Guppedanta Manasu August 15th episode: కాలేజీకి కొత్త ఎండీ ఎవరు? వసుధార చేతిలో పవర్!

శైలేంద్ర ని ఎండిగా ప్రకటించిన వెంటనే రంగా ని పై లోకాలకు పంపించేయాలి అనుకుంటారు దేవయాని, శైలేంద్ర. మీ ఫ్రెండ్ ని చంపిన వాళ్లని మీ ముందు నిలబెడతాను అని అనుపమకి మాట ఇస్తాడు రిషి. మరోవైపు సిటీకి వచ్చిన సరోజ ధనరాజ్ ద్వారా రిషి ఆచూకీ తెలుసుకోవాలనుకుంటుంది. మరోవైపు శైలేంద్ర కిడ్నాప్ కి గురవుతాడు. ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియక కంగారు పడతాడు శైలేంద్ర.ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 15వ తేదీ ఎపిసోడ్ 1,155ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

తన ముసుగు తీసిన వెంటనే ఎదురుగా ఉన్న మనుని చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. నువ్వు నన్ను కిడ్నాప్ చేయడం ఏమిటి, మన మధ్య ఏవైనా గొడవలు ఉంటే అవి కాలేజీ కోసమే కదా అలాంటి కాలేజీ నే వదిలేసి వెళ్ళిపోయావు ఇక నీకు నాకు శత్రుత్వం ఏముంది, నన్ను కిడ్నాప్ చేయడానికి ఇది సరైన సమయం కాదు అంటాడు శైలేంద్ర. కానీ నాకు మాత్రం ఇదే సరైన సమయం అంటాడు మను. నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న సమయం ఇప్పుడు వచ్చింది. కావాలంటే నన్ను ఇప్పుడు వదిలేయ్ మరో గంటలో వచ్చి నేనే లొంగిపోతాను అంటాడు శైలేంద్ర.

Brahmamudi serial August 15th 2024

అయినా మను ఒప్పుకోకపోవడంతో అసలు నీకు ఏం కావాలి అని అడుగుతాడు శైలేంద్ర. నా తండ్రి ఎవరు అని అడుగుతాడు మను. వీడేంటి సడన్గా ఇలా క్వశ్చన్ చేసాడు అయినా ఇప్పుడు నిజం చెప్తే నాకే ప్రమాదం అనుకుంటూ నీ తండ్రి ఎవరో నాకు ఏం తెలుస్తుంది అంటాడు శైలేంద్ర. నీకు నిజం తెలుసు అనే విషయం నాకు తెలుసు అంటాడు మను. అవును నాకు తెలుసు అయినా నీకు చెప్పను ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు శైలేంద్ర. నువ్వు అక్కడ ఉంటేనే కదా నిన్ను ఎండిగా ప్రకటించేది, ఏం చేసుకుంటావో చేసుకో అంటావేంటి అంటాడు మను.

అలా అని ఎవరు చెప్పారు, నేను వున్నా,లేకపోయినా కూడా అక్కడ నన్నే ఎండిగా ప్రకటిస్తారు అంటాడు శైలేంద్ర. అయితే మీ నాన్నగారిని అడిగి తెలుసుకుందాం అంటాడు మను. అందుకు శైలేంద్ర కూడా ఒప్పుకోవటంతో శైలేంద్ర ఫోన్ తో ఫణీంద్ర కి ఫోన్ చేస్తాడు మను . ఇంకా రాలేదని కొడుకుని మందలిస్తాడు ఫణీంద్ర. ఎండిగా ఎవరిని ప్రకటించారు అని అడుగుతాడు శైలేంద్ర. ఇంకా లేదు, వసుధార ఎవరినో ఎండిగా ప్రకటిస్తుందట ఎవరిని ప్రకటిస్తుందో అని టెన్షన్ గా ఉంది అని చెప్పే ఫోన్ పెట్టేస్తాడు ఫణీంద్ర.

Guppedanta Manasu serial August 15th 2024 Episode of 486 Here is full story

కంగారుపడిన శైలేంద్ర నా కల ఇప్పుడు కూడా కన్నీటి పర్యంతం అయ్యేలాగా ఉంది దయచేసి నన్ను వదిలేయ్ అని బ్రతిమాలుకుంటాడు. అయితే నా తండ్రి ఎవరో చెప్పు అంటాడు మను. మా బాబాయ్ మహేంద్ర నీ తండ్రి అని చెప్తాడు శైలేంద్ర. ఆ మాటలకి షాక్ అయిన మను అబద్ధం చెప్పాడనుకొని శైలేంద్ర చెంప పగలగొడతాడు. నిజంగా నీ తండ్రి మహేంద్ర యే కావాలంటే నా దగ్గర సాక్ష్యం ఉంది అంటాడు శైలేంద్ర. అయినా అతని మాటలు నమ్మడు మను. మరోవైపు వసుధార ఎండిగా రిషి ని ప్రకటిస్తుంది. తనకి ఎండి గా ఉండడం ఇష్టం లేదని మీటింగ్ నుంచి వెళ్ళిపోతాడు రిషి.

మీటింగ్ లో ఉన్నవాళ్లు కంగారు పడితే, మీరు కంగారు పడకండి సార్ తో నేను మాట్లాడుతాను అని వసుధార కూడా రిషి వెనుక వెళ్తుంది. మరోవైపు శైలేంద్ర తలకి గురిపెట్టిన మను తండ్రి ఎవరో తెలియక ఫ్రస్టేషన్లో ఉన్నాను, నా ఆవేశం అదుపుతప్పేలోగా నిజం చెప్పమని హెచ్చరిస్తాడు. నిజంగా నీ తండ్రి మహేంద్ర యే,కావాలంటే నీకు సాక్ష్యాలు చూపిస్తాను. మా మమ్మీ కి ఫోన్ చెయ్యు అంటాడు శైలేంద్ర. దేవయానికి ఫోన్ చేస్తాడు మను. దేవయాని కొడుకు ఎండి అయిపోయాడేమో అనుకొని సంతోషంగా అతనితో ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది.

Guppedanta Manasu serial August 15th 2024 Episode of 486 Here is full story

కానీ శైలేంద్ర మాత్రం వసుధార రాసిన లెటర్ తనకి సెండ్ చేయమని చెప్తాడు. ఇప్పుడు దాంతో ఏం పని అంటుంది దేవయాని. అర్థం చేసుకో మమ్మీ అంటాడు శైలేంద్ర. ఇంతలో ఫోన్ కట్ చేసేస్తాడు మను. మరోవైపు బయటికి వెళ్లిపోయిన రిషి ని కాలేజీని మధ్యలో వదిలేయడం మంచిది కాదని, కాలేజీ కోసమే పరితపించే మీరు ఇలా ఆలోచించడం భావ్యం కాదని రిషికి నచ్చిచెప్తుంది వసుధార. ఆమె మాటలకి కన్విన్స్ అయిన రిషి మళ్ళీ మీటింగ్ లో జాయిన్ అవ్వటానికి వెళ్తాడు.

Guppedanta Manasu serial August 15th 2024 Episode of 486 Here is full story

మరోవైపు శైలేంద్ర ప్రవర్తన ని అనుమానించిన దేవయాని ఇప్పుడు వీడికి లెటర్ తో ఏం పని, అసలు కాలేజీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, కాలేజీలో శైలేంద్ర లేకపోతే అతను ప్రమాదంలో పడినట్లే అనుకుంటూ భర్తకి ఫోన్ ఫోన్ చేసి ఎండిగా ఎవరిని ప్రకటించారు అని అడుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు అని చిరాకుపడతాడు ఫణీంద్ర. శైలేంద్ర ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది దేవయాని. ఎక్కడ ఉన్నాడో నాకేం తెలుసు అంటాడు ఫణీంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X