GuppedantaManasu Jun17th episode: శైలేంద్ర చెంప పగలగొట్టిన దేవయాని..వసుధారని ఇంట్లోంచి పంపించేస్తానంటున్న సరోజ

వసుధార బోర్డు మీటింగ్ పెట్టి ఎండి సీట్ ని వదిలేస్తున్నాను అని చెప్తుంది. బయటికి వచ్చేసిన ఆమెని శైలేంద్ర కిడ్నాప్ చేయిస్తాడు.ఆ ప్రయత్నంలో రీ ఎంట్రీ ఇచ్చిన రిషి ఆమెని కాపాడతాడు. మహేంద్ర ని ఒంటరిగా వదిలేయలేక అతనితోనే ఉండిపోవటానికి సిద్ధపడతాడు మను. స్పృహలోకి వచ్చిన వసుధార తనని కాపాడింది రిషి సార్ కాదని రంగా అని తెలుసుకొని మళ్లీ స్పృహ కోల్పోతుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 17వ తేదీ ఎపిసోడ్ 1103 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

లెటర్ చదివిన దేవయాని ఈ లెటర్ నిజం కాదేమో, మహేంద్ర క్యారెక్టర్ అలాంటిది కాదు అంటుంది. కళ్ళముందు లెటర్ పెట్టుకుని క్యారెక్టర్ నుంచి మాట్లాడుతున్నావ్ ఏంటి నేను ఆ రోజే చెప్పాను మ అంటే మహేంద్ర, ను అంటే అనుపమ అని కానీ నువ్వే నా మాటలు కొట్టి పారేశావు అంటాడు శైలేంద్ర. మరి వసుధార మీ అన్వేషణ ఫలిస్తుంది అని మను తో చెప్పింది కదా ఏం చెప్పిందా అనే అనుమానం మనుకి వస్తుంది కదా అంటుంది దేవయాని.

Guppedanta Manasu June 17th 2024 Episode number 1103 Shailendra is happy to leave Vasudhara College

అందుకే నేను ఈ లెటర్ ప్లేస్ లో మరొక లెటర్ పెట్టాను. ఆ లెటర్లో మీ తండ్రి చనిపోయారు ఆ విషయం మీకు చెప్తే బాధపడతారని అనుపమ మేడం మీకు నిజం చెప్పలేదు అని రాస్తూ ప్రస్తుత పరిస్థితులలో ఈ కాలేజీ ఎండి పదవికి శైలేంద్ర అయితేనే కరెక్ట్ అని రాస్తాడు. కానీ మళ్ళీ డౌట్ వస్తుందని ఆ మాటలని పెన్ తో కొట్టేస్తాడు. అదే విషయం శైలేంద్ర తల్లితో చెప్తే దేవయాని అతని చంప పగలగొడుతుంది. కచ్చితంగా ఆ లెటర్ మను నమ్మడు.

తల్లి చనిపోతే ఆ విషయం తల్లి
తనకి చిన్నప్పుడే చెప్పేది కదా అనుకుంటాడు. ఇప్పుడు ఆ లెటర్ రాశావని నీ మీదే అనుమానం వస్తుంది అంటుంది దేవయాని. అప్పుడే అక్కడికి వచ్చిన ధరణి ఏం లెటర్ మీరు మళ్ళీ ఏమైనా చేయబోతున్నారానిజం చెప్పండి అని భర్తని నిలదీస్తుంది. ఆమెని కసురుకొని అక్కడ నుంచి పంపించేస్తాడు శైలేంద్ర. మరోవైపు స్పృహలో లేని వసుధార ని చూస్తూ కూర్చుంటాడు రంగా. అప్పుడే బట్టలు తీసుకుని అక్కడికి వచ్చిన సరోజ ఏమిటి అలా చూస్తున్నావు పక్కన మనుషులు వచ్చారని కూడా గమనించడం లేదు అని రంగాతో గొడవ పడుతుంది.

నేను ఆమెని చూడటం లేదు ఏదో ఆలోచిస్తున్నాను నాకు ఆడవాళ్ళతో మాట్లాడటం అంటేనే సిగ్గు నీకు తెలుసు కదా అంటాడు రంగా. నాకెందుకో ఈవిడ నీకు ముందే తెలుసు అనిపిస్తుంది అదే గనుక నిజమైతే ఈమెని నేను ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటుంది సరోజ. అలా అనకు ఆవిడ మన రంగా ప్రాణాలు కాపాడింది అంటాడు రంగా అసిస్టెంట్.

Guppedanta Manasu June 17th 2024 Episode number 1103 Shailendra is happy to leave Vasudhara College

ఆమెని కాపాడటానికి వెళ్తేనే కదా తను బావ ప్రాణాలు కాపాడింది అంటుంది సరోజ. నిజంగానే ఆమె ఎవరో నాకు తెలియదు అంటాడు రంగా. ఆమె ఎవరై ఉంటుంది ఆమెని రౌడీలు ఎందుకు తరిమి ఉంటారు అంటావు ఒకవేళ ఆమె దొంగ అంటావా అంటుంది సరోజ. లేదు, ఆవిడని చూడటానికి అలా కనిపించడం లేదు మంచి ఆవిడ లాగా కనిపిస్తున్నారు అంటాడు రంగా. మంచి వాళ్లే ఎప్పుడైనా ముంచి పోతారు అంటుంది సరోజ.

ఆవిడ నిద్రపోతున్నారు కదా ఇక్కడ మీ డిస్టబెన్స్ ఏంటి అంటాడు రంగా. నన్ను డిస్టబెన్స్ అన్నావు కదా నేను వెళ్ళిపోతాను, ఆమెకి నా బట్టలు కూడా ఇవ్వను వెళ్ళిపోతాను అంటుంది సరోజ. అలా అంటే ఎలా, బట్టలు ఇవ్వకపోతే ఆమె ఏం వేసుకుంటుంది అంటాడు రంగా. అప్పుడు సరోజ కొంచెం కూల్ అయ్యి బట్టలు రంగాకి ఇచ్చి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X