Guppedanta Manasu July 9th Episode: వసుధారని ఘోరంగా అవమానించిన సరోజ.. అనుపమని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆగంతకుడు

వసుధార కి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తాడు రంగా. మరోవైపు తన దగ్గర ఉన్న లెటర్ తో అనుపమని ఇబ్బంది పెట్టాలని ప్లాన్ వేస్తారు దేవయాని, శైలేంద్ర. తర్వాత కాలేజీకి వెళ్లి మనుని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతారు. ఈ విషయంపై మండిపడిన మహేంద్ర అనుపమను తీసుకొని ఫణీంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అనుపమ దేవయానికి చివాట్లు పెడుతుంది. పరాయి ఆడపిల్లని ఇంట్లో పెట్టుకున్నాడని రంగా ఇంట్లో పంచాయతీ పెడతాడు సరోజ తండ్రి. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 9వ తేదీ ఎపిసోడ్ 1,122 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

అన్నయ్య వదినని మందలించడంతో పాటు మాకు కూడా మను సమస్యని త్వరగా పరిష్కరించమని సూచించాడు అంటాడు మహేంద్ర. అత్తయ్య మనుకి తండ్రి ఎవరో చెప్పనంటుంది ఇక సమస్య ఏం పరిష్కారం అవుతుంది అంటుంది ఏంజెల్. చెప్పాలా వద్దా అనేది తన విజ్ఞతకే వదిలేద్దాం అంటాడు మహేంద్ర. అంతలోనే అనుపమకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది.

Guppedanta Manasu July 9th 2024 Episode number 1122 Here is the Full story

మీరు అనుపమ గారేనా అంటూ మాట్లాడటం మొదలుపెట్టిన ఆ వ్యక్తి మీరు మీ కొడుకుని తీసుకొని ఊరు వదిలి వెళ్లిపోండి లేదంటే మీ బిడ్డకి తండ్రి ఎవరో అందరికీ చెప్పేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ మాటలకి అనుపమ కంగారుపడి ఫోన్ పెట్టేస్తుంది. మహేంద్ర, మను ఇద్దరూ ఏమైనా సమస్యా అని అడుగుతారు. కానీ రాంగ్ నెంబర్ అని చెప్పి తప్పించుకుంటుంది అనుపమ.

మరోవైపు సరోజ రంగా వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. భోజనానికి వచ్చిన రంగా నువ్వు భోజనం చేసావా అని సరోజని అడుగుతాడు. తర్వాత తింటాను మీరు తినండి అంటుంది సరోజ మేడం గారు భోజనం చేశారా అని అడుగుతాడు రంగా. లేదు అంటుంది రాధమ్మ. తను తర్వాత తింటుందిలే ఇప్పుడు తినకపోతే కొంపలు ఏమి మునిగిపోవు అంటుంది సరోజ. సరోజని మందలించి వసుధారని భోజనానికి పిలుస్తాడు రంగా. ఆకలిగా లేదు తర్వాత తింటాను అంటుంది వసుధార.

ఆమెని బలవంతంగా భోజనానికి కూర్చోబెడతాడు రంగా. నేను తర్వాత తింటాను అంటే ఊరుకున్నాడు కానీ తను తర్వాత తింటాను అన్నా కూడా భోజనం చేయమని బలవంతం పెడుతున్నాడు తను ఎలా భోజనం చేస్తుందో నేను చూస్తాను అనుకుంటూ వసుధార ప్లేట్లో నీళ్లు పోస్తుంది సరోజ. ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు రంగా. అయ్యో పరధ్యానంలో పోసేసాను సారీ అంటుంది సరోజ.

Guppedanta Manasu July 9th 2024 Episode number 1122 Here is the Full story

నాకు కాదు మేడం గారికి సారీ చెప్పు అంటాడు రంగా.నేను ఎందుకు సారీ చెప్పాలి, నేను ఏమీ కావాలని పోయలేదు అంటుంది సరోజ. సరే తనకి వేరే ప్లేట్లో వడ్డించు అంటాడు రంగా. కావాలంటే తనే వడ్డించుకుంటుంది అడ్డమైన వాళ్ళకి చాకిరీ చేయవలసిన అవసరం నాకు లేదు అంటుంది సరోజ. వసుధార కోపంగా భోజనం దగ్గర జరిగిన అవమానం కంటే వేరే అవమానం ఉండదు నాకు ఆకలిగా లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె కోసం భోజనం తీసుకుని వెళ్తాడు రంగా.

ఇంత జరిగినా కూడా మీరు ఎందుకు ఇంకా రంగా లాగా నటిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు, బామ్మ గారు కూడా ఈ సమస్యని పరిష్కరించమంటున్నారు కదా అందుకే మీరు నాతో పాటు మా ఊరికి రండి అక్కడ మీరు రిషి సార్ అని రుజువు చేస్తాను అంటుంది వసుధార. వస్తాను కానీ నేను రిషి సార్ గా రాను రంగా గా వచ్చి మిమ్మల్ని దిగబెట్టి మళ్లీ వచ్చేస్తాను అంటాడు రంగా. ముందు అక్కడికి వస్తే అంతే చాలు అనుకున్న వసుధార అందుకు ఒప్పుకొని రంగా తెచ్చిన భోజనం తింటుంది.

తర్వాత ఒంటరిగా ఉన్న రంగా దగ్గరికి సరోజ వస్తుంది రంగా ద్వారా వసుధార రేపు వెళ్ళిపోతుందని తెలుసుకొని ఆనందపడుతుంది కానీ రంగాయే దిగబెట్టి వస్తాను అని చెప్పడంతో కొంచెం దిగులు పడుతుంది. నువ్వెందుకు తనే వెళుతుంది కదా అంటుంది సరోజ. కానీ ఆమెని ఒప్పిస్తాడు రంగా. ఏదైతేనేమి తను ఇక్కడనుంచి వెళ్ళిపోతుంది అంతే చాలు అని ఆనందపడుతుంది సరోజ. మరోవైపు అనుపమ కి మళ్ళీ ఆగంతకుడు ఫోన్ చేసి ఊరు వదిలి పొమ్మని హెచ్చరిస్తాడు.

Guppedanta Manasu July 9th 2024 Episode number 1122 Here is the Full story

ముందు అతని మాటలు పట్టించుకోదు అనుపమ కానీ నీ బిడ్డకి తండ్రి మహేంద్ర కదా ఇదే విషయం నేను అందరికీ చెప్తాను అని బెదిరించి ఫోన్ పెట్టేస్తాడు. అనుపమ ఇప్పుడు ఏం చేయటం అని కంగారు పడుతుంది. మరోవైపు సరోజ వసుధార దగ్గరికి వెళ్లి రేపు వెళ్ళిపోతున్నావంట కదా అంటుంది. వసుధార మాట్లాడుతూ ఎక్కువ ఆనంద పడకు ఆయన రిషి సార్ అని నిరూపించడానికి తీసుకు వెళుతున్నాను అంటుంది.

ఇప్పుడు దీంతో గొడవ పడితే ఏదో ఒక వంక పెట్టుకుని మళ్ళీ ఇక్కడే ఉండిపోతుంది అనుకొని సరేలే రేపు నువ్వు వెళ్ళేటప్పుడు నా గుర్తు గా మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరోజ. తర్వాత వసుధార రాధమ్మ దగ్గరికి వెళ్లి ఆయన నిజంగానే మీ మనవడా అని అడుగుతుంది. రాధమ్మ ముందు తను నా మనవడే అని గట్టిగా చెప్తుంది కానీ వసుధార గట్టిగా ప్రశ్నించడంతో రాధమ్మ కంగారుపడుతూ చేతిలో ఉన్న ప్లేట్ కింద పడేస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X