ఆ హీరోయిన్‌తో పెళ్లి ఆగిపోవడానికి కారణం అదే.. సీక్రెట్ బయటపెట్టిన గుప్పెడంత మనసు టీవీ యాక్టర్
Sai Kiran: జీవితంలో ఎప్పడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేం. ఏదో సాధించాలని, ఏదో చేయాలని అందరం కలలు కంటాం. కానీ, అన్ని అనుకున్నట్లు జరగవు. ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడమే జీవితం. అలా ఎన్నో కలలతో జీవితాన్ని ప్రారంభించారు హీరో సాయికుమార్. కానీ, అనుకోని విధంగా ఆయన జీవితం మలుపు తిరిగింది. సినిమాలలో హీరోగా రాణించాలని భావించారు. కానీ, విఫలమయ్యారు. అలాగే..ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ, విధి వక్రీకరించింది. వేరేవారిని పెళ్లి చేసుకున్న ఆ బంధం మున్నాళ్ల ముచ్చటగానే మారింది. ప్రస్తుతం మరో పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన తొలిప్రేమ, పెళ్లి గురించి కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు హీరో సాయికిరణ్. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో?
హీరో సాయికిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 'నువ్వే కావాలి' సినిమాలో 'రా చిలక నువ్వే కావాలి' అనే పాటతో పాపులర్ అయ్యారు సాయికుమార్. అనంతరం హీరోగా మారి ఎన్నో సినిమాలలో నటించారు. అందులో ప్రేమించు, రావే నా చెలియా, డార్లింగ్ డార్లింగ్, మనసుంటే చాలు, వాడంతే అదో టైపు, పెళ్లి కోసం వంటి పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, సాయికిరణ్ అనుకున్న విధంగా.. తన సినీ లైఫ్ కొనసాగలేదు. ఊహించని విధంగా సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. నటించిన సినిమాలు కూడా ఫెయిల్ కావడంతో ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది.

కానీ తనపై తనకు ఉన్న నమ్మకంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. సుడిగుండాలు, కోకిలమ్మ, అభిలాష , గుప్పెడంత మనసు, మౌనరాగం, ఇంటిగుట్టు వంటి సీరియల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గుప్పెడంత మనసు సీరియల్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. దీంతో తమిళ్, కన్నడ సీరియల్స్ కూడా చేసే అవకాశం అందుకున్నారు. అలాగే అడపాదడపా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ లైఫ్ను బిజీ బిజీగా గడుపుతున్నారు సాయికుమార్ ఇటీవలే తన సీరియల్ కో యాక్టర్, నటి స్రవంతిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నారు హీరో సాయికిరణ్.
ఇదిలాఉండే.. ఇటీవల సాయి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గతంలోని లవ్ స్టోరీ గుర్తుకు చేసుకున్నారు. ఆ లవ్ ఎవరితోనో కాదు. హీరోయిన్ లయ. వీరిద్దరూ కలిసి 'ప్రేమించు' అనే సినిమాలో నటించారు. ఈ జంటకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అప్పట్లో భారీ ఎత్తున పుకార్లు షికారులు చేశాయి. కానీ, ఎప్పుడూ కూడా ఆ వార్తలపై వారిద్దరూ స్పందించలేదు. అయితే తాజాగా సాయికిరణ్ తన ఓల్డ్ లవ్ స్టోరీని గుర్తు చేసుకుంటూ లయ తో ఉన్న రిలేషన్ ను బయట పెట్టాడు.

సాయి కిరణ్ మాట్లాడుతూ.. తాను లయ కలిసి నటించిన 'సినిమా' ప్రేమించు సూపర్ డూపర్ హిట్ గా నిలిచిందని, మా ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని, చాలామంది మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. తమ జంట చూడముచ్చటగా ఉండడంతో మేమిద్దరం ఒకటైతే బాగుంటుందని మా ఇంట్లో వారు కూడా భావించారని, ఇంట్లో వారు లయను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పడంతో తాను కూడా ఓకే అని చెప్పారంట. కానీ, తమ ఇద్దరి జాతకాలు కలవకపోవడంతో తమ పెళ్లి పీటల వరకు వెళ్లలేదని సాయికిరణ్ తెలిపారు. తనతోపాటు ఇంట్లో వారు జాతకాలను విశ్వసిస్తారని, అందుకే మరో మాట లేకుండా లయ ను పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు సాయికుమార్.
అయితే తమ మధ్య ప్రేమ లాంటివి లేవు. జాతకాలు కుదిరితేనే పెళ్లి చేసుకుందామనుకున్నామనీ, ప్రస్తుతం తామిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. ఆ తర్వాత ఇంద్రజిత్తు అనే షో కూడా చేశామని, తమ్మిరెడ్డి భరద్వాజ ప్రొడక్షన్ లో వచ్చిన 'ఎంత బాగుందో' అనే సినిమాలో కూడా కలిసి నటించామని వెల్లడించారు. ఆ తరువాత 2010లో వైష్ణవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సాయికిరణ్ కి ఒక పాప కూడా ఉంది. అయితే.. పెళ్లి అయినా గత కొంతకాలానికే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల విడిపోయారంట. ప్రస్తుతం సాయికిరణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











