Guppedanta Manasu June 24 th episode: శైలేంద్రని ముష్టివాడంటున్న ఏంజెల్.. ఇరువురి భామల మధ్య నలిగిపోతున్న రంగా!

వసుధార రంగాని పట్టుకొని రిషి సార్ అంటూ వాళ్ళ ఇంట్లో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. శైలేంద్రని ఎండి ని చేయమని భర్తని అడుగుతుంది దేవయాని. రంగాని రిషి సార్ అని పదేపదే పిలుస్తున్న వసుధారపై కోప్పడుతుంది సరోజ. మరోవైపు వసుధార దగ్గరికి వచ్చిన రంగ నేనే రిషి సార్ ని, డాడ్ ని చూడాలని ఉంది ఇంటికి వెళ్దాం పద అంటాడు. కానీ అదంతా తన కల అని తరువాత అర్థం చేసుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 24వ తేదీ ఎపిసోడ్ 1109 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నా కాలేజీకి వచ్చి నన్నే బయటికి పొమ్మంటావా అని మను పై సీరియస్ అవుతాడు శైలేంద్ర. ఏమిటో ఈ కాలేజీ అనాధలు అందరికీ ఆశ్రయం ఇస్తుంది ఎవరెవరో వచ్చి ఈ సీట్లో కూర్చుంటున్నారు అని వెటకారంగా మాట్లాడుతాడు శైలేంద్ర. ఎవరు అనాధలు అని కోపంగా అడుగుతాడు మను. తండ్రి ఎవరో తెలియని వాళ్ళని అనాధలనే అంటారు అంటాడు శైలేంద్ర. ఆ మాటలకి కోపంతో అతనిపై చేయి ఎత్తుతాడు మను. కానీ వెంటనే దించేస్తాడు. కానీ పక్కనే ఉన్న ఏంజెల్ మాత్రం ఊరుకోదు. మళ్ళీ మను తండ్రి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తుంది.

Guppedanta Manasu June 24th 2424 Episode number 1109 Here is the Full story

అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు వీడితో నీకేంటి సంబంధం అని అడుగుతాడు శైలేంద్ర. అతను నా బావ, అతనితో మాట్లాడటానికే ఇక్కడికి వచ్చాను అంటుంది ఏంజెల్, మీ బావ మరదళ్ల సరసాలు కాలేజీ బయట పెట్టుకోండి ఇక్కడ కాదు అంటాడు శైలేంద్ర. ఎక్కడ ఏం పెట్టుకోవాలి మాకు తెలుసు అంటాడు మను. సరే నేను మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అందుకు బదులుగా నువ్వు నాకు ఎండి సీటు ఇచ్చేయ్ అంటాడు శైలేంద్ర.

మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని నీకు చెప్పామా అంటుంది ఏంజెల్. నేను మిమ్మల్ని గమనిస్తున్నాను మీరు ఎప్పటినుంచో కలిసి తిరుగుతున్నారు అందుకే చెప్తున్నాను మీ పెళ్లి చేస్తాను నాకు ఆ ఎండి సీటు ఇచ్చేయండి అని అంటాడు శైలేంద్ర. ఈ కాలేజీలో ముష్టి వాళ్ళు ఎక్కువైపోయారు లేదంటున్నా మళ్లీ మళ్లీ అడుక్కుంటున్నారు అంటూ శైలేంద్రని అసహ్యించుకొని వెళ్ళిపోతుంది ఏంజెల్.

ఆ వెనకే మను కూడా వెళ్ళిపోతాడు. మరోవైపు రంగా ని ఆటోలో బయటకు తీసుకువెళ్లి ఊరంతా చూపించమంటుంది వసుధార. అప్పుడే అక్కడికి వచ్చిన సరోజ మా ఊర్లో చూడ్డానికి ఏమీ లేవు అంటుంది. మీ ఊరు మీకు చూడాలనిపించదు కానీ మాలాంటి వాళ్ళకి చూడాలనిపిస్తుంది తీసుకువెళ్లండి అని రిక్వెస్ట్ చేస్తుంది వసుధార. తీసుకెళ్లొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది సరోజ.

Guppedanta Manasu June 24th 2424 Episode number 1109 Here is the Full story

వాళ్ళిద్దరి మధ్య నలిగిపోతుంటాడు రంగా కానీ చాలాసేపటి నుంచి మేడంగారు బ్రతిమిలాడుతున్నారు తీసుకు వెళ్తాను అంటాడు. సరోజ నేను కూడా వస్తాను అంటుంది. అందుకు వసుధార ఒప్పుకోదు. అయినా వాళ్లతో పాటు బయలుదేరుతుంది సరోజ. ఆటోలో కూర్చున్న వసుధార ఊరు చూడటం మానేసి రంగానే చూస్తూ కూర్చుంటుంది. అది గమనించిన సరోజ వసుధార ని తిట్టుకుంటుంది, ఊరు చూడండి అని గట్టిగా చెప్తుంది.

రంగా కూడా మీరు అలా చూడటం నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తాడు అయినా వసుధార పట్టించుకోకుండా రిషినే చూస్తూ కూర్చుంటుంది. అప్పుడు సరోజ దారిలో ఆటో దిగిపోతుంది, ఎందుకు దిగిపోయావు అని అడుగుతాడు రంగా. నేను ఈ జర్నీ చేయలేను అంటుంది సరోజ. ఊరికి చాలా దూరం వచ్చేసాము ఇప్పుడు నడుచుకొని ఎలా వెళ్తావు రమ్మని అడుగుతాడు రంగా కానీ సరోజ వినిపించుకోకపోవడంతో నీ కర్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు

అప్పుడే పాండు గ్యాంగ్ అక్కడికి వచ్చి సరోజకి వసుధార ఫోటో చూపించి ఈమె నీకు తెలుసా అని అడుగుతాడు. తెలుసు అంటుంది సరోజ. ఆ వసుధర నాకు శత్రువు, ఎలా అయినా వీళ్ళు తనని తీసుకు వెళ్ళిపోతే నాకు అంతే చాలు అనుకొని వసుధార ని చూపించడానికి వాళ్లతో పాటు వెళుతుంది. మరోవైపు ఆటోలో వెళ్తున్న వసుధారకి కొబ్బరి బొండాలు కనిపించడంతో తాగుదాం అని రంగాని అడుగుతుంది. సరే అని రంగ ఆటో ఆపుతాడు.

Guppedanta Manasu June 24th 2424 Episode number 1109 Here is the Full story

వసుధార రెండు కొబ్బరి బొండాలు తీసుకొని వద్దంటున్నా రంగాకి ఒకటి ఇచ్చి మరొకటి తను తాగుతుంది. కొబ్బరి బొండం గురించి, దాని పోషకాల గురించి లొడలోడా చెప్తూ ఉంటుంది వసుధార. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అని మీ రిషి సార్ ఉంటే అని ఉండేవారు, అతను ఏమిటి మీ గోల వింటే ఎవరైనా అలా అనాల్సిందే. మీ నుంచి దూరమైన ఆ రిషి సార్ ఎంతో అదృష్టవంతుడు, ఆయనకి ఒక పెద్ద నమస్కారం ఇన్నాళ్లు మిమ్మల్ని భరించినందుకు అంటాడు రంగా. ఆ మాటలకి కన్నీరు పెట్టుకుంటుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X