Guppedantha Manasu Weekly Roundup: శత్రువుతో శపథం.. 10 రోజుల గడువు.. ఉచ్చులో పడిన రిషి!

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 17వ ఎపిసోడ్ లో.. : రిషికి మినిస్టర్ కాల్ చేస్తాడు. ఈ వార్త ఏంటీ రిషి. ఏం జరిగింది అని మినిస్టర్ అడిగితే.. జరిగింది చెబుతాడు రిషి. ఇదంతా చేసింది ఎవరు. నేను వెంటనే యాక్షన్ తీసుకుంటాను అని మినిస్టర్ అంటాడు. వాళ్ల పేర్లు చెప్పాలని నేను అనుకోవట్లేదు సార్ అని రిషి అంటాడు. అలా అయితే యాక్షన్ ఎలా తీసుకుంటానని మినిస్టర్ అంటాడు. మీరు ఏ యాక్షన్ తీసుకోవద్దు సార్ అని రిషి అంటాడు. ఎందుకు అని మినిస్టర్ అంటే.. ఆ విద్యా సంస్థల పేరు బయట పెడితే స్టూడెంట్స్ భవిష్యత్తు తారు మారు అయ్యే అవకాశం ఉంది. నాకు శత్రువుల పరువు తీయడం కంటే స్టూడెంట్స్ భవిష్యత్తు ముఖ్యం. మీరేం టెన్షన్ పడకండి అని రిషి అంటాడు. యూ ఆర్ గ్రేట్ యంగ్ మ్యాన్. అందుకే నువ్వు అందరికీ నచ్చుతావ్. ఈ విషయంలో నువ్వు ఊరుకున్నా నా స్పందన ఉంటుంది రిషి అని మినిస్టర్ కాల్ కట్ చేస్తాడు.

Guppedantha Manasu

ఏప్రిల్ 18వ ఎపిసోడ్ లో.. : ఇంట్లో వసుధార, రిషి చాలా సంతోషంగా ఉంటారు. ఎమ్ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యంతో కలిసి మెడికల్ కాలేజీ పెట్టబోతున్నాం అని సంబరపడిపోతారు. రిషి గొప్పదనం గురించి అంతా పొగుడుతారు. తాతయ్య లాగే నీది చాలా గొప్ప మనసు, ఆయన ఊహలన్నీ నిజం చేస్తున్నావ్ రిషి. నాకు చాలా గర్వంగా ఉందని ఫణీంద్ర పొగుడుతాడు. కట్ చేస్తే తన గదికి రమ్మని వసుధారను పిలుస్తాడు రిషి. వసుధార వెళ్లబోతుంటే దేవయాని అడ్డుకుంటుంది. ఆడపిల్లవి కొంచెమైనా బుద్ధి లేదా. ఇలా వేళ కానీ వేళల్లో వెళ్లకూడదని తెలియదా. నీ గదికి వెళ్లు అని కోపంగా దేవయాని అంటుంది. అప్పుడే రిషి వచ్చి ఆగు వసుధార అంటాడు. పెద్దమ్మా నేనే తనను పిలిచాను. మేము కొంచెం మాట్లాడుకోవాలి. కాలేజీ విషయాలు చర్చించుకోవాలి అని రిషి అంటాడు. ఇప్పుడా. అప్పుడు జగతి ఎంట్రీ ఇస్తుంది. అందులో తప్పేముందు అక్కయ్యా. రిషి మీద మీరు అనుమానపడితే మీ పెంపకానని మీరే అవమానించినట్లు అని దేవయానికి జగతి వరుసగా చురకలు వేస్తుంది.

ఏప్రిల్ 19వ ఎపిసోడ్ లో..: మీ పద్ధతులు మీవే కానీ నా మాట వినరన్నమాట అని దేవయాని అంటుంది. పెద్దమ్మా ఎందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మళ్లీ దీని గురించి భయపడాల్సిన పనిలేదు. వసుధార నాతోరా అని తీసుకుని వెళ్లిపోతాడు రిషి. రగిలిపోతున్న దేవయానితో రిషి ఎవరి మాట వినడని తెలుసు కదా. మరి ఎందుకు వాళ్ల విషయంలో కలుగ జేసుకుంటారు. పదే పదే కంట్రోల్ చేయాలని చూస్తారు. రిషితో పదే పదే ఈ మాటలే చెప్పించుకుంటారు. ఇవన్నీ అవసరమా అక్కయ్యా అని జగతి అంటుంది.

Guppedantha Manasu

ఏప్రిల్ 20వ ఎపిసోడ్ లో.. : వసుధార అదోలా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. దీంతో సౌజన్య రావు ప్రపోజల్ గురించి రిషికి చెప్పడంతో అతను షాక్ అవుతాడు. ఏంటీ డీబీఎస్టీ కాలేజీని ఎమ్ఎస్ఆర్ కాలేజీలో కలిసిపోవాలా.. నో వే.. నువ్వెందుకు నిరుత్సాహంగా ఉన్నావ్ అని రిషి అంటాడు. మీరు చాలా ఆశలు పెట్టుకున్నారు కదా సార్. అది మిస్ చేసుకున్నాం కగా అని వసు అంటే.. నేను అలా అనుకోవట్లేదు. సపోర్ట్ చేస్తా అంటే ఓకే అన్నాను. కానీ అతడి మనసులో ఇంత దురుద్దేశం ఉందని మనకు తెలియదు కదా అని రిషి అంటాడు. ఇంటికి వెళ్లిన వసుధార మహేంద్ర, జగతికి జరిగింది చెబుతుంది. రిషి ఏమైనా బాధ పడ్డాడా అని జగతి అంటే.. బాధ అయితే మనసులో ఉంది కానీ. బయటకు కనిపించలేదు. నాకే తిరిగి ధైర్యం చెప్పారు అని వసు అంటుంది. డీబీఎస్టీ మెడికల్ కాలేజీ అనేది రిషి ఒక్కడి కలే కాదు. మనందరి కోరిక. ఆ కోరిక తీరితే ఎందరో పేద పిల్లల కలలు నెరవేరతాయి. మనమే కష్టపడి. రిషి కలను నిజం చేయాలి అని జగతి అంటుంది. రిషి ఆనందంగా ఉంటే ముందుగా సంతోషపడేది మనమే. అందుకు మనం ఏం చేయడానికైన సిద్ధంగా ఉండాలి అని జగతి అంటుంది. ఆ మాటలు గది బయట నుంచి రిషి వింటూ ఉంటాడు.

ఏప్రిల్ 21వ ఎపిసోడ్ లో.. : రిషి సంతకం పెట్టిన ఫైల్ ను జగతికి ఇస్తుంది వసుధార. నువ్వేం టెన్షన్ పడొద్దు. మనం చేసేది మంచి పనే. మంచే జరుగుతుంది అని ఫైల్ తీసుకుని జగతి వెళ్లిపోతుంది. ఇలా రిషికి తెలియకుండా ఫైల్ పై సంతకం పెట్టిస్తుంది జగతి. మరోవైపు ఫణీంద్ర, మహేంద్ర, దేవయానిలను ఇంట్లోనే కలుస్తాడు సౌజన్యరావు. మా ప్రపోజల్ కు నో అన్న రిషి.. ఆవేశంలో అన్నాడో ఆలోచించి అన్నాడో తెలియదు కానీ, మా కాలేజీని మీ కాలేజీలో కలపమని చెప్పాడు. నాకు అది నచ్చింది. అది నాకు చాలా మంచి అవకాశంగా అనిపించింది అని సౌజన్య రావు అంటాడు. దీంతో మహేంద్ర, ఫణీంద్ర షాక్ అవుతారు. ఒకవేళ సౌజన్య రావు చెప్పింది విని ఎమ్ఎస్ఆర్ కాలేజీని డీబీఎస్టీ కాలేజీలో కలుపుకుంటే SB ఉచ్చులో రిషి ఇరుక్కున్నట్లుగానే అనిపిస్తోంది.

ఏప్రిల్ 22వ ఎపిసోడ్ లో.. : డీబీఎస్టీకి పర్మిషన్ రాకపోవడం ఏంటీ. మాకున్న పేరుకు మీకంటే ముందే పర్మిషన్ వస్తుంది అని రిషి అంటాడు. ఊరికే భ్రమలు పడొద్దు. పేరు అని మీరు అనుకుంటే సరిపోదు. జనం కూడా అనుకోవాలి. నేను ఇప్పుడు చెబుతున్నా మీ కాలేజీకి పర్మిషన్ రాదని సౌజన్య రావు అంటే.. రిషి కోపంగా వస్తే అని అంటాడు. ఒక ఛాలెంజ్ చేసుకుందాం పది రోజుల్లో పర్మిషన్ ఎవరికీ ముందు వస్తుందో చూద్దాం. మీ కాలేజీకి పర్మిషన్ వస్తే మా కాలేజీని కలిపేస్తాను. మాకు పర్మిషన్ వస్తే మీ కాలేజీని మాదాంట్లో కలపాలి అని సౌజన్య రావు సవాల్ విసురుతాడు. దానికి రిషి ఒప్పుకుంటాడు. ఇదే విషయం మహేంద్ర, జగతి, వసుకు చెబుతాడు రిషి. 10 రోజుల్లో పర్మిషన్ రావడం కష్టం. అతనితో ఛాలెంజ్ ఎందుకని జగతి అంటే.. మన కాలేజీ ప్రతిష్ట గురించి మాట్లాడాడు మేడమ్ అని రిషి అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X