Guppedanta Manasu June 14th episode: మహేంద్ర కోరిక తీరుస్తానంటున్న మను.. రంగాగా మారిన రిషి!

రిషి లేడనే విషయాన్ని ఒప్పుకోమంటూ వసుధార మీద ఒత్తిడి తెస్తారు ఫణీంద్ర వాళ్ళు. వసుధార బోర్డు మీటింగ్ పెట్టి ఎండి సీట్ ని వదిలేస్తున్నాను అని చెప్తుంది. బయటికి వచ్చేసినా ఆమెని శైలేంద్ర కిడ్నాప్ చేయిస్తాడు.ఆ ప్రయత్నంలో రీ ఎంట్రీ ఇచ్చిన రిషి ఆమెని కాపాడతాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 14వ తేదీ ఎపిసోడ్ 1101 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

వసుధార కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు రిషి. అతడిని గుర్తుపట్టిన వసుధార షాక్ అవుతుంది. పరిగెత్తుకొని వెళ్లి అతడిని హగ్ చేసుకుంటుంది. అదే సమయంలో రిషి ని ఒక రౌడీ కొట్టబోతుండటంతో అడ్డుపడుతుంది. తలకి దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోతుంది వసుధార. ఆమెని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. తర్వాత రౌడీలు పాండు దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తారు. ఇప్పుడు ఆ శైలేంద్ర ఫోన్ చేసి అడిగితే ఏమని చెప్పాలి అసలే వాడు అనుమానం పక్షి, ఏం చెప్పినా ఒకంతట నమ్మడు అంటాడు పాండు.

Guppedanta Manasu June 14th 2024 Episode number 1101 Shailendra is happy to leave Vasudhara College

మళ్లీ తనే తన అసిస్టెంట్ లకి ఒక ఐడియా చెప్పి ఫాలో అవ్వండి అని చెప్పి పంపించేస్తాడు. మరోవైపు ఆటోలో ఉన్న రిషి వసుధారని లేపే ప్రయత్నం చేస్తాడు. ఆటో డ్రైవ్ చేస్తున్న రిషి అసిస్టెంట్ తను నీకు తెలుసా అన్న అని అడుగుతాడు. లేదు కానీ నేనే తనకి తెలుసులా ఉంది అంటాడు రిషి. ఎలా అంటాడు అసిస్టెంట్. రోజూ చాలా మందిని దింపుతూ ఉంటాను కదా అలా నేను తెలుసేమో అంటాడు రిషి. ఆమె మొహం చూస్తే చాలా మంచి దానిలాగా కనిపిస్తుందన్న అంటాడు అసిస్టెంట్. నిజమేరా అందుకే నాకు తగలవలసిన దెబ్బ తనకి తగిలించుకుంది అంటూనే ఆటోని కుడివైపుకి పోనీ అంటాడు రిషి.

హాస్పిటల్ ఇటువైపు ఉంది కదా అన్న అంటాడు అసిస్టెంట్ హాస్పిటల్ కి వెళ్తే ఏమైంది, ఈవిడ ఎవరు అంటూ సవాలక్ష కోసమే వేస్తారు అందుకే ఇంటికి తీసుకువెళ్లి డాక్టర్ని ఇంటికి పిలిపించి ట్రీట్మెంట్ చేయిద్దాం అంటాడు రిషి. సరే అంటాడు అసిస్టెంట్. మరోవైపు వసుధార గురించి బాధపడుతూ ఉంటాడు మహేంద్ర. తన గురించి వెతకొద్దు అని వసుధార చెప్పింది ఇక తనకైతాను వచ్చేవరకు మనం ఎదురు చూడటమే తప్పితే ఏమి చేసేది లేదు అంటాడు. మను అతనికి ధైర్యం చెప్తాడు.

Guppedanta Manasu June 14th 2024 Episode number 1101 Shailendra is happy to leave Vasudhara College

అప్పుడు మహేంద్ర మాట్లాడుతూ నాకు ఒక మాట ఇవ్వు మను, ఎన్ని కష్టాలు వచ్చినా కాలేజీని వదిలిపెట్టను అని మాటివ్వు, అర్హత లేని వాళ్ళ చేతికి కాలేజీ వెళ్ళకూడదు అందుకే వసుధార ఎన్ని కష్టాలు వచ్చినా కాలేజీని వదలలేదు. రిషి లేడు అనటాన్ని ఆమె జీర్ణించుకోలేక వెళ్ళిపోయింది అంటాడు మహేంద్ర. కాలేజీని ఎప్పటికీ వదలను అని మాట ఇస్తాడు మను. మహేంద్ర ని తనతో పాటు తన ఇంటికి వచ్చేయమంటాడు.

కానీ రిషి వసుధార ల జ్ఞాపకాలు ఇంట్లో ఉన్నాయి నేను రాను, మీకు వీలైతే మీరు కూడా ఇక్కడే ఉండిపోండి అంటాడు మహేంద్ర. మహేంద్ర ని ఒంటరిగా వదలటం నాకు ఇష్టం లేదు అంటుంది అనుపమ. మను కూడా మహేంద్ర ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటాడు. మరోవైపు వసుధార కి ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయిస్తాడు రిషి. ఈ పిల్ల నీకు ఎక్కడ దొరికింది రంగా అని అడుగుతుంది వాళ్ళ బామ్మ. జరిగింది చెప్తాడు రంగా( రిషి ). పేషెంట్ కి ఇంజక్షన్ చేయాలి కాస్త పట్టుకోండి అని రిషికి చెప్తుంది డాక్టర్.

Guppedanta Manasu June 14th 2024 Episode number 1101 Shailendra is happy to leave Vasudhara College

అప్పుడే అక్కడికి వచ్చిన రంగా మరదలు సరోజ మా బావకి అలాంటి పనులు చెప్పకండి నేను చేస్తాను అంటుంది. ఇంజక్షన్ చేసిన డాక్టర్ ఆమె రిషి సార్ అని ఎవరినో కలవరిస్తుంది,మీకు వీలైతే ఆయనని తీసుకొని రండి అని చెప్తుంది. ఆయన ఎవరో మాకు తెలియదు అంటాడు రంగా. మెలకువ వచ్చిన తరువాత ఆమె మనసు కష్టపడే పనులు చేయకండి అని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్. ఆ తర్వాత రంగా తన మరదలు సరోజతో నీ బట్టలు ఆమెకి ఇవ్వు అని చెప్తాడు. ఇవ్వడానికి ఆలోచిస్తుంది సరోజ.

కానీ రంగ అసిస్టెంట్ నువ్వు ఇవ్వకపోతే కొత్త బట్టలు కొని తీసుకువస్తాడు తర్వాత నీ ఇష్టం అని మెల్లగా చెప్పటంతో భయపడిన సరోజ బట్టలు ఇవ్వటానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకురమ్మని తన అసిస్టెంట్ కి చెప్తాడు రంగా. ఇంతలోనే వసుధార మెలకువలోకి వస్తుంది. రంగాని చూసి రిషి సార్ అంటూ బాగా ఎక్సైట్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X