Guppedanta Manasu June 25th Episode: రంగా ని చూసి షాకైన పాండు.. సరోజ తో ఛాలెంజ్ చేసిన వసుధార!

శైలేంద్రని ఎండి ని చేయమని భర్తని అడుగుతుంది దేవయాని. రంగాని రిషి సార్ అని పదేపదే పిలుస్తున్న వసుధారపై కోప్పడుతుంది సరోజ. మరోవైపు వసుధార దగ్గరికి వచ్చిన రంగ నేనే రిషి సార్ ని, డాడ్ ని చూడాలని ఉంది ఇంటికి వెళ్దాం పద అంటాడు. కానీ అదంతా తన కల అని తరువాత అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత రంగా ని ఊరంతా చూపించమని అడుగుతుంది వసుధార.ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 25వ తేదీ ఎపిసోడ్ 1110 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

కొబ్బరి బోండం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వసుధారపై కోప్పడతాడు రంగా. ఆ మాటలకి కన్నీరు పెట్టుకున్న వసుధార ని మళ్లీ తానే ఓదారుస్తాడు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి రంగాని పలకరిస్తాడు. అతనితో మాట్లాడుతున్న రంగాకి ఏదో ఫోన్ రావటంతో పక్కకి వెళ్తాడు. అప్పుడు వసుధార ఆ వ్యక్తి దగ్గర ఎంక్వయిరీ చేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న రంగా వసుధారపై కోప్పడతాడు.

Guppedanta Manasu June 25th 2525 Episode number 1110 Here is the Full story

నేను రంగాని అని చెప్తున్నా కూడా మీరు ఎంక్వైరీ చేస్తున్నారంటే అర్థమేంటి, నేను వెళ్తున్నాను మీరు అందర్నీ నా గురించి ఎంక్వయిరీ చేసుకుంటూ రండి అని వసుధారని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు రంగా. అప్పుడే అటుగా వస్తున్న మరొక ఆవిడని కూడా రంగా గురించి ఎంక్వయిరీ చేస్తుంది వసుధార. ఆవిడ కూడా రంగా చాలా సంవత్సరాల నుంచి తెలుసు అంటుంది.ఇంతలోనే సరోజ పాండు వాళ్ళకి వసుధారని చూపిస్తుంది.

వాళ్లు వసుధారని వెంబడిస్తూ ఉంటే రంగా వచ్చి వసుధార ని ఆటో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ క్రమంలో ఒక రౌడీ రంగా ఫోటో తీస్తాడు. మరోవైపు ఇంట్లో ఉన్న సరోజ ఆ వసుధార ని రౌడీలు తీసుకుపోయి ఉంటారు అనుకుంటుంది కానీ వసుధార తో సహా వచ్చిన రంగా సరోజ ని కోప్పడతాడు, ఎందుకు మేడం గారిని వాళ్ళకి చూపించావు, నేను ఈ అమ్మాయిని కాపాడి తీసుకు వస్తే, నువ్వు నన్ను వాళ్ళకి అప్పగిస్తావా అంటూ చివాట్లు పెడతాడు.

Guppedanta Manasu June 25th 2525 Episode number 1110 Here is the Full story

నేను అప్పగించలేదు అంటుంది సరోజ. నేను చూశాను అంటాడు రంగా. నేనేదో తప్పు చేసినట్లు నా మీద కేకలు వేస్తున్నావ్ ఏంటి అంటుంది సరోజ. నువ్వు చేసింది తప్పే, తను మన ఇంటి అతిధి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంది రాధమ్మ. మేడమ్ గారికి వీలైతే సాయం చెయ్యు అంతేగాని ఆమెను చూసి అసూయ పడకు మళ్లీ ఇలాంటి పని చెయ్యొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రంగా.

రాధమ్మ వసుధారతో మాట్లాడుతూ నువ్వు ఏదో సమస్యలో ఉన్నావు, సమస్య తీరాకే ఇక్కడినుంచి వెళ్ళు అంటుంది. మరోవైపు మళ్లీ వసుధార తప్పించుకోవటం పట్ల ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు పాండు. ఇదే విషయంగా తన గ్యాంగ్ పై కోప్పడతాడు. ఆ అమ్మాయి అన్ని సార్లు తప్పించుకోవటానికి కారణం ఆటో వాడే అన్న అంటారు రౌడీలందరు. ఎవడ్రా వాడు అంటాడు పాండు.

Guppedanta Manasu June 25th 2525 Episode number 1110 Here is the Full story

నేను ఫోటో తీశాను అని ఫోటో చూపిస్తాడు రౌడీ. రంగా ఫోటో చూసిన పాండు షాక్ అవుతాడు, వీడు చచ్చిపోయాడు కదా, వాడు వీడేనా అని కన్ఫ్యూజ్ అవుతాడు. ఎవరన్నా వాడు అంటారు రౌడీలు. వీడే ఈ కథకి హీరో రిషీంద్ర భూషణ్ అని చెప్తాడు పాండు. మరోవైపు ఒంటరిగా ఉన్న వసుధార దగ్గరికి వచ్చి అసలు నువ్వు నా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు మర్యాదగా నువ్వు ఇక నుంచి వెళ్ళిపో లేదంటే నేనే మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తాను అంటుంది సరోజ.

నేను ఇక్కడి నుంచి వెళ్తే నా రిషి సార్ ని తీసుకొనే వెళ్తాను, అంతవరకు ఇక్కడ నుంచి వెళ్ళను అంటుంది వసుధార. అతను మీ రిషి సార్ కాదు నా రంగా బావ, ఆ విషయం మా రంగా బావే చెప్తున్నాడు కదా అంటుంది సరోజ. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను, ఆయన రిషి సారే. ఇదే విషయం 15 రోజులలో ఆయన తోనే చెప్పిస్తాను. అప్పుడే ఆయనని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని సరోజతో ఛాలెంజ్ చేస్తుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X