Guppedanta Manasu June 22nd episode: రిషి అదృష్టవంతుడంటున్న రంగా.. శైలేంద్ర ప్లాన్ తిప్పి కొట్టిన మను!

మను తండ్రి మహేంద్ర అని తెలుసుకొని షాక్ అవుతారు శైలేంద్ర, దేవయాని. మరోవైపు వసుధార రంగాని పట్టుకొని రిషి సార్ అంటూ వాళ్ళ ఇంట్లో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. శైలేంద్రని ఎండి ని చేయమని భర్తని అడుగుతుంది దేవయాని. రంగాని రిషి సార్ అని పదేపదే పిలుస్తున్న వసుధారపై కోప్పడుతుంది సరోజ. మరోవైపు వసుధార దగ్గరికి వచ్చిన రంగ నేనే రిషి సార్ ని, డాడ్ ని చూడాలని ఉంది ఇంటికి వెళ్దాం పద అంటాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 22వ తేదీ ఎపిసోడ్ 1108 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

వసుధార దగ్గరికి వచ్చిన రంగా నేనే నీ రిషి సార్ ని, కొన్ని కారణాలవల్ల ఇక్కడ రంగా గా ఉండవలసి వచ్చింది అని చెప్తాడు. డాడీ ఎలా ఉన్నారు చూడాలని ఉంది ఇప్పుడే వెళ్దాం పద అంటాడు, ఆ మాటలకి ఆనందపడిపోయిన వసుధార రండి సార్ అంటూ రిషి చేయి పట్టుకుని నడుస్తుంది. అంతలో ఫ్లవర్ వేజ్ కింద పడిపోవటంతో ఇంట్లో అందరూ మేల్కొంటారు. స్పృహలోకి వచ్చిన వసుధార తన చేతిలో రిషి చెయ్యి లేకపోవడం చూసి షాక్ అవుతుంది.

Guppedanta Manasu June 22nd 2224 Episode number 1108

కలగన్నానా అనుకుంటుంది, అప్పుడే అక్కడికి వచ్చిన రాధమ్మ ఏమైనా కలగన్నావా అంటూ ఆమెని తీసుకొని వెళ్లి పడుకోబెడుతుంది. మళ్లీ రంగా దగ్గరికి వచ్చి పదేపదే రిషి సార్ అంటుంది అంటే ఆమె అతన్ని ఎంతగా ప్రేమిస్తుందో అర్థం అవుతుంది అంటుంది. అవును నానమ్మ నిజంగా ఆ రిషి సార్ చాలా అదృష్టవంతుడు ఇంతగా ప్రేమించే భార్య దొరికింది అంటాడు రంగా. అంతగా ఎమోషనల్ అవుతున్నావ్ కొంపదీసి నువ్వే ఆ రిషి సర్ వా అని అడుగుతాడు రంగా అసిస్టెంట్. నేను రంగానే, ఈ రాధమ్మ మనవడిని అని నవ్వుతాడు రంగా. మరోవైపు ఏంజెల్ మనుకి ఫోన్ చేసి నిన్ను కలవాలి ఒకసారి రండి అంటుంది.

కోప్పడిన మను ఈ టైం లో నేను అంత దూరం రాలేను నువ్వు కూడా రాలేవు అంటాడు. మీరు ఎక్కువ దూరం రావక్కర్లేదు మీ ఇంటి బయటే ఉన్నాను అంటుంది ఏంజెల్. బయటికి వెళ్లి చూసేసరికి అక్కడ ఏంజెల్ ఉంటుంది. ఈ టైం లో వచ్చావ్ ఏంటి అంటాడు మను. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది నువ్వు కూడా నాతో రా అని అంటుంది. నాకేమైనా పని లేదు అనుకున్నావా నేను రాను అంటాడు మను. ఎలా రావో నేను చూస్తాను అంటూ అనుపమ ని పిలుస్తుంది ఏంజెల్. ఈ టైంలో ఆవిడ ఎందుకు డిస్టర్బ్ చేస్తావు వస్తాను పదా అంటూ ఏంజెల్ తో బయలుదేరుతాడు మను.

Guppedanta Manasu June 22nd 2224 Episode number 1108

తర్వాత ఐస్ క్రీమ్ తింటూ తన పెళ్లి ప్రస్తావన తీసుకువస్తూ రిషి ని తను చేసుకోవాలనుకున్న సంగతి, తర్వాత క్యాన్సిల్ అయిన సంగతి అంతా చెప్తుంది ఏంజెల్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతాడు మను. మొద్దు, నేను ఎందుకు చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదా ఒంటరిగా ఉన్నప్పుడు తీరిగ్గా కూర్చొని ఆలోచించు అప్పుడు నీకే అర్థమవుతుంది అంటుంది ఏంజెల్. చిన్నగా నవ్వుకుంటాడు మను. మరోవైపు కొందరు స్టూడెంట్స్ మాకు న్యాయం కావాలి అంటూ ఆఫీస్ రూమ్ దగ్గరికి వస్తారు. ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతాడు మహేంద్ర.

మాకు శైలేంద్ర సార్ ఎండిగా కావాలి అంటారు వాళ్లు. వీళ్ళు కాలేజీ స్టూడెంట్స్ కాదు శైలేంద్ర అరేంజ్ చేసినట్లు ఉన్నాడు అనుకుంటాడు మహేంద్ర. అప్పుడే శైలేంద్ర అక్కడికి వచ్చి స్టూడెంట్స్ ని సముదాయించేలాగా మాట్లాడుతాడు. ఇదంతా వెనకనుంచి మను గమనిస్తూ ఉంటాడు. ఒక స్టూడెంట్ ని వెనక్కి రప్పించి మీరు ఇలా చేయటానికి శైలేంద్ర సార్ ఎంత ఇచ్చారు, వాళ్ళకి 500 ఇచ్చారు నీకు ఎంత ఇచ్చారు అని అడుగుతాడు. నాకు 200 ఇచ్చారు అంటాడు ఆ స్టూడెంట్.

Guppedanta Manasu June 22nd 2224 Episode number 1108

అప్పుడు ఆ స్టూడెంట్ ఆవేశంగా వీడు మోసగాడిలాగా ఉన్నాడు కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ డబ్బు ఇచ్చాడు అని అక్కడ ఉన్న గ్యాంగ్ ని తీసుకుని శైలేంద్రని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అనుకోని పరిణామానికి షాక్ అవుతాడు శైలేంద్ర. ఎంతగా దిగజారి పోయావు ఈ విషయం ఇప్పుడే మీ నాన్నతో చెప్తాను అంటాడు మహేంద్ర. చెప్పొద్దు, నిజం తెలిస్తే మా నాన్న కొడతారు అంటాడు శైలేంద్ర. శైలేంద్రని అసహ్యించుకొని అక్కడినుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. మరోవైపు ఏంజెల్ మను క్యాబిన్ కి వచ్చి మనం బయటికి వెళ్దాం పద అని అడుగుతుంది.

పని ఉంది రాను అంటాడు మను. ఎలా రావో నేను చూస్తాను అంటూ అతని చెయ్యి పట్టుకుని బలవంతంగా లాగుతుంది ఏంజెల్. అప్పుడే అక్కడికి వచ్చిన శైలేంద్ర ఇక్కడ ఏం జరుగుతుంది అని వంకరగా మాట్లాడుతాడు. ఏమి జరగడం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అంటాడు మను. నా తాత కట్టించిన కాలేజీలోకి అడ్డంగా వచ్చింది నువ్వు, నన్ను వెళ్లిపోమంటావేంటి అని కోప్పడతాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X