు. పరిచయం లేని ఆడపిల్లని ఇంట్లో పెట్టుకున్నావని ఊర్లో వాళ్ళందరూ అడగడానికి వచ్చారు, నేను చూడడానికి వచ్చాను అంటాడు సంజీవయ్య.

వచ్చిన పెద్ద మనుషులు కూడా రంగా తో మాట్లాడుతూ నువ్వు ప్రేమించిన అమ్మాయో పెళ్లి చేసుకోబోయే అమ్మాయో అయితే నీ ఇంట్లో ఉన్న పర్వాలేదు కానీ ఇలా బయట అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏమిటి అంటారు. వాళ్ల మధ్య ఏమీ లేదు, బావ అలాంటి వాడు కాదు అని వెనకేసుకొస్తుంది సరోజ. అలాంటిది లేకపోవడమేమిటి వాళ్లని టీ కొట్టు దగ్గర చూశాను అని ఒక పెద్ద మనిషి అంటే ఊరంతా వాళ్ళే కనిపిస్తున్నారు అంటాడు సంజీవయ్య. మేడం గారికి ఊరు చూపిస్తున్నాను అంటాడు రంగా.
నిన్ను చూసి మరికొందరు అబ్బాయిలు ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏమిటి పరిస్థితి అంటారు పెద్ద మనుషులు. మీరు ఎవరి మాటలో నమ్మి నన్ను అనుమానించకండి, రాధమ్మ మనవడు రంగా ఎట్టి పరిస్థితుల్లోని తప్పు చేయడు ఆమె ప్రమాదంలో ఉంది, సమయం చూసుకొని నేనే పంపించేస్తాను అని మాటిస్తాడు రంగా. దాంతో వచ్చిన పెద్ద మనుషులు వెళ్లిపోతారు. మరోవైపు దేవయాని, శైలేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు.

బాబాయిని ఎలాగైనా ఇంటికి రప్పించాలమ్మ అంటాడు శైలేంద్ర. ఎందుకు అంటుంది దేవయాని. బాబాయి మన కళ్ళ ముందు ఉంటే తను ఏం చేయబోతున్నాడో మనకి తెలుస్తుంది అందుకే ఎలాగైనా తనని మన ఇంటికి రప్పించాలి అంటాడు శైలేంద్ర. నువ్వు అన్నట్లే జరుగుతుంది, బాబాయ్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఆ కాలేజీకి ఇకపై ఎండి వి నువ్వే అంటూ కొడుక్కి మాటిస్తుంది దేవయాని.
మరోవైపు రాధమ్మ రంగా తో మాట్లాడుతూ మనకెందుకు వచ్చిన సమస్యలు, గుట్టుగా బ్రతికే మనం ఈరోజు వీధిన పడ్డాము ఇదంతా మనకు అవసరమా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ అమ్మాయిని ఇంట్లోంచి పంపించేయ్ అంటుంది. సరోజ కూడా వసుధారని ఇంట్లోంచి పంపించేయమని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార ఎందుకు సార్? ఇంతమంది చేత మనం మాటలు పడాలి, మీరు ఇప్పటికైనా రంగా ని కాదు రిషి సార్ అని ఒప్పుకోండి అంటుంది. అసలు ఇదంతా నీ వల్లే అని వసుధారపై మండిపడుతుంది సరోజ.
ఎందుకు మేడం గారిని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడతావు అసలు మొదటినుంచి చూస్తున్నాను తనంటే నీకెందుకు అసూయ అని సరోజని కోప్పడతాడు రంగా. నీ వల్లే మా బావ నన్ను తిడుతున్నాడు మా బావని మార్చేసావంటే నువ్వు మామూలు దానివి కాదు అంటుంది సరోజ. ఇప్పటికైనా మీరు రిషి సార్ అని ఒప్పుకోండి ఇప్పుడు ఒప్పుకోకపోతే నేను చనిపోయిన తర్వాత ఒప్పుకుంటారా అని గట్టిగా మాట్లాడుతుంది పసుధార అలా మాట్లాడకండి నేను భరించలేను అంటాడు రంగా.

అలా మాట్లాడుతున్నావ్ ఏంటి బావ అసలు తన వల్లే మనకి ఈ సమస్య వచ్చింది అంటుంది సరోజ. మన అనకు ఇది మా సమస్య, మా సమస్యని మేము పరిష్కరించుకుంటాము ఇంకొకసారి మేడమ్ గారి విషయంలో కల్పించుకోవద్దు అని సరోజికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రంగా నువ్వు కల్పించుకోవద్దు అంటే నేను ఊరుకుంటానా ఎలాగైనా ఆ వసుధారని ఇక్కడి నుంచి పంపించే వరకు ఊరుకోను అనుకుంటుంది సరోజ.
మరోవైపు భోజనాలు చేస్తూ అక్కడ గొడవేమి జరగలేదు కదా అసలు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అని మహేంద్రతో అంటాడు మను. వెళ్లడమే మంచిదయింది మా అన్నయ్య వదినకి చివాట్లు పెట్టాడు అలాగే మను సమస్య కూడా త్వరగా పరిష్కరించుకోమని మాకు సూచించాడు అని చెప్తాడు మహేంద్ర. కానీ అత్తయ్య మను తండ్రి ఎవరో చెప్పడం లేదు అంటుంది ఏంజెల్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











