Guppedanta Manasu June 15th episode: రిషిని చూసి ఎక్సైట్‌మెంట్‌తో వసుధార..

రిషి లేడనే విషయాన్ని ఒప్పుకోమంటూ వసుధార మీద ఒత్తిడి తెస్తారు ఫణీంద్ర వాళ్ళు. వసుధార బోర్డు మీటింగ్ పెట్టి ఎండి సీట్ ని వదిలేస్తున్నాను అని చెప్తుంది. బయటికి వచ్చేసిన ఆమెని శైలేంద్ర కిడ్నాప్ చేయిస్తాడు.ఆ ప్రయత్నంలో రీ ఎంట్రీ ఇచ్చిన రిషి ఆమెని కాపాడతాడు. మహేంద్ర ని ఒంటరిగా వదిలేయలేక అతనితోనే ఉండిపోవటానికి సిద్ధపడతాడు మను. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 15వ తేదీ ఎపిసోడ్ 1102 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

స్పృహలోకి వచ్చిన వసుధార రిషి ని చూసి ఆనందంతో లేచి అతనిని హాగ్ చేసుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సరోజ కోప్పడుతూ అలా పట్టేసుకుంటావేంటి అతను మా బావ రంగా అంటుంది. రిషి కూడా నేను రిషి సార్ ని కాదు రంగాని అని చెప్పటంతో షాక్ అయిన వసుధార మళ్లీ స్పృహ కోల్పోతుంది. వసుధార రిషిని హగ్ చేసుకోవడంతో హర్ట్ అయిన సరోజ ని మరింత ఆటపట్టిస్తాడు రిషి అసిస్టెంట్. అతడిపై కోప్పడుతుంది సరోజ. వాళ్లని మందలించి ఒకరిని మందులు తీసుకురమ్మని మరొకరిని బట్టలు తీసుకురమ్మని పంపించేస్తాడు రిషి.

Guppedanta Manasu June 15th 2024 Episode number 1102 Shailendra is happy to leave Vasudhara College

మరోవైపు పాండు కి ఫోన్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. పాండు ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళుతున్న ధరణి ఈయన ఇంత కంగారు పడుతున్నారంటే ఏదో వెధవ పని చేసి ఉంటారు అనుకుంటూ భర్త దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏం చెప్పాలో అర్థం కాని శైలేంద్ర ఫారెన్లో ఉన్న బిజినెస్ పార్ట్నర్ తో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను అంటాడు. అక్కడ ఇప్పుడు రాత్రి కదా వాళ్ళు పడుకొని ఉంటారు మిస్డ్ కాల్ చూసుకొని రేపు ఫోన్ చేస్తారులెండి మీరు నాతో రండి అంటుంది ధరణి.

నన్ను చికాకు పెట్టకు, నేను అర్జెంటుగా మాట్లాడాలి నువ్వు వెళ్ళు అని ధరణిని కసురుకొని అక్కడ నుంచి పంపించేస్తాడు శైలేంద్ర. మరోవైపు శైలేంద్ర పదేపదే ఫోన్ చేయడంతో కంగారు పడిపోతాడు పాండు. అప్పుడే ఒక బొమ్మకి చీర కట్టి తీసుకు వస్తారు అతని అసిస్టెంట్స్. ఆ బొమ్మని గోతిలో పూడ్చేస్తుండగా శైలేంద్ర ఫోను లిఫ్ట్ చేస్తాడు పాండు. అదేంటి చూడడానికి బొమ్మలాగా కనిపిస్తుంది అని అనుమానంగా అడుగుతాడు శైలేంద్ర.

నాకు ఫేస్ ఫోటో తీసి పంపించండి అని అడుగుతాడు. ఇందాకే చూపించాను కదా ఇప్పుడు మళ్ళీ అంటే అవ్వదు ఇప్పుడే పోలీసులు ఇటుగా వెళుతున్నారు అంటూ కంగారుపడుతున్నట్లుగా నటిస్తూ ఫోన్ పెట్టేస్తాడు పాండు. ఎక్కడ దొరికిపోతామో అనే భయంతో శైలేంద్ర కూడా మరేమి అనలేకపోతాడు, తర్వాత ఇంట్లోకి వెళ్లి అందరిని తల స్నానం చేయమంటాడు. ధరణి ఎందుకు అని అడుగుతుంది. దేవయాని కూడా అప్పుడే వచ్చి ఎందుకు చేయాలి అని అడుగుతుంది.

ధరణిని కొంచెం దూరంగా నిలబడమని చెప్పి వసుధార విషయం తల్లికి చెప్తాడు శైలేంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన ఫణీంద్ర ఏంటి నీ స్నానాల గోల అని అడుగుతాడు. ఏం చెప్పాలో అర్థం కాదు శైలేంద్ర కి. ఏం చెప్పాలో ప్లాన్ చేయలేదా అంటుంది దేవయాని. లేదు అన్నట్లు మొహం పెడతాడు శైలేంద్ర. ఈరోజు గ్రహాలన్నీ ఒకే దిశలో ప్రయాణిస్తాయంట కదా అందుకే తల స్నానం చేస్తే మంచిదంట అంటుంది దేవయాని. అంతేనా ఇంకేమైనా ప్లాన్ చేశారా అంటాడు ఫణీంద్ర.

కడుపులో ఇంత కుళ్లు పెట్టుకొని ఎన్ని తల స్నానాలు చేస్తే మాత్రం ఏముంది అని కోప్పడతాడు. ఏదో మా నమ్మకం మాది తల స్నానం చేయడం మాత్రం మర్చిపోవద్దు అంటుంది దేవయాని. సరే అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. నెక్స్ట్ సీన్ లో షాక్ అవుతున్న దేవయాని ఏం మాట్లాడుతున్నావ్ రా మను తండ్రి మహేంద్ర నా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది.

అవును మమ్మీ నేను ముందు నీలాగే షాక్ అయ్యాను కానీ వసుధార కచ్చితంగా లెటర్లో అలాగే రాసింది అంటూ ఆ లెటర్ తీసి చూపిస్తాడు శైలేంద్ర. ఆ లెటర్ వసుధార మనుకి రాస్తుంది. మీకు ఈరోజు నిజం తెలుస్తుంది అన్నాను కదా ఆ నిజం మీ తండ్రి గురించే, మీ తండ్రి మరెవరో కాదు మహేంద్ర సార్ ఆయనని ఏమీ అనవద్దు అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. అది చదివిన దేవయాని మరింత షాక్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X