Guppedanta Manasu June 20th episode: మీరే నా రిషి సార్.. శపథం చేసిన వసుధార

మహేంద్రని ఒంటరిగా వదిలేయలేక అతనితోనే ఉండిపోవటానికి సిద్ధపడతాడు మను. స్పృహలోకి వచ్చిన వసుధార తనని కాపాడింది రిషి సార్ కాదని రంగా అని తెలుసుకొని మళ్లీ స్పృహ కోల్పోతుంది. మను తండ్రి మహేంద్ర అని తెలుసుకొని షాక్ అవుతారు శైలేంద్ర, దేవయాని.మరోవైపు వసుధార రంగా ని పట్టుకొని రిషి సార్ అంటూ వాళ్ళ ఇంట్లో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. శైలేంద్రని ఎండి ని చేయమని భర్తని అడుగుతుంది దేవయాని. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 20వ తేదీ ఎపిసోడ్ 1106 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

శైలేంద్ర మనుతో మాట్లాడుతూ ఎండి కావడం అనేది నా కల, అందుకోసం నేను ఎన్ని ప్రయత్నాలు చేశానో నీకు కూడా తెలుసు అంటాడు. ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకు అంటాడు మను. ఇన్నాళ్లు ఆ రిషి వసుధారల వల్ల నా కల నెరవేరలేదు ఇక ఇప్పుడు నువ్వు అడ్డుపడుతున్నావు నువ్వనే వాడివే లేకపోతే ఆ కాలేజీకి ఎండిని నేనే, అందుకే మన ఇద్దరం ఒక డీలింగ్ కి వద్దాం అంటాడు శైలేంద్ర. నీతో నాకు డీలింగ్ ఏంటి నువ్వు నా దృష్టిలో ఒక గడ్డి పోచతో సమానం అంటాడు మను.

Guppedanta Manasu June 20th 2024 Episode number 1106 Shailendra is happy to leave Vasudhara College

అలా అనకు బ్రదర్ నాకు కావలసింది నాకు ఇస్తే నీ అన్వేషణ ఫలిస్తుంది అంటాడు శైలేంద్ర. దేని గురించి మాట్లాడుతున్నావ్ అంటాడు మను. నీ తండ్రి ఎవరో నాకు తెలుసు, అతను ఎవరో చెప్పాలంటే నేను చెప్పిన పని నువ్వు చేయాలి అంటాడు శైలేంద్ర. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా.. నువ్వు ఏం చేయమంటావో నాకు తెలుసు ఆ పని నేను చచ్చినా చెయ్యను,అయినా నా తండ్రి గురించి నీకు తెలిసే అవకాశమే లేదు, ఇంకా ఎక్కువ చేస్తే కాలేజీలో నీ శిలా విగ్రహం పెట్టిస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మను.

మరోవైపు పాండు వాళ్ళు వసుధారని వెతుకుతూ ఉంటారు. ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూశారా అని అడుగుతూ ఉంటారు. అందరూ తెలియదు అని చెప్తారు. అదే సమయంలో రంగా అసిస్టెంట్ అటువైపుగా వస్తాడు అతడికి కూడా వసుధార ఫోటో చూపించి ఈమె నీకు తెలుసా అని అడుగుతాడు పాండు. నాకు తెలియదు అని చెప్పి తప్పించుకుంటాడు రంగా అసిస్టెంట్. మరోవైపు శైలేంద్ర తల్లితో మనుతో జరిగిన సంభాషణ అంతా చెప్తాడు. మన మాటలు మనం నమ్మటం లేదు ఆ లెటర్ మన దగ్గర ఉన్నా వేస్ట్ అంటాడు.

Guppedanta Manasu June 20th 2024 Episode number 1106 Shailendra is happy to leave Vasudhara College

ఒక పని చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించవా,ఎందుకు అలా ఆలోచన లేకుండా చేస్తున్నావు ఒకవేళ మనం నిజం చెప్పినా,డిఎన్ఏ టెస్ట్ చేసినా కూడా వాళ్ళు మన మాటలు నమ్మరు సరి కదా ఈ విషయం మహేంద్ర కి చెప్తాడు మను. మహేంద్ర మీ నాన్నకి చెప్తే కాలేజీకి సరి అయిన వారసుడు వచ్చాడు అని వాడిని తీసుకెళ్లి ఎండి సీట్ లో కూర్చోబెడతాడు. అప్పుడు మన ఇద్దరం భజన చేసుకోవాల్సిందే అని కొడుకు మీద కోప్పడుతుంది దేవయాని.

ఇప్పుడు ఏం చేయటం అంటాడు శైలేంద్ర. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ అనుపమ వాళ్ల మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ నుంచి పంపించేయాలి అంటుంది దేవయాని. మరోవైపు రంగా కోసం భోజనం తీసుకుని వస్తుంది సరోజ. రంగ బామ్మ మాట్లాడుతూ సరిపోయింది.. మీ నాన్న నా మనవడి దగ్గర వడ్డీలు వసూలు చేస్తూ ఉంటాడు.

Guppedanta Manasu June 20th 2024 Episode number 1106 Shailendra is happy to leave Vasudhara College

నువ్వేమో వాడికి భోజనం తీసుకొస్తున్నావు అంటుంది. నీ మనవడు ఆ వడ్డీల నుంచి తప్పించుకోవాలంటే త్వరగా నా మెడలో తాళి కట్టమను అప్పుడు నా ఆస్తి కూడా నీ మనవడికి చెందుతుంది, మా మధ్యలో మమ్మల్ని విడదీసే వాళ్ళు ఎవరూ రారు అని వసుధారని చూస్తూ అంటుంది. అంతలోనే రంగా అక్కడికి వస్తాడు నీకోసం నీకు ఇష్టమైనవి తీసుకొని వచ్చాను ఏమిటో చెప్పు అంటుంది సరోజ.

బంగాళదుంప అంటుంది వసుధార. నీకెలా తెలుసు అంటుంది సరోజ. ఎందుకంటే ఆయన నా రిషి సార్ కాబట్టి అంటుంది వసుధార. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆయన రిషి సార్ కాదు నా బావ రంగా అని, అయినా ఈ అమ్మాయిని ఎందుకు ఇంకా ఇంట్లో ఉంచుకోవడం అని కోపంగా మాట్లాడుతుంది సరోజ. అలా మాట్లాడకూడదు అని మందలిస్తుంది రంగా నాయనమ్మ.

మూడు పూటలా పెడితే తిని ఒక మూలన కూర్చోవాలి కదా అమ్మమ్మ, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అంటుంది సరోజ. సరే ఈ టాపిక్ వదిలేయండి, పదండి అందరం భోజనం చేద్దాం అంటుంది నాయనమ్మ. నేను రాను అంటుంది పసుధార. మా సరోజ మాటలకు బాధపడితే క్షమించండి అంటాడు రిషి. నన్ను ఇన్ని మాటలు అంటున్నా చూస్తూ ఊరుకున్నారు మీ ప్రవర్తనకే నాకు బాధగా ఉంది అని మనసులో అనుకుంటుంది వసుధార.

Guppedanta Manasu June 20th 2024 Episode number 1106 Shailendra is happy to leave Vasudhara College

ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత సరోజ మనం భోజనం చేద్దాం పద అంటుంది. ఎదుటివాళ్ళు ఆకలితో ఉంటే మనం భోజనం చేయడం బాగోదు, మనం కూడా తర్వాత భోజనం చేద్దాం అంటాడు రంగా. ఆ తర్వాత ఒంటరిగా కూర్చున్న వసుధార దగ్గరకి భోజనం తీసుకొని వస్తాడు రంగా. మాటల్లో మీ నాన్నగారు మీకోసం ఎంత బాధ పడుతున్నారో తెలుసా అని అడుగుతుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X