Guppedantha Manasu April 19th: మహేంద్రపై మను ఫైర్.. దత్తత కన్ఫార్మ్.. దేవయాని ప్లాన్ ఏంటంటే?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో ఫణీంద్ర ఫ్యామిలీ అంతా మహేంద్ర ఇంటికి తీసుకు వచ్చే ఇన్విటేషన్ ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా శైలేంద్ర అయితే వేరే కాలేజీ ఓపెన్ చేస్తున్నాడేమో అనగా.. అందుకే నిన్ను బుర్రతక్కువ వెధవ అనేద అంటూ ఫణీంద్ర చెప్పుకొచ్చాడు. ఇదంతా ఎందుకు, మహేంద్రే ఇంటికి వస్తాడుగా అని ఫణీంద్ర చెబుతాడు. ఇక ఆ తర్వాత వసు, మహేంద్రలు కలిసి ఫణీంద్ర ఇంటికి బయలు దేరుతారు. కారులో వెళ్తుండగా.. వసు ఇప్పుడీ దత్తత వద్దు అని చెబుతుంది. మనం ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయేమో అని వసు అంటుంది.

అప్పుడే మహేంద్ర తన మనసులోని మరో ప్లాన్ గురించి చెబుతాడు. నేను ఇలా కఠిన నిర్ణయం తీసుకుంటేనే అనుపమ నోరు విప్పుతుందని.. సామవేదండోపాయాలన్నీ వాడి అయినా సరే మను అసలు తండ్రిని వెలుగులోకి తీసుకొస్తానంటాడు. అంతేకాకుండా ఒకవేళ ఆ నిజం బయట పడకపోయినా.. నేనే దగ్గరుండి తనను నా కొడుకుగా స్వీకరించి.. అన్ని బాధ్యతలు చూసుకుంటానంటాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఫణీంద్ర ఇంటికి రాగానే తెగ ఎమోషనల్ అయిపోతాడు మహేంద్ర. వసు మాత్రం లోపలకు రాకుండా అక్కడే ఉండి.. ఒకసారి ఆలోచించండి మామయ్యా అంటుంది. పర్వాలేదమ్మా మనకంతా మంచే జరుగుతుంది పదా అని తీసుకుని లోపలకు వెళ్తాడు.

Guppedantha Manasu April 19th 2024 Episode Mahendra Decided to Adopt Manu

వసు, మహేంద్రలు రాగానే.. దేవయాని, శైలేంద్రలు షాక్ అవుతారు. ఫణీంద్ర వాళ్లను రమ్మని పిలిచి.. ధరణిని కాఫీ తీసుకు రమ్మంటాడు. ఆ తర్వాత మహేంద్ర ఓ విషయం చెప్పేందుకు వచ్చానని అంటాడు. మనుకు తండ్రిని నేనే అని చెప్పాల్సి వచ్చిందని.. దాని వల్ల కొంత మంది బాధ పడ్డారని, ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అయ్యారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఎవరూ తల దించుకునే పరిస్థితి రాకూడదని, ముఖ్యంగా మనుకు కూడా ఇబ్బంది కల్గకూడదని తాను ఓ నిర్ణయానికి వచ్చానని చెప్పుకొచ్చాడు.

అప్పుడు మనును దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు వివరించాడు మహేంద్ర. ఈ మాట చెప్పగానే అంతా షాక్ అవుతారు. ముఖ్యంగా శైలేంద్ర, దేవయానిలు లేచి నిల్చొని మరీ దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముందని అంటాడు. ఇక రిషిని వదిలేసినట్లేనా అంటూ శైలేంద్ర అనగా.. రిషి నా కొడుకు అని చెబుతాడు మహేంద్ర. అసలు మీరేం చేస్తున్నారో మీకైనా తెలుసా అని అనగానే.. అర్థం అయింది కాబట్టే ఇలా చేస్తున్నానంటాడు మహేంద్ర. నీవేంటి ఒప్పుకునేదని మహేంద్ర అనగానే.. శైలేంద్ర ఏదో చెప్పబోతాడు. అప్పుడే ఫణీంద్ర శైలేంద్ర నోరు మూసి.. వసు ఈ నిర్ణయం వద్దని నువ్వైనా చెప్పకపోయావా అంటాడు. ఇది నాక్కూడా సరైనదే అనిపిస్తుంది చెబుతుంది.

Guppedantha Manasu April 19th 2024 Episode Mahendra Decided to Adopt Manu

ఆ తర్వాత ఫణీంద్ర మాట్లాడుతూ.. మొన్న నువ్వేదో కోపంలో అలా చెప్పావు అని కానీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం సరైనది కాదని అంటాడు. ఇప్పటికే రిషి కనిపించక ఇబ్బంది పడుతున్నాం.. ఇప్పుడు మళ్లీ మను సమస్యను తలపై వేసుకోవడం సరైనదేనా అని అంటాడు. నువ్వు వారి కోసం ఏదైనా చేయాలనుకుంటే చేయు కాని.. ఇది వద్దని అంటాడు. కానీ మహేంద్ర మాత్రం అన్నయ్యా నేను నీ మాట వినలేపోతున్నాను.. అర్థం చేసుకోండి అంటాడు. ఆ తర్వాత దేవయానితో మాట్లాడుతూ.. నేను మీకు ఇన్వర్మేషన్, ఇన్విటేషన్ ఇవ్వడానికి మాత్రమే వ్చచానంటాడు. అన్నయ్యకు పత్రిక ఇస్తే తీసుకోకపోతే.. మహేంద్ర ఆయన చేతిలో పెడతాడు.

ఈ వేడుకకు వచ్చి నన్ను, మనును ఆశీర్వదించాలని అంటాడు. ఆ తర్వాత ధరణి నువ్వు కూడా రావాలమ్మా అంటాడు. ఇక వాళ్లు వెళ్లిపోగానే.. శైలేంద్ర మనుకు ఫోన్ చేస్తాడు. కానీ మను మాత్రం కట్ చేస్తాడు. దీంతో మళ్లీ చేయగా.. మను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏం ప్లాన్, ఏం రాజకీయాలురా బాబూ.. మీరు చాలా ప్లాన్ తోనే వచ్చారని అంటాడు శైలేంద్ర. అంతలోనే మను మరోసారి ఫోన్ కట్ చేస్తాడు. మళ్లీ చేయగా లేపగానే.. మ్యాటర్ తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నావని అంటాడు. ఆ తర్వాత మా బాబాయ్ నిన్ను దత్తత తీసుకుంటానని అంటున్నాడు కదా అని చెబుతాడు. అప్పుడే మహేంద్ర సార్ నన్ను దత్తత తీసుకోవడం ఏంటి, అయినా ఎవరికి చెప్పారంటూ పైర్ అవుతాడు.

Guppedantha Manasu April 19th 2024 Episode Mahendra Decided to Adopt Manu

ఆల్రెడీ బాబాయ్ మా ఇంటికి వచ్చి ఈ విషయం చెప్పారని, ఇన్విటేషన్ కూడా ఇచ్చి వెళ్లారని అంటాడు. మరో రెండ్రోజుల్లో దత్తత కార్యక్రమం ఉంటుందని అనగా.. నాకు తెలియకుండా ఆయన అలా ఎలా చేస్తారని మను అంటాడు. మీరే ప్లాన్ తో ఇలా చేస్తున్నారని నిందలు వేస్తాడు. ఆ తర్వాత ఫోన్ చేయగా... మను మాత్రం చాలా ఫీల్ అవుతాడు. వెంటనే మను ఇంటికి వచ్చి మహేంద్రను గట్టిగా పిలుస్తాడు. వాళ్లు లేరని అనగా.. వాళ్లెందుకు వెళఅలారో నీకు తెలుసా అంటాడు. అనుపమ తెలుసనగానే.. నేను వేచి చూస్తున్నానని అంటుంది. ఆ తర్వాత శైలేంద్ర, దేవయానిలను చూపిస్తారు. ప్లాన్ వేస్తూ కనిపిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X