Guppedanta Manasu June 29th episode: అనుపమకు మహేంద్ర వార్నింగ్.. శైలేంద్ర ప్లాన్ తిప్పి కొట్టిన మను!
15 రోజుల్లో ఆయనే రిషి సార్ అని ఒప్పించి ఆయనని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతానని సరోజతో ఛాలెంజ్ చేస్తుంది వసుధార. మరోవైపు మినిస్టర్ కాలేజీని హ్యాండోవర్ చేసుకుంటాను అనటంతో కంగారు పడతాడు శైలేంద్ర. మరోవైపు రంగాన్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది సరోజ. ఆ ప్రపోజల్ ని సున్నితంగా తిరస్కరిస్తాడు రంగా. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూన్ 29వ తేదీ ఎపిసోడ్ 1,114 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కాలేజీలో ఏ, ఏ బ్రాంచ్ లు ఉన్నాయో కూడా తెలియని వ్యక్తి చేతిలో కాలేజీని పెడితే స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అంతేకాదు కాలేజీ ఫాల్ డౌన్ అవుతుంది అంటుంది ధరణి. నీ భర్తని నువ్వే కించపరిచేలా మాట్లాడుతావా అంటుంది దేవయాని. ఇది నా అభిప్రాయం కాదు వసుధార అభిప్రాయం అంటుంది ధరణి. అందుకు దేవయాని ధరణిపై కోప్పడితే దేవయానిని ఫణీంద్ర కోప్పడతాడు.

వీళ్ళకి మనం ఎంత చెప్పినా చెవికెక్కదు, వీళ్లు మారరు వదిలేయ్ నీ పని నువ్వు చూసుకో అని కోడలికి చెప్తాడు ఫణీంద్ర. ధరణి వెళ్ళిపోయిన తర్వాత తల్లి వెనకాల దాక్కొని కంప్లైంట్ చేయడం కాదు నీ అంతగా నువ్వు ఏదైనా సాధించు అని కొడుకుని మందలిస్తాడు ఫణీంద్ర. మరోవైపు వడ్డీ డబ్బు లెక్కబెడుతూ ఉంటాడు రంగా.
అప్పుడే అక్కడికి వచ్చిన రాధమ్మ మీ మామ కి వడ్డీ ఇవ్వడం కోసమా అని అడుగుతుంది. అవును అంటాడు రంగా. ఏమిటో మీ మావయ్య వడ్డీ కోసం నీ చుట్టూ తిరుగుతూ ఉంటే వాడి కూతురు నిన్ను పెళ్లి చేసుకోవాలని నీ చుట్టూ తిరుగుతుంది అంటుంది రాధమ్మ. అప్పుడే వడ్డీ కోసం అక్కడికి వస్తాడు సరోజ తండ్రి సంజీవయ్య. అతని చేతిలో వడ్డీ డబ్బులు పెట్టి లెక్క చూసుకోమంటాడు రంగా.

నువ్వు కరెక్ట్ గానే ఇస్తావులే అంటూనే డబ్బు లెక్క పెట్టి లోపల పెట్టుకుంటాడు సంజీవయ్య. అంతలోనే రాధమ్మ వెళ్లి మజ్జిగ తీసుకొని వస్తుంది, సంజీవయ్య చేతికి ఇస్తూ సరోజ రంగాల పెళ్లి ప్రస్తావన తీసుకువస్తుంది. నీ కూతురు మా రంగాని ఇష్టపడుతుంది అని కూడా చెప్తుంది. అది వయసులో ఉంది, సినిమా హీరోలని సీరియల్ హీరోలని ప్రేమిస్తూనే ఉంటుంది అందుకని మనం ఏమి చూసుకోకుండా పెళ్లి చేసేస్తామా ఏమిటి..
మీకు ఈ పాత ఇల్లు, ఆ వడ్డీ కడుతున్న ఆటో తప్పితే ఏముంది అంటూ చులకనగా మాట్లాడుతాడు సంజీవయ్య. నువ్వే కాళ్లు కడిగి కన్యాదానం చేస్తానన్నా కూడా నీ కూతుర్ని పెళ్లి చేసుకోను అంటాడు రంగా. మగాడు వంటే నువ్వేరా, ఆ మాట మీదే వుండు అంటాడు సంజీవయ్య. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార ని చూసి ఈమె నేనా నువ్వు కాపాడింది, మీకే తినడానికి మెతుకు లేదు మీరు ఇంకొకరిని పోషించడం అంటూ వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోతాడు సంజీవయ్య.

పెళ్లి ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చావు అంటూ రాధమ్మ పై కోప్పడతాడు రంగా. మరోవైపు ఒంటరితనాన్ని భరించలేని మహేంద్ర తన బాధ జగతితో చెప్పుకుంటూ నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని తల గోడకేసి బాదుకుంటూ ఉంటాడు. అప్పుడే మను, అనుపమ వచ్చి మహేంద్ర ని అడ్డుకుంటారు. నేను ఈ ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడిని.
మీరు కూడా నన్ను వదిలి వెళ్లిపోండి లేదంటే మీకు కూడా ఏమైనా జరుగుతుంది అంటాడు. ఈ ప్రపంచంలో నిన్ను వదిలి వెళ్లిపోయే వాళ్లే కాదు నీ ప్రేమను పొందాల్సిన వాళ్లు కూడా ఉన్నారు అంటుంది అనుపమ. మను కూడా మహేంద్ర కి ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో బయటకు వెళ్తున్న మను పై అటాక్ చేయిస్తాడు శైలేంద్ర. ఆ రౌడీలని చితగ్గొట్టి, వాళ్లని పురమాయించింది శైలేంద్ర అని తెలుసుకొని వాళ్లని తీసుకొని శైలేంద్ర దగ్గరికి వెళ్తాడు మను.

అప్పటికే శైలేంద్ర మను పని ఫినిష్ అయిపోయి ఉంటుంది అని ఆనందపడుతూ ఉంటాడు. అంతలోనే మను ని చూసి షాక్ అవుతాడు. ఏంటి నన్ను చూసి షాక్ అవుతున్నావా, నువ్వు నన్నే కాదు నా కాలి గోటిని కూడా ఏమి చేయలేవు అంటాడు మను నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఏమీ తెలియనట్టు మాట్లాడుతాడు శైలేంద్ర. ఒక్కసారి అటు చూడు అంటూ రౌడీలని చూపిస్తాడు మను. వాళ్లని చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











