Guppedanta Manasu June 10th episode: వసుధారపై ఫైర్ అవుతున్న మినిస్టర్.. అందుకే సైలెంట్ గా ఉన్నానంటున్న మను!
రిషి రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేయడంలో భాగంగా.. మళ్లీ రిషి కర్మకాండ అంశం తెరపైకి వచ్చింది. రిషి గురించి పేపర్లో ప్రకటన ఇస్తుంది వసుధార. ఆ నెంబర్ కి కాల్ చేసి వసుధారని ఒక ఆట ఆడుకుంటాడు శైలేంద్ర. ఆ తర్వాత కాలేజీకి ఎగ్జామినేషన్స్ సెంటర్ రాకుండా చేస్తాడు.ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కధ. ఇక జూన్ 10వ తేదీ ఎపిసోడ్ 1097 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
రిషి సార్ చనిపోయారు అనటానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు, ఏవో ఒకటి రెండు ఆధారాలు దొరికినంత మాత్రాన ఆయన చనిపోయారు అనటం సరైనది కాదు అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మినిస్టర్ కోప్పడుతూ ఏంటి సార్ ఇది, ఎండి అంటే ఎంత సహనంతో ఉండాలి అలాంటిది తను ఇలా బిహేవ్ చేస్తే ఎలా అంటూ ఫైర్ అవుతాడు. నేను తనతో మాట్లాడుతాను అంటాడు ఫణీంద్ర. చెప్తే వింటుంది అంటారా, కాలేజీ రెప్యూటేషన్ పడిపోతుంది ఇప్పటికే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా రిజెక్ట్ అయింది.

ఇప్పటికైనా జాగ్రత్త పడండి అని హెచ్చరించి వెళ్లిపోతాడు మినిస్టర్. ఆ తర్వాత మనుతో వసుధార మాట్లాడుతూ మీరు ఎందుకు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు, ఎందుకు నాకు సపోర్ట్ చేయడం లేదు, మీ నాన్నగారి గురించి అడిగినప్పుడు నేను మౌనంగా ఉన్నానని ఇప్పుడు మీరు మౌనంగా ఉన్నారా అని నిలదీస్తుంది. పాతికేళ్లు గా మా నాన్న గారి గురించి వెతుకుతున్నాను నాకే తెలియదు అలాంటిది మీకేం తెలుస్తుంది.
అయినా నేను దాని గురించి ఆలోచించడం లేదు అక్కడ నేను ఏం మాట్లాడినా ఆ శైలేంద్ర తనకి అనుకూలంగా మార్చుకొని రచ్చ చేసేస్తాడు అందుకే మౌనంగా ఊరుకున్నాను అంటాడు మను. కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్ రిజెక్ట్ అవ్వటానికి కారణం ఆ శైలేంద్ర అని తెలిసినా మనం ఏమి చేయలేకపోతున్నాము అంటాడు మను. ఆ మాటలు అన్ని పక్కనుంచి వింటాడు శైలేంద్ర. కోపంతో రగిలిపోండి, నేను మళ్లీ వచ్చేటప్పటికి ఇక్కడ బూడిద మాత్రమే మిగలాలి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు ఫణీంద్ర మహేంద్ర దగ్గరికి వచ్చి కాలేజీ పరిస్థితి గురించి చెప్పి బాధపడతాడు, సాయంత్రం మనం ఈ విషయం గురించి చర్చిద్దాం వసుధారని తీసుకొని ఇంటికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత వసుధార దగ్గరకి వెళ్తాడు మహేంద్ర. వసుధార మహేంద్ర తో మాట్లాడుతూ మీరు కూడా నా మాటలు నమ్మటం లేదు కదా అని నిష్టూరంగా మాట్లాడుతుంది.
లేదమ్మా రిషి ఉన్నాడు అనే నీ నమ్మకాన్ని నేను కూడా నమ్ముతున్నాను, అందుకే నిన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నాను అంటూ ఫణీంద్ర తమని వాళ్ళ ఇంటికి రమ్మన్న విషయం చెప్పి వెళ్ళిపోతాడు మహేంద్ర. మరోవైపు ఫణీంద్ర కి కాలేజీ రేప్యుటేషన్ పడిపోయిందని, కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్ క్యాన్సిల్ అయిందని ఓదార్పు నేపంతో వెటకారంగా చాలామంది ఫోన్ చేస్తుంటారు. దెబ్బకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు ఫణీంద్ర.

ఇదంతా ఆ వసుధార వల్లే అని ఫణీంద్ర ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు దేవయాని, శైలేంద్ర. దీని వెనక ఎవరో ఉన్నారు మావయ్య లేదంటే ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతుంది అంటుంది ధరణి. ఆ మాటలకి సైలెంట్ యిపోతాడు శైలేంద్ర. తరువాత వసుధార వాళ్ళు ఫణీంద్ర ఇంటికి వస్తారు. ఫణీంద్ర మాట్లాడుతూ నేను ఏం మాట్లాడినా నీ మీద అభిమానంతోనే మాట్లాడుతాను నాకు రిషి ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టం అంటాడు.
మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి సార్ నాకు మావయ్య మాట ఎంతో మీ మాట కూడా అంతే. మీరు ఏం మాట్లాడినా నేను శిరసా వహిస్తాను, చెప్పండి ఎండి పదవి వదిలేయమంటారా అంటుంది వసుధార. ఛ, ఛ ఆ పదవికి నీకన్నా అర్హులు ఎవరుంటారు, నేను దాని గురించి మాట్లాడటం లేదు అంటాడు ఫణీంద్ర. ఆ మాటలకి నిరుత్సాహపడతారు దేవయాని, శైలేంద్ర.

నేను రిషి గురించి మాట్లాడుతున్నానమ్మ, రిషి లేడు అనే విషయాన్ని నువ్వు నమ్మాలి, రిషి ఉన్నాడు, మూడు నెలల్లో తీసుకువస్తాను అని నువ్వు చెప్పినప్పుడు నేనే నిన్ను సపోర్ట్ చేశాను కానీ ఇన్ని రోజులైనా రిషి రాలేదు అంటాడు ఫణీంద్ర. ఇంకా మూడు నెలలు అవ్వలేదు కదా అంటుంది వసుధార. ఇన్ని రోజులు రాలేనిది ఇప్పుడు వస్తాడంటావా, వచ్చేవాడే అయితే ఎప్పుడో వచ్చేవాడు అంటాడు ఫణీంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











