Guppedanta Manasu June 8th: కాలేజీపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన శైలేంద్ర.. వసుధారపై ఫైర్ అవుతున్న మినిస్టర్!

రిషి రీ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ప్రోమో రావడంతో సీరియల్ ఫ్యాన్స్ అందరు ఫుల్ ఖుష్ అయిపోయారు. గత కొన్ని నెలలుగా రిషిని మిస్ అయిన ఫ్యాన్స్ రిషి రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రిషి రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేయడంలో భాగంగా.. మళ్లీ రిషి కర్మకాండ అంశం తెరపైకి వచ్చింది. రిషి గురించి పేపర్లో ప్రకటన ఇస్తుంది వసుధార. ఆ నెంబర్ కి కాల్ చేసి వసుధారని ఒక ఆట ఆడుకుంటాడు శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కథ. ఇక జూన్ 8వ తేదీ ఎపిసోడ్ 1096 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఫణీంద్ర కొడుకు ని కోప్పడుతూ నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా, ఎవరికైనా ఏదైనా మంచి చేయాలనుకుంటే చెయ్యు లేదంటే మూసుకొని ఒక మూలన కూర్చో అంతేకానీ ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు అని హెచ్చరిస్తాడు. అసలు ఏం జరిగింది అని అడుగుతుంది దేవయాని. నీకు తెలియకుండానే అన్నీ జరుగుతున్నాయా? మీ ఇద్దరి వల్ల నాకు గుండెలో హోల్ పడేలాగా ఉంది.మీ ఇద్దరికీ ఎన్నిసార్లు చెప్పాలి బుద్ధిగా ఉండమని.

Guppedanta Manasu June 8th 2024 Episode number 1096 Devayani advises to shailendra not to take wrong steps

పశువుకైనా పదిసార్లు చెప్తే మారుతాయేమో కానీ మీరు మాత్రం మారడం లేదు అని కోప్పడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న ధరణితో నువ్వెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు అని అడుగుతుంది దేవయాని. మీకు కాఫీ కావాలేమో అడుగుదామని ఉన్నాను అంటుంది ధరణి. మాకు ఏమీ అక్కర్లేదు అంటుంది దేవయాని. నేనేమీ కాఫీలో విషం కలపను, పంచదార కలిపే తీసుకు వస్తాను అని వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోతుంది ధరణి.

ఆ మాటలకి కోపంతో రగిలిపోయిన శైలేంద్ర ముందు దీనిని లేపేయాలి ఇదే డాడీ కి అని చెప్తుంది అంటాడు. అసలు ఏం చేశావు అని అడుగుతుంది దేవయాని. జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర. మొన్న వాళ్ళందరూ నాతో ఆడుకుంటే నిన్న ఆ వసుధారని నేను ఒక ఆట ఆడుకున్నాను అంటాడు. ఆ మాటలకే దేవయాని ఆనందపడుతూ జాగ్రత్తగా అడుగులు వెయ్యు ఇలాంటి సమయంలో తప్పటడుగులు వెయ్యొద్దు అని కొడుక్కి జాగ్రత్తలు చెప్తుంది.

ఆ తర్వాత కాలేజీలో ఉన్న శైలేంద్ర కాలేజీ నుంచి ఎలా బయటకు పంపించాలో అని ఆలోచిస్తూ ఉంటాడో అంతలోనే అక్కడికి కాలేజీని ఇన్స్పెక్షన్ చేసే ఎగ్జామినేషన్ సెంటర్ కి పర్మిషన్ ఇవ్వచ్చు లేదో అని చెక్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. వాళ్లు ఎవరో తెలుసుకున్న శైలేంద్ర లోపల ఆనంద పడుతూ కాలేజీ గురించి తప్పుడు రిపోర్టు ఇస్తాడు. కాలేజీ గురించి ఇంతలా మాట్లాడుతున్నారు మీరు ఎవరు అని అడుగుతారు ఇన్స్పెక్టర్లు.

ఈ కాలేజీలోనే మా తమ్ముడు చదువుతున్నాడు ఇక్కడ అసలు మేనేజ్మెంట్ ఏమీ బాగోలేదు, అందుకే కంప్లైంట్ ఇద్దామని వెళ్తే మేడం చాలా కేర్ లెస్ గా మాట్లాడుతున్నారు అంటాడు. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ అలా రూడ్ గా మాట్లాడదని, ప్రతి సమస్యని సాల్వ్ చేస్తుందని బయట టాక్ ఉంది అంటారు ఇన్స్పెక్టర్లు. అప్పుడే అటుగా వెళుతున్న స్టూడెంట్ ని పిలిచి వాడికి కనుసైగ చేసి వాడి చేత కూడా కాలేజీ మీద నెగిటివ్గా రిపోర్టు ఇప్పిస్తాడు శైలేంద్ర.

శైలేంద్రకి థాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు ఇన్స్పెక్టర్లు. ఆ తర్వాత లాప్టాప్ లో పని చేసుకుంటున్న వసుధారకి కాలేజీ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టడానికి పర్మిషన్ రిజెక్ట్ చేసినట్లుగా మెయిల్ వస్తుంది. అది చూసే షాక్ అవుతుంది వసుధార. వెంటనే డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి కనుక్కుంటుంది. మేము ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాము ఇప్పుడు మేము ఏమి చేయలేము అని ఫోన్ పెట్టేస్తారు అవతలి వాళ్ళు.

అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర, మను ఏం జరిగింది అని అడుగుతారు. జరిగిందంతా చెప్తుంది వసుధార. అదేంటి మన కాలేజీ కి ఎగ్జామినేషన్ సెంటర్ గా పర్మిషన్ రిజెక్ట్ చేస్తే అది మన కాలేజీకి మాచ్చగా మిగిలిపోతుంది. ఇప్పుడే మినిస్టర్ తో మాట్లాడుతాను అంటూ మినిస్టర్ కి కాల్ చేస్తాడు మహేంద్ర. నేను కాలేజీకి వచ్చి మాట్లాడతాను, వసుధార ఇచ్చిన ప్రకటన కూడా చూశాను ఇప్పుడే మీ కాలేజీకి వస్తున్నాను అంటాడు మినిస్టర్.

ఆ తర్వాత బోర్డు మీటింగ్ లో కూర్చున్న మినిస్టర్ రిషి గురించిన ప్రకటన ఎందుకు ఇచ్చావమ్మ అని అడుగుతాడు. ఎందుకంటే రిషి సార్ బ్రతికే ఉన్నారు అంటుంది వసుధార. రిషి చనిపోయాడు కదా అని శైలేంద్ర వాళ్ళని అడుగుతాడు మినిస్టర్. వాళ్ళు రిషి చనిపోయాడు అని చెప్తారు. శైలేంద్ర అయితే వసుధార మీద మినిస్టర్ కి చాలా కంప్లైంట్స్ చెప్తాడు. అందుకు అతని మీద ఫైర్ అవుతాడు మహేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X