Guppedantha Manasu Weekly Roundup: కిడ్నాపర్స్ నుంచి తప్పించుకున్న రిషిధార.. దేవయాని కొత్త స్కెచ్!
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు.
ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 10వ ఎపిసోడ్ లో..: పెద్దనాన్న డాడ్, మేడమ్ మనం మెడికల్ కాలేజీ పెడదాం. ఆయన చెప్పారనే కాదు. ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. అది చాలా కష్టమైన పని అని నాకు తెలుసు. కానీ అది కూడా ముఖ్యమే కదా అని రిషి అంటాడు. దీంతో జగతి మహేంద్ర సరే అని ప్రోత్సహిస్తారు. వసుధార బస్తీ విజిట్ చేసుకున్నాకా.. మీరు లేకపోవడం ఏం బాలేదు అని రిషికి మెసేజ్ పెడుతుంది.
తర్వాత మహేంద్ర, జగతి బయటకు వెళ్తారు. మహేంద్ర మనం విడిపోయినప్పుడు నేను ఒక్కదాన్నే. కానీ ధైర్యంగా ఉండగలిగాను. వసు, రిషిల మధ్య వచ్చిన అవాంతరాలు దూరం కావాలని, వాళ్లు గతంలోకి వెళ్లాలి అనుకున్నప్పుడు వసుధార కూడా అంతే ధైర్యంగా నిలబడింది అని జగతి చెబుతుంది.
ఏప్రిల్ 11వ ఎపిసోడ్ లో..: ఇక మన మధ్య ఎడబాటు ఉండదు అని రిషి అంటే వసుధార్ ప్రేమగా ఆ చాక్లెట్ తీసుకుంటుంది. తర్వాత ఇద్దరూ కారులో బయలు దేరతారు. ఈ క్షణం ఇలా ఆగాలని అనిపిస్తోంది వసుధార. నీతోనే ఉండాలనిపిస్తోంది. ఇంకేదీ వద్దు అనిపిస్తుంది అని అంటాడు రిషి. నాకు అలానే ఉంది సార్. కానీ ఆడపిల్ల గౌరవానికి తప్పకుండా ఒకమాత్రం కావాలి అని వసుధార అంటుంది. నువ్వు మాట్లాడేది పెళ్లి గురించే కదా. నేను నీకొకటి చెప్పనా.
ఎవరికీ చెప్పవు కదా అని అంటాడు రిషి. చెప్పను సార్ చెప్పండి అని వసుధార నవ్వుతూ అంటుంది. నిజంగా ఎవరికీ చెప్పకూడదు. చెప్పను అంటేనే చెబుతాను అని రిషి అంటాడు. అయ్యో ఎందుకు సార్ అంత గట్టిగా అంటున్నారు. చెప్పను కానీ చెప్పండి అని వసుధార అంటుంది. పెళ్లి విషయం నీకంటే ఎక్కువగా నాకే తొందరగా ఉంది ఎమ్ హెచ్ అని సిగ్గుపడుతూ రిషి అంటాడు. నిజమా సార్ అని నవ్వుతూ వసుధార అంటుంది. నిజంగా నిజం.. కొన్ని కొన్ని దాచుకోవడం కొన్ని కొన్ని అణుచుకోవడం చాలా కష్టం.

ఏప్రిల్ 12వ ఎపిసోడ్ లో..: మనం ఎవరికీ అన్యాయం చేయలేదు, కానీ మనకు ఇలా జరగడమేంటీ వసుధారతో రిషి అంటాడు. ఈరోజుల్లో మంచి చేసేవాడికి శత్రువులు ఎక్కువైపోతున్నారు మిస్టర్. ఏం చేస్తాం. కలికాలం అంటూ నవ్వుతాడు విలన్. ఏం ఆశించి ఇదంతా చేశారంటావ్ అని రిషి అంటే.. మరోవైపు అధికారం అని విలన్ అంటాడు. ఎందుకు ఈ మధ్య శత్రువులు ఎక్కువయ్యారనిపిస్తోంది అని రిషి అంటే.. రాజుకు ఎప్పుడూ శత్రువులు ఉంటూనే ఉంటారు అని నవ్వుతాడు విలన్.
మొన్న స్పాట్ వాల్యూషన్ లో ఇరికించాలని చూసినవాళ్లే అనిపిస్తుందని రిషి అంటాడు. అప్పుడే జాగ్రత్తపడి వాళ్లు ఎవరో, ఎందుకు చేశారో తెలుసుకోవాల్సింది అని వసు అంటే.. వాళ్లెవరో నాకు తెలుసు వసుధార అని రిషి అంటాడు. వసుధార షాక్ అవుతో అవును, ఆ పని చేయించినవాళ్లు నాకు తెలుసు. కానీ సాటి విద్యాసంస్థలను అవమానించకూడదు అని వదిలేశాను. కానీ వాళ్లకు ఆ విశ్వాసం లేదు. మళ్లీ వక్రబుద్ధి చూపించారు అని రిషి అంటాడు.
ఏప్రిల్ 13వ ఎపిసోడ్ లో..: పెద్దమ్మా ప్లీజ్.. వసుధార కాలికి దెబ్బ తగిలిందని చెప్పి జగతితో పంపిస్తాడు రిషి. పెద్దమ్మా మేము ఇంటికి రావడం లేట్ అయింది. కానీ దానికి కారణం ఉంది. అంతేకానీ కావాలని లేట్ చేయలేదు. సమాజం గురించి మాట్లాడారు. అది నాకు నచ్చలేదు పెద్దమ్మా. తప్పటడుగులు వేసేవాళ్లే మీరు అన్నట్లు ఆలోచించాలి. మేము కాదు. అయినా సొసైటీకి భయపడే అంతా తప్పులు మేము చెయ్యం. ఇదివరకే చెప్పాను. మీ హద్దులు. మీ పద్ధతులు నాకు బాగా తెలుసు. వాటిని ఎప్పుడు దాటం. అర్థం చేసుకుంటే మంచిది అని రిషి అంటాడు.
దేవయాని ఏదో చెబుతుంటే మీరు వెళ్లి పడుకోండి. నేను డాడ్ పెద్దనాన్నతో మాట్లాడాలి అని రిషి అంటాడు. నేను ఉండకూడదా అని దేవయాని అంటే. అలా కాదు. ఇది కాలేజీ సమస్య. వింటే మీరు ఒత్తిడికి గురవుతారు అని రిషి చెబుతాడు. శాసనాలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఎదురు తిరిగితే మొత్తం పాడవుతుంది. అనుకున్నది జరగదు అని మనసులో అనుకున్న దేవయాని సరే నాన్న త్వరగా పడుకో అని వెళ్లిపోతుంది దేవయాని.

ఏప్రిల్ 14వ ఎపిసోడ్ లో..: డీబీఎస్టీ కాలేజీ జోలికి రావొద్దు. పోలీస్ శాఖ సహకారంతో 24 గంటల్లో మిమ్మల్ని పట్టుకుని బహిరంగంగా బయటపెడితే అప్పుడు మీ పరిస్థితి ఏంటో మీ కాలేజీ పరువు ఏమవుతుందో ఆలోచించుకోండి. అందుకే మీ మేలు కోరి చెబుతున్నాం. మా కాలేజీ మీదున్న ద్వేశాన్ని తుడిచి పెట్టండి. మీ పని ఏదో మీరు చూసుకోండి.
ఇంత చెప్పాక మీరు వక్రబుద్ధి చూపిస్తే.. కాలేజీ యాజమాన్యం సరైన పాఠం చెబుతుంది అని ఇలా ఒక ప్రెస్ నోట్ అన్ని పత్రికల్లో వచ్చేలా చేయండి డాడ్ అని రిషి అంటాడు. సరే అని మహేంద్ర అంటాడు. మంచి నిర్ణయం తీసుకున్నావ్ అని ఫణీంద్ర చెబుతాడు. తర్వాత వసుధార కుంటుకుంటూ వంట గదిలోకి వెళ్తుంది. మీరు బయట తిన్నారుగా అని ధరణి అడుగుతుంది.

ఏప్రిల్ 15వ ఎపిసోడ్ లో..: జగతి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు రిషి. ఇంతలో ధరణి వచ్చి వసుధార నీకోసం ఇవి ఇచ్చిందని ఆపిల్ ముక్కలు ఇస్తుంది. మరోవైపు వసుధార తన గదిలోకి వెళ్తుంటే దేవయాని చూస్తుంది. చాలా సంతోషంగా కనిపిస్తున్నావని దేవయాని అంటే సంతోషించాల్సిన విషయమే కదా మేడమ్ అని వసు అంటుంది. మెడలో తాళి లేకుండా తిరుగుతున్నావ్ అని దేవయాని అంటే.. తొందర్లోనే నా మొగుడు తాళి బొట్టు కట్టబోతున్నాడు.
మళ్లీ నేను ఎందుకు కట్టుకోవడం అని వసుధా అంటుంది. జనాలు అడిగితే ఏం చెబుతావ్ అంటే.. మీ వల్లే తాళి తెగిందని చెబుతాను. ఏదో చేయాలని చూశారు. కానీ అది జరగలేదు. ఫణీంద్ర సార్ చూశారు కాబట్టి సరిపోయింది. లేకుంటే మీరు నోరు విప్పి చెప్పేవారా. ఎవరో అడుగుతారని తాళి వేసుకోలేదు. నా ప్రేమను గెలిపించుకోడానికి వేసుకున్నాను అని దేవయానితో వసుధార అన్న మాటలను రిషి వింటాడు.


Click it and Unblock the Notifications











