Guppedanta Manasu June 21st episode: మహేంద్రకి క్షమాపణ చెప్పిన దేవయాని.. నేనే రిషి అంటూ మళ్లీ షాకిచ్చిన రంగా!

మను తండ్రి మహేంద్ర అని తెలుసుకొని షాక్ అవుతారు శైలేంద్ర, దేవయాని.మరోవైపు వసుధార రంగా ని పట్టుకొని రిషి సార్ అంటూ వాళ్ళ ఇంట్లో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. శైలేంద్రని ఎండి ని చేయమని భర్తని అడుగుతుంది దేవయాని. రంగాని రిషి సార్ అని పదేపదే పిలుస్తున్న వసుధారపై కోప్పడుతుంది సరోజ. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 21వ తేదీ ఎపిసోడ్ 1107 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

తనకోసం భోజనం తీసుకువచ్చిన రంగాతో మీరు రిషి సార్ అని నాకు తెలుసు కానీ ఎందుకు రంగా లా ఉంటున్నారో నాకు అర్థం కావడం లేదు,మావయ్య మీకోసం ఎంత కంగారు పడుతున్నారో తెలుసా అంటుంది వసుధార. మీ మాటలు వింటుంటే మీరు రిషి సార్ ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది కానీ నేను మీ రిషి సార్ ని కాదు రాంగా ని మీ రిషి సార్ త్వరలోనే దొరకాలని కోరుకుంటున్నాను అంటాడు రంగా. ఈ మాటలు అన్ని వింటున్నా సరోజ బావ కరెక్ట్ గానే ఉన్నాడు కానీ తనే కరెక్ట్ గా లేదు అని వసుధార గురించి అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Guppedanta Manasu June 21st 2024 Episode number 1107

ఇవన్నీ పక్కన పెట్టండి ముందు భోజనం చేయండి అంటాడు రంగా మీరు తినిపిస్తే తింటాను అంటుంది వసుధార. మీరు భోజనం చేయకపోతే నేనూ భోజనం చేయను, మా ఇంటికి వచ్చిన అతిధి ఆకలితో ఉంటే నేను బాధపడతాను అంటాడు రిషి. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని మనసులో అనుకొని భోజనం చేస్తుంది వసుధార. అప్పుడే అక్కడికి రంగా అసిస్టెంట్ వచ్చి ఈమె కోసం ఎవరో వెతుకుతున్నారు అని చెప్తాడు.

ఈ విషయం పర్సనల్గా ఉన్నప్పుడు కూడా చెప్పొచ్చు అని అతడిని మందలించి మీరు ఏమి కంగారు పడకండి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు మహేంద్ర ఇంటికి ఫణీంద్ర దంపతులు వస్తారు.ఇలాంటి సమయంలో నిన్ను ఒంటరిగా వదలటం ఇష్టం లేదు నాతో పాటు వచ్చేయ్ అంటాడు ఫణీంద్ర. నన్ను మీరు భరించలేరు నేను రాను అంటాడు మహేంద్ర. నువ్వు గతంలో జరిగింది మరచిపోలేనట్లుగా ఉంది.

Guppedanta Manasu June 21st 2024 Episode number 1107

కావాలంటే నేను క్షమాపణ చెప్తాను కానీ నువ్వు మాత్రం వచ్చేయ్ అంటుంది దేవయాని. నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటాడు మహేంద్ర. సరే నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండు కానీ నువ్వు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి అని చెప్పి బయలుదేరుతాడు ఫణింద్ర. మీరు వెళ్ళండి నేను మహేంద్ర కి ఇష్టమైన వంట చేసి వస్తాను అంటుంది దేవయాని. నువ్వు వాడిని సూటిపోటి మాటలతో బాధపెట్టవద్దు అని హెచ్చరించి వెళ్లిపోతాడు ఫణీంద్ర. సరే అంటూ దేవయాని కిచెన్ లోకి వెళ్తుంది.

అక్కడ పని చేసుకుంటున్న అనుపమతో నువ్వు చాలా తెలివైన దానివి అందరినీ తెలివిగా పక్కకు తప్పించి నీ కొడుకుని ఎండి సీట్ లో కూర్చోబెట్టడానికి బాగానే ప్లాన్ చేశావు అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర మీరు వంట చేస్తాను అన్నప్పుడే నాకు అర్థమైంది ఏదో గొడవ చేస్తారని అంటాడు. నేనేమీ గొడవ చేయటం లేదు కానీ ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు, అసలు ఈ అనుపమకి నీకు ఉన్న సంబంధం ఏమిటి..

Guppedanta Manasu June 21st 2024 Episode number 1107

ఒంటరిగా ఉన్న నీ ఇంట్లో తను ఎందుకు ఉంది? ఈ ప్రశ్నకి సమాధానం నాకైతే ఏదో ఒకటి చెప్తావు కానీ బయట వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తావో ఆలోచించి పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది దేవయాని. మరోవైపు వసుధార గదిలోకి వస్తాడు రంగా. నేను నీ రిషి సార్ ని కొన్ని కారణాల వలన ఇక్కడ రంగా గా నటిస్తున్నాను అంటాడు. ఆ మాటలకి ఆనందపడుతుంది వసుధార. మీరు చనిపోయారని అందరూ అన్నారు కానీ నేను నమ్మలేదు అంటుంది.

మన ఇద్దరిదీ రిషిధారల బంధం ఆగితే రెండు గుండెలు కలిసి ఆగిపోతాయి లేదంటే రెండు గుండెలు కలిసి కొట్టుకుంటాయి అంటాడు రిషి.తర్వాత డాడీ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. మీకోసమే బెంగ పెట్టుకున్నారు నాకు ఆయనని చూడాలనిపిస్తుంది ఇప్పుడే వెళ్దాం పద అంటాడు రిషి. పదండి సర్ అంటూ ఆనందంగా అతని చెయ్యి పట్టుకుని బయలుదేరుతుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X