Guppedantha Manasu Weekly Roundup: దేవయాని ప్లాన్ ఫెయిల్.. పెళ్లికి ముహుర్తం పెట్టమన్న రిషి!

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 3వ ఎపిసోడ్ లో..: వసు మాటలు, జయచంద్ర మాటల గురించి ఆలోచిస్తూ.. నిజంగానే మా బంధం మీద అనుమానం వచ్చి నిలదీస్తే ఎలా అని అనుకుంటాడు. అనుమానం రాకూడదు అని తన రూమ్ బయటకు వెళ్లి తలుపు పెట్టి వెళ్లబోతుంటే మహేంద్ర ఎదురవుతాడు. ఎక్కడికీ రిషి అని మహేంద్ర అడిగితే.. ఇక్కడికే డాడ్ గుడ్ నైట్ అని అంటాడు రిషి. అడిగితే గుడ్ నైట్ అంటావ్ ఏంటీ అని మహేంద్ర అంటే. ఇప్పుడు మీకు అదే చెప్పాలి డాడ్ అని ధరణి గదికి వెళ్తాడు రిషి. ఇంతలో జగతి వస్తే రిషి సమాధానం చెప్పకుండా అటు వెళ్తున్నాడు అని మహేంద్ర చెబుతాడు. ఆ గదిలో వసుధారు ఉందిగా ఏదైనా మాట్లాడాతాడేమో అని జగతి క్లారిటీ ఇస్తుంది. వసుధార లోపల వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రిషి రాగానే ఏంటీ సర్ మళ్లీ వచ్చారు అని అడుగుతుంది. ఏం మళ్లీ రాకుడదా అని రిషి అంటాడు.

Guppedantha Manasu

ఏప్రిల్ 4వ ఎపిసోడ్ లో..: ఆధ్యాత్మిక గురువు జయచంద్రకు అనుమానం రాకూడదని వసుధార ఉన్న ధరణి గదిలోకి వెళ్తాడు రిషి. ఏంటీ సార్ మళ్లీ వచ్చారని వసుధార అడుగుతుంది. ఏం రాకూడదా. కారణాలు చెబితే కానీ లోపలికి రానివ్వవా అని అంటాడు రిషి. మళ్లీ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారా సార్ అని వసు అంటే రెండోసారి థాంక్స్ చెప్పించుకునే అలవాటు నీకేమైనా ఉందా అని అంటాడు. దీంతో ఎందుకు వచ్చారో చెప్పట్లేదు ఏంటీ అని వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. వసుధార దగ్గరకి వెళ్తాడు రిషి. ముద్దు పెట్టడానికే వస్తున్నట్లు అనుకున్న వసుధార కళ్లు మూసుకుని వెనక్కి వెనక్కి జరుగుతుంది. రిషి కాస్తా దగ్గర్లో ఉన్న పిల్లో దుప్పటి తీసుకుంటాడు. వీటికోసమా అని వసుధార అంటుంది. మరి నువ్వు దేనికోసం అనుకున్నావ్ అని రిషి అంటాడు.

ఏప్రిల్ 5వ ఎపిసోడ్ లో.. : కాలేజీలో జయచంద్ర ఓ చోట కూర్చుని ఏవో రాతలు రాసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి జగతి వెళ్తుంది. రండమ్మా అంటాడు జయచంద్ర. ఇది ఒక తల్లి ఆవేదన అనుకుంటారో.. లేక ఓ గురువు తాపత్రయం అనుకుంటారో. మీరు రెండు జీవితాల మధ్య బంధాన్ని నిలబెట్టాలి. సాంప్రదాయబద్ధమైన సంఘమం జరపాలి. ఇద్దరూ సంతోషంగా ఉండేలా చూడాలి అని జగతి అంటుంది. కూర్చుని వివరంగా చెప్పండి పర్వాలేదు నేను వింటానమ్మా.. కూర్చోండి అని జయచంద్ర అంటాడు. ఈ కాలేజీ ఎండీ రిషి నా కొడుకు అని మీకు తెలుసు కదా సార్. అలాగే వసుధార, వాళ్లిద్దరు భార్యాభర్తలు. ఇద్దరూ చాలా మంచివాళ్లు. ఎదుటివారని చాలా అర్థం చేసుకునే రకం. కానీ ఇద్దరూ కలవలేకపోతున్నారు అని మొత్తం చెప్పే ప్రయత్నంలో ఉంటుంది జగతి.

ఏప్రిల్ 6వ ఎపిసోడ్ లో.. : జయచంద్ర మాటలను గుర్తు చేసుకుంటూ అక్కడే నిలబడిపోతారు వసుధార, రిషి. ఒకరివైపు ఒకరు తిరుగుతారు. చాలా ఆవేదనగా ఒకరివైపు ఒకరు నడిచి కళ్లల్లోకి చూసకుంటూ గట్టిగా హగ్ చేసుకుంటారు. వసుధార ఆవేదనగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను వసుధార. నీ ప్రేమను గుర్తించలేకపోయాను అని రిషి మనసులో అనుకుంటాడు. ఐయామ్ సారీ సార్.. నేను ఎప్పుడూ మీ వైపు నుంచి ఆలోచించలేకపోయాను. మీ మనసులో ఉన్న బాధను గుర్తించలేకపోయాను అని వసుధార అనుకుంటూ ఏడుస్తుంది. అప్పుడే చప్పట్లు కొట్టిన చప్పుడు వినిపించి ఉలిక్కిపడాతరు రిషిధార.

Guppedantha Manasu

ఏప్రిల్ 7వ ఎపిసోడ్ లో.. : ఏం జరిగిందో తెలియకుండా ఏంటీ సార్ ఇదంతా. మీరు చెప్పేంతవరకు నా మెడలో తాళి లేదనే విషయమే నాకు తెలియదు. రాత్రి ఏదో పీడకల వచ్చింది. ఆ పెనుగులాటలో తెగిపడిపోయి ఉండొచ్చు అని వసుధార అంటే.. మరి తాళి తెగిపోతే నీ గదిలో ఉండాలి కదా నా గదిలోకి ఎందుకు వచ్చింది అని రిషి అడుగుతాడు. నాకు తెలియదు అన వసుధార అంటుంది. వచ్చావ్. తన అడుగుల చప్పుడు నేను విన్నాను అని రిషి అంటాడు. దేవయాని ఇందాక నువ్వు రిషి గదికి వెళ్లావ్ కదా అని ఫణీంద్ర అనడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. నిజం చెప్పమని దేవయానిని నిలదీయడంతో అక్కడ తాళి తనే పెట్టినట్లు ఒప్పుకుంటుంది. రిషికి ఇచ్చి ఆ తాళి వేయిస్తే మనస్ఫూర్తిగా ఉంటుందేమో అని అలా చేశాను అని కవర్ చేస్తుంది దేవయాని. ఇంత చిన్న విషయంలో ఎంత అపార్థం చేసుకున్నారు అని వసుధార అంటుంది.

ఏప్రిల్ 8వ ఎపిసోడ్ లో.. : ఇంట్లో అందరినీ పిలుస్తాడు రిషి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను పెద్దమ్మా. నేను వసుధారను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని రిషి అంటాడు. దీంతో వసు, జగతి, మహేంద్ర, ధరణి, ఫణేంద్ర మొహాల్లో సంబరం కనిపిస్తుంది. కానీ దేవయాని మాత్రం షాక్ అవుతుంది. రిషి నువ్వు చెప్పేది నిజమేనా అని మహేంద్ర అంటాడు. నిజమే డాడ్ నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక వెనక్కి తగ్గేదే లేదు అంటాడు రిషి. నీ నోటి నుంచి ఈ మాట కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను అని మహేంద్ర అంటాడు. ఇది ఇంత తొందరగా ఇలా జరుగుతుంది అనుకోలేదు అని దేవయాని రగిలిపోతుంది. పెద్దమ్మా పంతుల్ని పిలిచి మంచి ముహుర్తం చూడమని చెప్పండి అని రిషి అంటాడు. హా సరే నాన్నా.. కానీ కొద్దిరోజులు ఆగాలి. శూన్యమాసం కదా. ముహుర్తాలు ఉండవు. అయిపోగానే పిలుస్తా అని దేవయాని అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X