Guppedanta Manasu June 19th episode: నేనే ఆమె రిషి సార్‌ను.. సీక్రెట్ విప్పిన రంగా.. ఆనందంలో వసుధార
రీ ఎంట్రీ ఇచ్చిన రిషి వసుధారని కాపాడతాడు. మహేంద్ర ని ఒంటరిగా వదిలేయలేక అతనితోనే ఉండిపోవటానికి సిద్ధపడతాడు మను. స్పృహలోకి వచ్చిన వసుధార తనని కాపాడింది రిషి సార్ కాదని రంగా అని తెలుసుకొని మళ్లీ స్పృహ కోల్పోతుంది. మను తండ్రి మహేంద్ర అని తెలుసుకొని షాక్ అవుతారు శైలేంద్ర, దేవయాని.మరోవైపు వసుధార రంగా ని పట్టుకొని రిషి సార్ అంటూ వాళ్ళ ఇంట్లో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 19వ తేదీ ఎపిసోడ్ 1105 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నేను రంగాని కాదు, తన రిషి సార్ ని అంటాడు రంగా. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిన వసుధార రంగాని హగ్ చేసుకుంటుంది. చెప్పండి సార్, ఏం జరిగింది మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? వాళ్ళందరూ మిమ్మల్ని ఎందుకు రంగా అంటున్నారు అని అడుగుతుంది. అవన్నీ తర్వాత చెప్తాను అంటాడు రంగా. సరే మనం ఇంటికి వెళ్దాం పదండి మీకోసం మావయ్య ఏడుస్తున్నారు అంటుంది వసుధార.

ముందు నీ ఆరోగ్యం కుదుటపడనీ అప్పుడు వెళదాము ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని రెస్ట్ తీసుకో అని చెప్పడంతో లోపలికి వెళ్ళిపోతుంది వసుధార. మరోవైపు భర్త దగ్గరికి వచ్చిన దేవయాని పొద్దున్న కాలేజీలో మీటింగ్ జరిగిందంట కదా ఏం జరిగింది అని అడుగుతుంది. ఎండి పదవి ఎవరికి ఇవ్వాలి అని డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటాడు ఫణీంద్ర. ఇందులో డిస్కషన్స్ ఏమున్నాయి, మన వంశం వాళ్లే కాలేజీ ఎండి అవ్వాలి కాబట్టి మన శైలేంద్రనే ఎండి ని చేయండి అంటుంది దేవయాని.
దానికి అర్హతలు కావాలి, వాడు చిన్న చిన్న విషయాలనే హ్యాండిల్ చేయలేడు, ఎందుకు నీ కొడుకు మీద నీకు అంత నమ్మకం అంటాడు ఫణీంద్ర. అప్పుడంటే వాడికి ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు వాడు చాలా రోజులుగా కాలేజీకి వెళ్తున్నాడు, జగతి వాళ్ళ దగ్గర ఎంతోకొంత నేర్చుకున్నాడు ఇంకా ఇంతకు మించిన అర్హత ఏం కావాలి అంటుంది దేవయాని. మేము ఈ విషయం మీద ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాము, అయినా నువ్వు కాలేజీ విషయాల్లో తల దూర్చొద్దు అంటూ ఆమెని కోప్పడతాడు ఫణీంద్ర.

మరోవైపు మను మినిస్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శైలేంద్ర మను ని చూసి షాక్ అవుతాడు. వీడు నా ఎండి సీట్ కి ఎసరు పెట్టడానికి వచ్చాడా అని అనుకుంటాడు. నువ్వు ఎందుకు వచ్చావు అని మను ని అడుగుతాడు శైలేంద్ర. కాలేజీ విషయాలు డిస్కస్ చేయడానికి వచ్చాను అని అంటాడు మను. మరి నువ్వు ఎందుకు వచ్చావు అని శైలేంద్ర అని అడుగుతాడు మినిస్టర్. ఏం చెప్పాలో అర్థం కాక పిచ్చి వాగుడు వాగుతాడు శైలేంద్ర.
అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు మను, మినిస్టర్. ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు మినిస్టర్. నేను కూడా మను లాగే కాలేజీ భవిష్యత్తు గురించి మాట్లాడటానికి వచ్చాను, ఎండి లేని ఆ కాలేజీకి ఇంక మీరే దిక్కు, మీ గైడెన్స్ లోనే మేము పని చేస్తాము అని చెప్తాడు శైలేంద్ర. మినిస్టర్ సరే అనటంతో అక్కడినుంచి మను,శైలేంద్ర ఇద్దరు వెళ్ళిపోతారు. మరోవైపు సరోజ నువ్వు నిజంగా రిషి సర్ వా.. మా బావ రంగా వి కాదా అని అడుగుతుంది.

కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు, డాక్టర్ గారు ఆమె విషయంలో ఏం చెప్పారు, ఆమె ఇబ్బంది పడే విషయాలు మాట్లాడొద్దని చెప్పారు కదా అందుకే నేను అలా మాట్లాడాను ఒకవేళ ఇప్పుడు నేను రాంగానే అని చెప్తే ఆవిడ ఆ విషయాన్ని తీసుకోలేరు, మెంటల్గా డిస్టర్బ్ అవుతారు అందుకే అలా చెప్పాను కొద్ది రోజులలో ఆమెకి నయం అయిపోతుంది అప్పుడు మనమే ఆమెను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దిగబెడదాం అంటాడు రంగా. డ్రెస్ మార్చుకొని వచ్చిన వసుధార ఆ మాటలు అన్ని వినేస్తుంది.

మీరు చెప్పినదంతా అబద్ధం సార్, నిజంగా మీరు నా రిషి సారే, మీరు నా రిషి సార్ అని నిరూపించే వరకు నేను ఈ ఇంట్లోంచి కదలను అంటూ శపధం చేస్తుంది. సరే ముందు వెళ్లి రెస్ట్ తీసుకోండి అంటాడు రంగా. లోపలికి వెళ్ళిపోతుంది వసుధార. రిషి కూడా అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇదెక్కడ దొరికింది రా ఇలా తగులుతుంది అని రంగ అసిస్టెంట్ తో చెప్పి ఫ్రస్టేట్ అవుతుంది సరోజ. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











