Guppedantha Manasu: తల్లిని మించిన విలన్ శైలేంద్ర.. ధరణికి కష్టాలు, ఛైర్మన్ సీటుకు ఎసరు!

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి ప్రేమాయణం అనేక మలుపులు తిరుగుతోంది. రిషిధారను ఎలాగైన విడగొట్టాలని దేవయాని ప్రయత్నించగా.. కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదన పడే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథతో ఎమోషనల్ గా సాగుతోంది. గత వారం రోజులుగా అంటే ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 24వ ఎపిసోడ్ లో..: తలదించుకున్న సౌజన్య రావును వెళ్లు అన్నట్లుగా బయటకు చూపిస్తాడు. సౌజన్య రావు వెళ్లబోతుంటే ఆపి కింద పడిన దండను తీసి అతని మెడలో గెంటిసేనట్లుగా పంపిస్తాడు మహేంద్ర. ఇదంతా అర్థం కానీ రిషి గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంటాడు. పర్మిషన్ రాలేదని బాధపడుతుంటాడు. వసుధార వెళ్లి కుర్చీలో కూర్చున్న రిషి వెనుకవైపు వాలి ప్రేమగా మాట్లాడుతుంది. మినిస్టర్ గారు రమ్మన్నారని చెబుతుంది. ఇద్దరూ మినిస్టర్ దగ్గరికి వెళ్తారు. అదివరకే అక్కడ జగతి, మహేంద్ర ఉంటారు. కంగ్రాచ్యులేషన్ మెడికల్ కాలేజీ ఎండీ అని మినిస్టర్ అంటే రిషి సంతోషంతో షాక్ అవుతాడు. ఇలా మెడికల్ కాలేజీ కలను వసు, జగతి నెరవేరుస్తారు.

Guppedantha Manasu

ఏప్రిల్ 25వ ఎపిసోడ్ లో..: శైలేంద్ర భూషణ్ టాక్సీలో వస్తూ వేగంగా పోనివ్వాలను డ్రైవర్ ను కంగారు పెట్టడంతో ఒక ముసలయనికి కారు ఢీ కొడుతుంది. అది చూసిన వసుధార శైలేంద్రతో గొవడకు దిగుతుంది. రూడ్ గా మాట్లాడి అక్కడి నుంచి శైలేంద్ర వెళ్లిపోతాడు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని వసుధార అనుకుంటుంది. మరోవైపు మినిస్టర్ మాటలను గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తాడు రిషి. జగతి మహేంద్ర వచ్చేసరికి అలాగే హాల్లో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇప్పుడు రిషీతో మాట్లాడొద్దు. కూల్ అయిన తర్వాత మాట్లాడదాం అని జగతి, మహేంద్ర సైలెంట్ గా వెళ్లిపోతూ ఉంటే మేడమ్ అని రిషి పిలుస్తాడు. థ్యాంక్యూ మేడమ్. నాకు తెలిసి చేసినా తెలియకుండా చేసినా చివరికీ అంతా మంచే జరిగింది. మీరు మన కుటుంబ గౌరవాన్ని కాపాడారు. చాలా కష్టం అనుకున్న మెడికల్ కాలేజీ పర్మిషన్ ను పది రోజుల్లో తెచ్చి గ్రేట్ అనిపించారు. నన్ను గెలిపించారు అని రిషి అంటాడు.

Guppedantha Manasu

ఏప్రిల్ 26వ ఎపిసోడ్ లో..: ఇదే అన్నయ్యా నీ రూమ్. ఏంటీ అలా చూస్తున్నావ్. నచ్చలేదా. పోనీ నా రూమ్ తీసుకుంటావా అని రిషి అంటాడు. నువ్వు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయిలే. తొందరెందుకు. టైమ్ కుదిరినప్పుడు ఒక్కొక్కటీ ఇద్దువు గానీ, తీసుకుంటా అని శైలేంద్ర అంటాడు. ఏంటో అన్నయ్యా నువ్వు సరదాగా మాట్లాడతావో వ్యంగంగా మాట్లాడతావో ఇప్పటికీ అర్థం కాదు. ఎలా ఉంది నీ ఫారిన్ లైఫ్. ఇక్కడ బాగుందా. అక్కడ బాగుందా. అని రిషి అంటాడు. నాకు ఎక్కడున్నా ఒకటే రిషి. నేను ఎక్కడుంటే అక్కడా నా చుట్టూ పరిసరాలన్నీ నాకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి అని శైలేంద్ర అంటాడు. మారిపోవడం కాదు. నువ్వే మార్చేసుకుంటావ్ అని రిషి అంటాడు.

Guppedantha Manasu

ఏప్రిల్ 27వ ఎపిసోడ్ లో..: వసుధార వెళ్లిపోయి ఆలోచిస్తుంటే వెనుకే వెళ్లిన జగతి ఏమైంది అని అడుగుతుంది. ప్రాణం పోయేంత యాక్సిడెంట్ చేశారు మేడమ్. ఇప్పుడు ఎంత లైట్ గా మాట్లాడుతున్నారు. నేను ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదట అని జరిగింది మొత్తం చెబుతుంది వసుధార. ఇలాంటివి ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిది. రిషి కోసం ఆలోచించూ అని జగతి చెబుతుంది. తర్వాత శైలేంద్ర తెచ్చిన గిఫ్ట్స్ పంచుతుంటాడు. వదిన కోసం ఏం తెచ్చావ్ అని రిషి అడిగితే.. అది తనకు గదిలోనే ఉస్తాను. ఇక్కడ ఇచ్చేది కాదు అని శైలేంద్ర అంటాడు. తర్వాత వసు ఆలోచిస్తూ కింద పడబోతుంటే రిషి పట్టుకుంటాడు. నేను మనుషుల్నీ అంచనా వేయడంలో పొరబడతానా. నేను ఎవరినైనా చాలా సరిగ్గా అంచనా వేస్తాను కదా అని వసు అంటుంది.

ఏప్రిల్ 28వ ఎపిసోడ్ లో..: మీ అన్నయ్యా అని వసు చెప్పబోతుంటే మా అన్నయ్యా చాలా మంచోడు. తనకు నేనంటే చాలా ఇష్టం. పెద్దమ్మా ఇద్దరిని ఒకేలా పెంచింది అంటూ సంతోషంగా చెబుతాడు. దీంతో వసు ఏం మాట్లాదు. ధరణి దగ్గరికి వెళ్లిన దేవయాని తిడుతూ ఉంటుంది. నా కొడుక్కి నచ్చే భార్యను నేను తీసుకుని రాలేకపోయాను అని అంటుంది. అద విన్న జగతి ఏంటీ అక్కయ్యా. ఏదైనా తప్పు ఉంటే చెప్పాలి. భర్తతో ఎలా మసులుకోవాలో కూతురిలా చెప్పాలి. కానీ అలా బాధపడేలా తిట్టడం ఏంటి అని జగతి అంటుంది. నువ్వు పాఠాలు కాలేజీలో చెప్పుకో నాకు కాదు అని ధరణితో శైలేంద్ర కోసం టీ పెట్టిస్తుంది. ఆ టీని దేవయాని తీసుకెళ్తుంది. ఆ టీ నీతో ఇప్పించొచ్చు కదా. ఏం మనిషో అని జగతి అంటుంది.

Guppedantha Manasu

ఏప్రిల్ 29వ ఎపిసోడ్ లో..: జగతి, వసు. శైలేంద్ర వచ్చినప్పటినుంచి ధరణిలో సంతోషం లేదు. ధరణి శైలేంద్ర మధ్య సక్యత లేదేమో అని జగతి అంటుంది. ఆ మాటలు విన్న శైలేంద్ర.. అంటే వీళ్లు నన్ను గమనిస్తున్నారన్న మాట. జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దొరికిపోతాం అని అనుకున్న శైలేంద్ర.. ధరణి.. ధరణి.. అంటూ కిచెన్ లోకి వెళ్తాడు. ఏంటీ ధరణి ఎంత సేపు ఈ పని ఆ పని అంటూ వంట గదిలోనే ఉంటావా. నీతో మాట్లాడదామంటే సమయమే ఇవ్వట్లేదు. అసలు అగ్రీమెంట్ ఇంకా ఉన్నా ముందుగా ఎందుకు వచ్చానో తెలుసా. నీ కోసమే అని గట్టిగా శైలేంద్ర నాటకం ఆడతాడు. అందుకు ధరణి సంతోషిస్తుంటే.. ఏంటీ పొంగిపోతున్నావ్. అంతా వద్దు. నువ్ ఇలా ఉంటే అందరికీ నా మీద డౌట్ వస్తుంది. పిన్నీ వాళ్లు చూస్తున్నారని ఇలా మాట్లాడుతున్నా. నువ్వు కూడా కాస్తా నవ్వుతూ గ్లో ముఖంతో ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు శైలేంద్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X