Guppedanta Manasu June 27 th episode: వసుధార ని బలవంతంగా లాక్కుపోయిన రంగా.. శైలేంద్ర కి గుడ్ లక్ చెప్పిన మను!

రంగా ని ఊరంతా చూపించమని అడుగుతుంది వసుధార. వసుధార ప్రవర్తనకి ఇబ్బంది పడుతున్న సరోజ వసుధారని పాండు వాళ్లకి చూపిస్తుంది. అయితే రంగా వాళ్ళ నుంచి వసుధారని రక్షిస్తాడు. 15 రోజుల్లో ఆయనే రిషి సార్ అని ఒప్పించి ఆయనని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతానని సరోజతో ఛాలెంజ్ చేస్తుంది వసుధార.ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 27వ తేదీ ఎపిసోడ్ 1,112 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

మా తాతయ్య స్థాపించిన కాలేజీలో మా కుటుంబం వాళ్లే ఎండి గా ఉంటూ వచ్చారు, ఇప్పుడు నేను ఎండి గా ఉంటాను అంటాడు శైలేంద్ర. అందుకు మేము ఒప్పుకోవాలి కదా అంటాడు మను ని సపోర్ట్ చేస్తున్న డైరెక్టర్. చూసావా నువ్వు ఎండి అవుతాను అంటే చాలామంది అబ్జెక్ట్ చేస్తున్నారు, రేపటి రోజున నువ్వు ఎండి అయ్యాక ఏం చేసినా వాళ్ళు అబ్జెక్షన్ పెడుతూనే ఉంటారు. అప్పుడు ఈ కాలేజీ ముందుకు సాగదు అందుకే మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అంటున్నాము అంటాడు మినిస్టర్. వేరే ఆప్షన్ లేదా అంటాడు శైలేంద్ర. రిషి వసుధార ని ఎండిగా చేసి వెళ్ళిపోయాడు.

Guppedanta Manasu June 27th 2024 Episode number 1112 Here is the Full story

నువ్వు ఎండి అవ్వాలంటే వసుధార రావాలి అంటాడు మినిస్టర్. అది ఎలా కుదురుతుంది అంటాడు శైలేంద్ర. అందుకే మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ లోగా మీరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మినిస్టర్. మరోవైపు వసుధార కనిపించకపోవడంతో కంగారుపడతాడు రంగా, ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళకి కూడా తెలియదు అని చెప్తారు. నిన్న మనం అన్న మాటలకి బాధపడి ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అని సరోజతో చెప్పి వసుధారని వెతకటానికి బయలుదేరుతాడు రంగా. దారిలో టీ తాగుతూ కనిపించిన వసుధార ని చూసి కోపంతో ఆమెపై చెయ్యెత్తుతాడు.

Guppedanta Manasu June 27th 2024 Episode number 1112 Here is the Full story

అలా చెప్పా పెట్టకుండా వచ్చేయడం ఏంటి అని వసుధార పై కేకలు వేస్తాడు. టీ తాగాలనిపించింది అందుకే వచ్చాను అంటుంది వసుధార. మీ కోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా అని రంగా అంటే నాకోసం కంగారు పడ్డారా అంటూ ఆనందపడుతుంది వసుధార. ఇంటికి వెళ్దాం పదండి అంటాడు రంగా. మీరు రిషి సార్ అని ఒప్పుకుంటేనే ఇంటికి వస్తాను అంటుంది వసుధార.

మీరు ఎక్కడా తగ్గరా, నేను రిషి సార్ ని కాదంటే వినిపించుకోరేంటి అంటాడు. మీ విషయంలో నేను ఎక్కడా తగ్గను అంటుంది వసుధార. ఆమెని బలవంతంగా చేయి పట్టుకొని లాక్కొని ఆటోలో కూర్చోబెడతాడు రంగా. మీరు రిషి సార్ అని మీ స్పర్సే చెప్తుంది అని ఆనందంగా ఆటోలో కూర్చుంటుంది వసుధార. మరోవైపు మను మినిస్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్పినట్లే మాట్లాడారు థాంక్స్ అంటాడు మను.

Guppedanta Manasu June 27th 2024 Episode number 1112 Here is the Full story

లేకపోతే ఈ కాలేజీ దుర్మార్గుల చేతికి వెళ్ళిపోతుంది అన్నావు కదా అందుకే అలా మాట్లాడాను, నాకు ఈ కాలేజీ అంటే చాలా ఇష్టం. రిషి, వసుధారలు చేసిన ప్రాజెక్టులు ప్రజలకి చాలా ఉపయోగపడ్డాయి, అలాంటి ఈ కాలేజీ పతనమైపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు మినిస్టర్. ఈ మాటలు విన్న శైలేంద్ర మను దగ్గరికి వచ్చి ఆ మినిస్టర్ గాడు అలా మాట్లాడటానికి కారణం నువ్వేనా అంటాడు. అవును అంటాడు మను.

నువ్వు నా దారికి అడ్డు వస్తున్నావు శత్రు శేషం ఉంచుకోను నిన్ను కూడా నా దారికి అడ్డు తప్పిస్తాను అంటాడు శైలేంద్ర. అతనికి గుడ్ లక్ చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు మను. అప్పుడు శైలేంద్ర పాండు కి ఫోన్ చేసి మనుని లేపేయమని చెప్తాడు. నేను ఒకసారి అటాక్ చేసిన వాడిని మళ్లీ అటాక్ చేయను ఎందుకంటే వాడికి భూమి మీద నూకలు ఉన్నాయి అందుకే తప్పించుకున్నాడు. మీరు కావాలంటే వేరే రౌడీలని మాట్లాడుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పాండు.

అతనిపై కోపంతో రగిలిపోతాడు శైలేంద్ర. మరోవైపు చెప్పకుండా ఎందుకు వెళ్ళావమ్మ, మేమంతా ఎంత కంగారు పడ్డమో తెలుసా అని వసుధార తో అంటుంది రాధమ్మ. గతం వెంటాడుతుంటే ఒంటరిగా ఉండాలనిపించింది అందుకే వెళ్లాను అంటుంది వసుధార. అసలు ఏమిటి నీ గతం అని అడుగుతుంది రాధమ్మ. తన గతం గురించి చెప్పడం ప్రారంభిస్తుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X