Guppedanta Manasu June 18th episode: వసుధార, రంగా మధ్య హై డ్రామా..
బయటికి వచ్చేసిన ఆమెని శైలేంద్ర కిడ్నాప్ చేయిస్తాడు.ఆ ప్రయత్నంలో రీ ఎంట్రీ ఇచ్చిన రిషి ఆమెని కాపాడతాడు. మహేంద్ర ని ఒంటరిగా వదిలేయలేక అతనితోనే ఉండిపోవటానికి సిద్ధపడతాడు మను. స్పృహలోకి వచ్చిన వసుధార తనని కాపాడింది రిషి సార్ కాదని రంగా అని తెలుసుకొని మళ్లీ స్పృహ కోల్పోతుంది. మనో తండ్రి మహేంద్ర అని తెలుసుకొని షాక్ అవుతారు శైలేంద్ర, దేవయాని. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 18వ తేదీ ఎపిసోడ్ 1104 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
వసుధార విషయం ఏమైనా తెలిసిందా అని తమ్ముడిని అడుగుతాడు ఫణీంద్ర. ఏమి తెలియలేదు అన్నయ్య, పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే ఇప్పటికే మన కాలేజీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఏం చేయటానికి పాలు పోవడం లేదు అంటాడు మహేంద్ర. తను అలా వెళ్ళిపోతుందని ఊహించలేదు, అలా అయితే అసలు రిషి టాపిక్ తీసుకొచ్చేవాడిని కాదు అంటాడు ఫణీంద్ర. అవును వెళ్ళిపోతూ తను రాసిన లెటర్ లో ఎండి పదవి ఎవరికి ఇవ్వాలో చెప్తే బాగుండేది అంటాడు శైలేంద్ర.

అందరూ ఒకసారి గా షాక్ అవుతారు, లెటర్ ఏంటి అని అడుగుతాడు మను. అప్పుడు రియలైజ్ అయిన శైలేంద్ర లెటర్ రాస్తే బాగుండు అన్నాను అంటాడు. మను మన ఫ్యామిలీ కాదు, మన ఫ్యామిలీ నుంచే ఎండి అవ్వాలి కాబట్టి ఇక మిగిలింది నేనే ఇందులో ఇంకా ఆలోచించడానికి ఏముంది అంటాడు శైలేంద్ర. లేదు, అర్హత కూడా కావాలి, బోర్డు మీటింగ్ పెట్టి ఎండి ఎవరో నిర్ణయిద్దాము, మినిస్టర్ గారే ఎండి ఎవరో చెప్తారు అంటాడు మహేంద్ర. ఆ మాటలని సపోర్టు చేస్తాడు ఫణీంద్ర. మరోవైపు మెలకువ వచ్చిన వసుధార దగ్గరికి రాధమ్మ వస్తుంది.
నువ్వు నా మనవడిని కాపాడవంట కదా చాలా సంతోషం నా మనవడు రంగా కోసమే నేను బ్రతుకుతున్నాను అంటూ వసుధారకి టాబ్లెట్ ఇచ్చి వేసుకోమంటుంది. రిషి సార్ ఏరి అని అడుగుతుంది వసుధార. అతను ఎవరు, నిన్ను నా మనవడు రంగా కాపాడేడంట కదా అంటుంది రాధమ్మ. ఆయనే రిషి సార్అంటుంది వసుధార. కంగారుపడిన రాధమ్మ మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు రెస్ట్ తీసుకో, పడుకో అని చెప్పి వసుధారని పడుకోబెడుతుంది.

మనసులో మాత్రం ఈవిడ ఏంటి రంగాని పట్టుకొని రిషి సార్ అంటుంది అనుకుంటుంది. మరోవైపు ఎండి పదవి తనకి దక్కలేదని ఫ్రష్టేట్ అవుతూ ఉంటాడు శైలేంద్ర. ఆ వసుధార ఎండిగా నా పేరు చెప్పినా బాగుండేది, ఇప్పుడు ఆ మినిస్టర్ చచ్చినా నన్ను ఎండి అని చేయడు అనుకుంటాడు. అసలు ఆ పాండు వసుధారని నిజంగానే చంపాడా అనుకుంటూ పాండుకి ఫోన్ చేస్తాడు. తనని భూమిలో పాతి పెట్టడం మీరు చూశారు కదా ఇంకా అనుమానం గా అడుగుతారు ఏంటి అంటాడు పాండు.
నాకు ఎక్కడ పాతిపెట్టారో లొకేషన్ షేర్ చెయ్యు నేను వచ్చి చూస్తాను అంటాడు శైలేంద్ర. సరే అని ఫోన్ పెట్టేస్తాడు పాండు. అతను వచ్చి చూస్తే నిజం తెలిసిపోతుంది కదా అన్న అంటాడు పాండు అసిస్టెంట్. నిజమేరా అతను వచ్చేలోగా ఆ వసుధారతో పాటు ఆమెని కాపాడిన ఆటో డ్రైవర్ ని కూడా చంపేయాలి అంటాడు పాండు. మరోవైపు వసుధార ప్రవర్తన గురించి చర్చించుకుంటూ ఉంటారు రంగా కుటుంబ సభ్యులు.

అంతలోనే మెలకువ వచ్చిన వసుధార నేరుగా రంగా దగ్గరికి వచ్చి హగ్ చేసుకోబోతుంది కానీ సరోజ అడ్డుపడుతుంది. అతను రిషి సార్ కాదు నా బావ రంగా అంటుంది. రాధమ్మ మాట్లాడుతూ అసలు ఎవరు ఆ రిషి సార్, నీకు ఏమవుతారు అని అంటుంది అతను నా భర్తఅంటుంది వసుధార. నీ భర్త నీ దగ్గర ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉంటాడు అంటుంది సరోజ. విది మమ్మల్ని విడదీసింది, ఇప్పుడు కూడా ఆయనని వెతుక్కుంటూ వస్తూ ఉంటేనే ఇలా జరిగింది అంటుంది వసుధార.
రాధమ్మ కూడా వీడు నా మనమడు రంగా అని చెప్పటంతో ఎందుకు మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు అంటూ రంగా దగ్గరికి వెళ్లి వాళ్లకి తెలియదు కానీ మీకు తెలుసు కదా మీరు నిజంగానే నా రిషి సార్ కదా నేను మీ వసుధారని నన్ను గుర్తు పట్టలేదా అని అంటుంది వసుధార. అవును నేను మీ రిషి సర్ నే అంటాడు రంగా. అతని మాటలకి షాక్ అవుతారు సరోజ వాళ్ళు, వసుధార మాత్రం ఆనందపడుతుంది తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











