Guppedanta Manasu:ఏంజెల్ పై ఫైర్ అయిన మను..కాలేజీ గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటుందంటూ షాకిచ్చిన మినిస్టర్!

వసుధార దగ్గరికి వచ్చిన రంగా నేనే రిషి సార్ ని, డాడ్ ని చూడాలని ఉంది ఇంటికి వెళ్దాం పద అంటాడు. కానీ అదంతా తన కల అని తరువాత అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత రంగా ని ఊరంతా చూపించమని అడుగుతుంది వసుధార. వసుధార ప్రవర్తనకి ఇబ్బంది పడుతున్న సరోజ వసుధారని పాండు వాళ్లకి చూపిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 26వ తేదీ ఎపిసోడ్ 1,111 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

15 రోజుల్లో మీ బావ తోనే నేనే రిషి సార్ ని అని ఒప్పించి ఆయనని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని సరోజతో ఛాలెంజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఈమె ఏంటి ఇంత కాన్ఫిడెన్స్ గా ఉంది నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది సరోజ.మరోవైపు ఏంజెల్ అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర తనని తానే బెల్ట్ తో కొట్టుకుంటూ ఉంటాడు.

Guppedanta Manasu June 26th 2024 Episode number 1111 Here is the Full story

అందరికీ లోకువ అయిపోయాను, అందరూ నన్ను అనేవాళ్లే విలన్ అని చెప్పుకొని తిరగటం కాదు వాళ్ళ గుండెలు పగిలేలాగా ఏమైనా చేయాలి అనుకుంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన ధరణి అతనిని ఆపి ఎందుకు అలా ఒళ్ళు హింసించుకుంటున్నారు అని అడుగుతుంది. నువ్వు అన్నట్లు నాకు ఎండి సీటు దక్కదేమో, ఇన్నాళ్లు ఆ వసుధార ఎండీగా ఉండేది.

Guppedanta Manasu June 26th 2024 Episode number 1111 Here is the Full story

ఇప్పుడు తను వెళ్ళిపోయింది అనుకుంటే ఆ మను గాడు నాకు పోటీగా తయారయ్యాడు అంటాడు శైలేంద్ర. మీరు ఎండి అవ్వటం అనేది జరగని పని, మీ పని అయ్యాక పిలిస్తే వచ్చి ఒంటికి వెన్నపూస్తాను అని వెటకారంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి. మరోవైపు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని మనుని అడుగుతుంది ఏంజెల్.నాకు అంత తీరిక లేదు అంటాడు మను.

ఎవరికి తీరిక ఉండదు ఎవరి పనులు వారికి ఉంటాయి అయినా ప్రేమించడం మానేస్తారా అని అడుగుతుంది ఏంజెల్. మాటలలో మను తండ్రి ప్రస్తావన వస్తుంది. ముందు నువ్వు నీ తండ్రి ని ప్రేమించు అప్పుడు మనస్ఫూర్తిగా కలవాలి అని కోరుకో తప్పకుండా కలుస్తావు అంటుంది ఏంజెల్. అందరూ నాకు సలహా ఇచ్చే వాళ్లే, నన్ను అర్థం చేసుకునేవాళ్లు మాత్రం లేరు అంటూ ఏంజెల్ మీద ఫైర్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మను.

Guppedanta Manasu June 26th 2024 Episode number 1111 Here is the Full story

మరోవైపు రంగా కోసం చేపల పులుసు తీసుకొని వస్తుంది సరోజ. అప్పటికే భోజనాలు ప్రారంభిస్తారు రంగా వాళ్ళు. అప్పుడే భోజనాలు ప్రారంభించేసారేంటి,నీకోసం చేపల పులుసు తెచ్చాను వడ్డించుకో అంటుంది సరోజ. ఆయన ఇప్పుడే చారు వేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు చేపల పులుసు ఎలా తింటారు అంటు రిషికి చారు వడ్డిస్తుంది వసుధార. చారు టేస్ట్ చేసిన రిషి ఈ చారు నువ్వు చేయలేదు కదా నానమ్మ, చారు ఇలా చేస్తే నాకు నచ్చదని నీకు తెలుసు కదా అంటాడు.

ఈరోజు వంట నేను చేస్తాను అని ఆ అమ్మాయి అన్నది, వద్దంటున్నా వినిపించుకోకుండా వంట అంతా తనే చేసింది అంటుంది రాధమ్మ. ఇంటికి వచ్చిన వాళ్లతో పనులు చేయించొద్దు వాళ్లు ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు అని రాధమ్మని మందలిస్తాడు రంగా. భోజనం దగ్గర నుంచి లేచిపోబోతుంటే సరోజ చేపల పులుసుతో భోజనం వడ్డిస్తుంది. భోజనాల తర్వాత చేతులు కడుక్కుంటున్న రిషి దగ్గరికి వచ్చిన వసుధార మీకు నచ్చలేని విధంగా వంట చేసినందుకు క్షమించండి అంటుంది.

Guppedanta Manasu June 26th 2024 Episode number 1111 Here is the Full story

నాకు నచ్చనిది మీరు చేసిన చారు కాదు, మీరు వంట చేయడమే నచ్చలేదు. ఈరోజు ఈ పని చేస్తారు రేపు ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి. మీరు ఎక్కువగా ఆశలు పెంచుకుంటున్నారు,అలా చేయకండి.కొన్ని రోజుల తర్వాత మీరు ఎవరో మేమెవరో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రంగా. మరోవైపు బోర్డు మీటింగ్ లో ఉన్న మినిస్టర్ ఈ కాలేజీకి ఎండిగా ఎవరు కావాలో మీరు చర్చించుకుని నాకు చెప్పండి అంటాడు.

ఒకరు శైలేంద్ర ఎండి కావాలంటే మరొకరు మను ఎండి కావాలి అని అడుగుతారు. మీ ఆలోచనలలో క్లారిటీ లేదు ఒక వారం రోజులు గొడవ ఇస్తున్నాను ఆ లోగా మీ నిర్ణయం చెప్పండి లేదంటే ఈ కాలేజీ ని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటుంది అంటాడు మినిస్టర్. కంగారుపడిన శైలేంద్ర ఇది మా తాతగారు కట్టించిన కాలేజీ అప్పటినుంచి మా వంశం వాళ్లే ఎండిగా ఉంటూ వస్తున్నారు, ఇప్పుడు మిగిలింది నేనే కాబట్టి నేనే ఎండిగా ఉంటాను అంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X